అగ్నికీలలను నాసా ముందే పసిగట్టింది | TTD finally wakes upto Seshachalam forest fire | Sakshi
Sakshi News home page

అగ్నికీలలను నాసా ముందే పసిగట్టింది

Published Thu, Mar 20 2014 10:29 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

TTD finally wakes upto Seshachalam forest fire

తిరుమల : శేషాచలం కొండల్లో మంటలు చాలా రోజుల ముందే చెలరేగాయా? మంటలు అంటుకున్న విషయం అటవీశాఖ అధికారులకు ముందే సమాచారం ఉందా? హెచ్చరికలు వచ్చినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించలేదా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. శేషాచలం అడవుల్లో మంటలను నాసా ముందే గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ నెల రెండో తారీఖునే అగ్నికీలలను పసి గట్టిన నాసా... అటవీశాఖ అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. శేషాచలం అటవీ ప్రాంతంలో దావానలంపై అధికారులకు ఫోన్ల ద్వారా సందేశాలు పంపిన నాసా అధికారులు... తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హెచ్చరికలను అటవీశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని అందువల్లే ప్రమాద తీవ్రత పెరిగిందనే వాదన వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement