హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్కు శుక్రవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. పాలకొల్లు - నర్సాపూర్ మధ్య గోరింటాడ గ్రామ సమీపంలో రైలు పట్టా విరిగింది. ఆ విషయాన్ని గుర్తించి రైల్వే సిబ్బంది ఆ ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేశారు. దాంతో రైలు పట్టాను సరిచేసేందుకు రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.