రాజమండ్రి : కోర్టు విచారణకు తీసుకెళ్లే క్రమంలో ఓ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో తమిళనాడుకు చెందిన కంగరవల్లి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఇతను తిరుపతిలో కోర్టు విచారణకు హాజరై తిరిగివస్తూ రాజమండ్రి బస్టాండ్ వద్ద పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. పోలీసులు ఖైదీ కోసం గాలిస్తున్నారు.