పెనుగొండ: అనంతపురం జిల్లా పెనుగొండ పోలీసులు శనివారం మధ్యాహ్నం రూ.5 ల క్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు నుంచి బెంగళూరు వైపు వెళ్తోన్న టెంపో వాహనాన్ని మండలంలోని హరిపురం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ఆపి తనిఖీ చేయగా 44 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. తరలిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.