రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలో కడప-కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా ఉంచిన 132 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు మూడు టన్నులు ఉంటుందని సమాచారం. అయితే, దాడుల సమయంలో స్మగ్లర్లు అటవీ అధికారులపై రాళ్ల దాడికి పాల్పడి పరారయ్యారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.