కడపలో ఎర్రచందనం దొంగల అరెస్ట్
Published Thu, Feb 25 2016 2:30 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా కడప-రాయచోటి రహదారిపై కాంపల్లి చెక్‌పోస్ట్ వద్ద ముగ్గురు ఎర్ర చందనం దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్‌పేరేడ్ మైదానంలో గురువారం విలేకరుల సమావేశం పెట్టారు. వివరాలను జిల్లా ఎస్పీ నవీన్ గులాటి వెల్లడించారు. పట్టుబడిన ప్రవీణ్‌కుమార్, మహ్మద్ షరీఫ్, చీకటి చంద్రశేఖర్ అంతా అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అనుచరులని తెలిపారు. వీరి నుంచి 2.2 టన్నుల 107 ఎర్రచందనం దుంగలు, 3 కార్లు, 1 ఐచర్ వాహనం, 4 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. కోటి ఉంటుందని అన్నారు.
Advertisement
Advertisement