
శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్వాధీనం
తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ ఎర్రచందనం కూలీలు ఫారెస్ట్ సిబ్బందిపై రాళ్లతో, గొడ్డలితో దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అటవీ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడంతో దుంగలను వదిలేసి వారు పరారయ్యారు. ఈ ఘటనలో 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమలకు 16 కిలోమీటర్ల దూరంలోని గెంజిబండ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. 23 దుంగలతోపాటు, ఓ గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు.