చంచల్‌గూడ: సైబర్ నేరాల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నైజీరియన్ దేశస్తుడు న్వాంబా గురువారం జైలు వద్ద హల్‌చల్ చేశాడు. జైల్లో విదేశీయుల బ్యారెక్‌లో ఉన్న అతను ఇతరులతో గొడవ పడటంతో ప్రత్యేక సెల్‌కు తరలించారు. మానసిక వ్యాధితో బాధ పడుతున్న అతడిని జైలు అసుపత్రి వైద్యుల సూచన మేరకు ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించే క్రమంలో గురువారం పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment