రోశయ్య మృతదేహానికి పోస్టుమార్టం | Remand Prisoner neelam Rosaiah postmartem compleated | Sakshi
Sakshi News home page

రోశయ్య మృతదేహానికి పోస్టుమార్టం

Published Wed, Sep 20 2017 12:33 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM

రోశయ్య మృతదేహానికి పోస్టుమార్టం

రోశయ్య మృతదేహానికి పోస్టుమార్టం

రిమాండ్‌ ఖైదీ రోశయ్య మృతదేహానికి పోస్టుమార్టం
మార్కాపురం : గుండెపోటుతో మృతి చెందిన మార్కాపురం సబ్‌జైలు రిమాండ్‌ ఖైదీ నీలం రోశయ్య మృతదేహానికి ఏరియా వైద్యశాలలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఒంగోలుకు చెందిన ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుబ్బారావులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆర్డీఓ పెంచల కిశోర్, సీఐ బత్తుల శ్రీనివాసరావు, పట్టణ, రూరల్‌ ఎస్సైలు శ్రీకాంత్, మల్లికార్జునరావు, జైలు సూపరింటెండెంట్‌ ఉమామహేశ్వరరావులు ఉన్నారు.

న్యాయ విచారణకు డిమాండ్‌..
మృతుడు రోశయ్య కుటుంబానికి న్యాయం చేయాలని దళిత సంఘా నాయకులు  ఏరియా వైద్యశాలలో మార్చురీ గది మంగళవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు.

జిల్లా పౌరహక్కుల సంఘం సభ్యుడు కె.జయరాం, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య, ఉపాధ్యక్షుడు దాసరి శివాజీ, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.అరుణ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియస్‌ మాట్లాడుతూ దోర్నాల పోలీసుల చిత్రహింసలు, జైలు సిబ్బంది నిర్లక్ష్యం రోశయ్య ప్రాణాలను బలితీసుకుందని ఆరోపించారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement