seshachalam forest
-
తిరుమలలో అద్భుత దృశ్యాలు..
-
అడవి పిలుస్తోంది!
సాక్షి,అమరావతి: ప్రకృతి ఒడిలో సేద తీరాలని.. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొద్ది రోజులపాటు దూరంగా, ప్రశాంతంగా గడపాలనుకునేవారికి అడవి ఆహ్వానం పలుకుతోంది. ఇందుకోసం అటవీ ప్రేమికులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు అటవీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. తూర్పు కనుమల్లో నల్లమల, శేషాచలం, ఎర్రమల, పాపికొండలు ఇలా పలు అడవులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఈ అడవుల్లోని కొత్త ప్రదేశాలు, కొండలు, లోయల సందర్శనలు, ట్రెక్కింగ్ పట్ల పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. విభిన్న వృక్ష, జంతుజాలానికి ఆలవాలం.. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం.. 1.64 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో 36,914 చదరపు కిలోమీటర్లలో (22.46 శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులో 8,139 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం రిజర్వు అటవీ ప్రాంతం. శ్రీశైలం–నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు, రాయల్ ఎలిఫెంట్ రిజర్వు, శేషాచలం బయోస్పియర్.. ఇవి కాకుండా 3 జాతీయ పార్కులు, 13 వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. ఇవన్నీ విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలు, గొప్ప జీవవైవిధ్యం, ప్రత్యేకమైన వృక్ష, జంతుజాలంతో విలసిల్లుతున్నాయి. 30కి పైగా ప్రదేశాలు.. తలకోన, ఉబ్బలమడుగు, నేలపట్టు, పులికాట్, పెంచలకోన, బైర్లూటి, పెచ్చర్ల, మారేడుమిల్లి, కంబాలకొండ, తెలినీలాపురం, చొల్లంగి, వంటి 30కిపైగా పర్యావరణ పర్యాటక ప్రదేశాలను ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఈ సంవత్సరం తలకోన ప్రాంతాన్ని 2 లక్షల మంది సందర్శించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉబ్బలమడుగు, మారేడుమిల్లి, చొల్లంగి ప్రాంతాలకూ లక్షల మంది వస్తున్నారు. వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసి ప్రజలకు చేరువ చేసేందుకు అటవీ శాఖ ప్రణాళిక రూపొందించింది. థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు.. ప్రతి జిల్లాలో కొత్తగా నగర వనాలు, వనమిత్ర, జూపార్కులకు అనువైన ప్రదేశాలను అధికారులు గుర్తించనున్నారు. అలాగే ఉన్నవాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్కడకు వచ్చిన పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా ఏర్పాట్లు, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, అవుట్డోర్ జిమ్ వంటివి నెలకొల్పనున్నారు. తద్వారా అన్ని వయసుల వారిని ఆకర్షించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే అటవీ, స్థానిక గిరిజన సంఘాలు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను అక్కడ విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాశి వనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం వంటి థీమ్ పార్కులు సృష్టించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం కడపలో ఉన్న నగర వనం మోడల్లో అన్ని నగర వనాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి ఈ ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించే యత్నాలు ఊపందుకుంటున్నాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్ట్, ఇతర అడవుల సందర్శనకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నారు. కర్ణాటక తరహాలో జంగిల్ లాడ్జిలు, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో పర్యాటక అద్భుతాలు అటవీ సందర్శనలు, ప్రకృతి పర్యటనలకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే తలకోన, బైర్లూటి వంటి ఎన్నో అందమైన పర్యావరణ పర్యాటక ప్రాంతాలున్నాయి. శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాలున్నాయి. ప్రజలు అక్కడికి వెళ్లి ఆహ్లాదంగా గడపొచ్చు. ఇలాంటి పర్యటనల ద్వారా ప్రజలు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగించకుండా, వన్యప్రాణులు, మొక్కలకు నష్టం కలిగించకుండా పర్యాటకులు నడుచుకోవాలి. రాష్ట్రంలో కొత్త తరహా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు ఇందులో భాగమవ్వాలి. – మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
శేషాచలం.. నల్లమల.. అడవి ఏదైనా జల్లెడ పట్టడమే వారి విధి
సాక్షి, రాయచోటి: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు అడవిబాట పడుతున్నారు. ఇంతకుమునుపు మావోయిస్టుల ప్రాబల్యం నేపథ్యంలో అనునిత్యం అరణ్యంలో గడుపుతూ వచ్చారు. అయితే కాలక్రమేణా మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడం.. ఎర్రచందనం స్మగ్లర్ల బెడద పెరిగిపోవడంతో వారిని ఎదుర్కొనేందుకు ఖాకీలు శ్రమిస్తున్నారు. ఒక వైపు స్మగ్లర్లు, మరోవైపు ఎర్రచందనం కూలీల చర్యలు తిప్పికొట్టేందుకు అడవిలోనే మకాం వేస్తున్నారు. అడవిలో అనేక రకాల సవాళ్లు.. కష్టాలు ఎదురవుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఇష్టంగా ముందుకు వెళుతున్నారు. ఒక్కరోజులో పదుల సంఖ్యలో కొండలు, గుట్టలు..వాగులు, వంకలు దాటుకుంటూ ఎర్రచందనం చెట్ల రక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. సుమారు 20 మందితో కూడిన కూంబింగ్ దళం ప్రతినెల మూడు వారాలపాటు అడవిలోనే తిరుగుతోంది. అరణ్యంలో కిలోమీటర్ల మేర నడక అన్నమయ్య జిల్లాలో నల్లమలతోపాటు ఎర్రమల, శేషాచలంతోపాటు ఇతర పలు రకాల అడవులు విస్తరించాయి. ప్రధానంగా ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్న కొండల్లోకి బృందం అడుగు పెట్టిందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నడకే సాగుతుంది. ఆహారం తీసుకునే సమయం మినహా మిగతా సమయంలో అడవినంతా జల్లెడ పడతారు. తెల్లవారుజామున 4 గంటలకే లేవడం, ఒక ప్రాంతంలో టిఫెన్ చేసుకుని ఉదయాన్నే 6 గంటలకు అలవాటు ఉన్న వారు తినడం, లేని వారు పార్సిల్ కట్టుకుని నడక మొదలు పెడతారు. అక్కడి నుంచి అటవీశాఖ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపడతారు. నడిచే సమయంలో మాట్లాడకుండా, సెల్ఫోన్లు చూడకుండా తుపాకీ భుజాన పెట్టుకుని కూంబింగ్‌లో భాగంగా వేట కొనసాగుతుంది. అలా మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం వరకు తిరగడం, రాత్రికి సమీప ప్రాంతంలోనే టెంటు వేసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అందులోనూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కాకుండా బయట ప్రాంతాలను ఎంచుకుంటారు. అడవిలో నీరు నిల్వ ప్రాంతాలకు జంతువులు వచ్చే అవకాశం ఉండడంతో కూంబింగ్ దళం సమీప ప్రాంతాల్లో ఎక్కడా టెంట్లు వేసుకోరు. దుంగలు దొరికితే ‘అడవంత కష్టం’ అడవిలో కొండలు, రాళ్లు, చెట్ల పొదలను దాటుకుని నడవడమే కష్టం. అలాంటిది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసుకున్న దుంగలు కూడా ఒక్కోసారి కనబడతాయి. ఈ తరుణంలో వాటిని అటవీ ప్రాంతం నుంచి బయటికి తీసుకు రావాలన్నా...అడవిలో మోయాలన్నా అడవంత కష్టముంటుంది. ఎందుకంటే ఒకవైపు బ్యాగు, మరోవైపు తుపాకీ, ఇంకోవైపు ఎర్రచందనం దుంగలను ఎత్తుకుని కాలిబాటగా రావాల్సిందే. కనీసం బయటికి సమాచారం ఇవ్వడానికి సెల్ఫోన్లు పనిచేయవు.. సిగ్నల్స్ ఉండవు. కేవలం భుజానికి ఎత్తుకుని కిలోమీటర్ల మేర నడవడమే మార్గం. అనుక్షణం అప్రమత్తం అడవిబాట పట్టిన పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీరు నిల్వ ఉన్నచోట, మధ్యాహ్న సమయంలో స్వయంగా ఈ బృందమే వంట సిద్ధం చేసుకుని తిని వెళతారు. అయితే ఒకవైపు స్మగ్లర్లు, ఎర్రచందనం కూలీలతో ముప్పు పొంచి ఉంటుంది. మరోవైపు అడవి జంతువులతోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో ప్రధానంగా విష సర్పాలు, పురుగులతో సహవాసం తప్పదు. రాత్రి సమయంలో సెల్ఫోన్ల లైటింగ్ కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రాత్రి పూట ఒక సెంట్రీ అడవిలో కూంబింగ్ నిర్వహణకు వెళ్లిన పోలీసులు నిద్రపోయే సమయంలో కూడా ఒక సెంట్రీ పహారా కాస్తారు. రాత్రంతా రెండు గంటలకు ఒకరు చొప్పున మారుతూ డ్యూటీలు చేస్తారు. పగలంతా నడక చేసినా రాత్రి పూట కూడా వారందరికీ రక్షణగా ఒకరు మేలుకుని విధులు నిర్వర్తిస్తారు. ఎందుకంటే రాత్రిపూట స్మగ్లర్లు, కూలీలు, అడవి జంతువుల దాడుల నేపథ్యంలో కచ్చితంగా ఒక పోలీసు నిద్ర మేల్కొని సెంట్రీ డ్యూటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. జోరు వానలో.. ఎముకలు కొరికే చలిలో.. కూంబింగ్ దళానికి సంబంధించి ఒక ఆర్‌ఎస్‌ఐతోపాటు ఒక లోకల్ ఎస్ఐ, పది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు అటవీశాఖ సిబ్బందితో కలిసి అడవిలోకి వెళితే వర్షం వణికిస్తున్నా.. చలి చంపేస్తున్నా.. మంచు కమ్మేస్తున్నా.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవమే లక్ష్యంగా అడుగు మాత్రం ముందుకు పడాల్సిందే. ఒక్కోసారి అడవిలోకి బృందం వెళ్లిందంటే మూడు రాత్రులతోపాటు నాలుగు పగళ్లు అక్కడే ఉండి ఇంటికి చేరుకుంటారు. జిల్లా కేంద్రం నుంచి చుట్టు పక్కల అటవీ ప్రాంతం సమీపం వరకు వాహనం వదిలి వస్తుంది. నాలుగు రోజుల తర్వాత అడవి నుంచి బయటికి రాగానే మళ్లీ వాహనం వెళ్లి తీసుకు వస్తుంది. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకే కూంబింగ్ అన్నమయ్య జిల్లాలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. అయితే కొంతమంది స్మగ్లర్లు, తమిళ కూలీలు అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో కఠినంగా ముందుకు వెళుతున్నాం. – వి.హర్షవర్దన్‌రాజు, జిల్లా ఎస్పీ, అన్నమయ్య జిల్లా రోజుకు 40 కిలోమీటర్ల మేర నడక అడవిలోకి కూంబింగ్ వెళ్లిన దళం ఉదయం 6 గంటలకు నడక మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు సాగుతూనే ఉంటుంది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అడవిలో నడుస్తూనే ఉంటాం. ఒకరినొకరు మాట్లాడుకోకుండా గ్రూపులుగా అడవి అంతా జల్లెడ పడతాం. అడవినంతా గాలిస్తూ ముందుకు వెళతాం. ఎక్కువ యుక్త వయస్సు వారే ఉంటుండడంతో ఎక్కువ కిలోమీటర్లు నడవగలగడంతోపాటు వంట కూడా మేమే చేసుకుంటాం. – తులసిరామ్, కానిస్టేబుల్, రాయచోటి అక్రమ రవాణాను అడ్డుకోవడమే సవాలుగా తీసుకుని.. అడవిలోకి వెళుతున్నామంటే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్న సంకల్పంతో ముందుకు వెళతాం. ఎలాంటి సవాళ్లు ఎదురైనా కూడా భయపడం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురైనా వారిని అదుపులోకి తీసుకునేందుకు అడవినంతా గాలిస్తాం. అడవిలో ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఉన్నా అడుగు మాత్రం వెనక్కి పడదు. – రెడ్డిశేఖర్, కానిస్టేబుల్, రాయచోటి -
తొట్లు అమర్చి.. దాహార్తి తీర్చి
రాజంపేట: ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవిలోప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. అడవిలో నీటి వనరులు ఎండిపోయి దాహంతో అలమటించే మూగజీవాలు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి, అందుకే వాటి దాహార్తి తీ ర్చేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డివిజన్ పరిధిలో శేషాచలం 1.23లక్షల హెక్టార్లలో,పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యం 23వేలహెక్టార్లలో విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నెలవు.. శేషాచలం అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జీవ వైవిధ్య అటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తించింది. ఇక్కడ ఎక్కడాలేని విధంగా అనేక రకాలైన వన్యప్రాణులు, జంతువులు ఉన్నాయి. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉంది. ఇందులో భాగంగా చిత్తూరు, తిరుమల, వైఎస్సార్ జిల్లా అడవుల్లోని జంతువుల సంరక్షణపై దృష్టి సారించారు. కాగా జిల్లాలో శేషాచలం, పెనుశిల, లంకమల్ల అభయారణ్యాలు ఉన్నాయి. అరుదైన జంతువులకు నిలయం శేషాచలం.. శేషాచలం విస్తీర్ణం 82,500 ఎకరాలు. 2010లో జీవ వైవిధ్య నెలవుగా గుర్తించారు. దేశంలో ఉన్న బయోస్పెయిర్ జాబితాలో శేషాచలం అడవి చేరింది. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో విస్తరించింది. శేషాచలం అడవిలో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల పునుగుపిల్లలు, పక్షులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు ఉన్నాయి. ఇవి ఆ యా ప్రాంతాల్లోని రోడ్లపైకి నీటి కోసం వస్తున్నాయి. 8 శేషాచలంలో సహజ వనరులు శేషాచలంలో సహజ వనరులు ఉన్నాయి. వర్షాకాలంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, వేసవిలో అరకొరగా అయినా నీటి వనరులు అందుబాటులో ఉంటాయి. పెనుశిల అభయారణ్యంలో కూడా సహజవనరులు ఉన్నట్లుగా అటవీ వర్గాలు భావిస్తున్నాయి. పది కుంటలు ఉన్నాయి. ఆరు చెక్‌డ్యాంలున్నాయి. నీటి ఎద్దడి నివారణలో భాగంగా ఇవి దోహదపడతాయి. నిరంతర పర్యవేక్షణ రాజంపేట, సానిపాయి, చిట్వేలి, రైల్వేకోడూరు రేంజ్‌లు ఉన్నాయి. బేస్‌క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 80 మంది ప్రొటెక్షన్ వాచర్లను నియమించారు. ఇక్కడ 25 కెమెరాలు అమర్చారు. వేసవిలో వన్యప్రాణులు దాహార్తికి అల్లాడిపోకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. మూగజీవాల తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు అడవిలోని వివిధ ప్రాంతాల్లో 12 మొబైల్ సాసర్పిట్లు ఏర్పాటు చేశారు. చెట్లకు ఉప్పుముద్దలు కట్టారు. దాహార్తి ఉన్న జంతువులు ఉప్పుముద్దలను నాకితే ఉపశమనం కలుగుతుంది. 2వేల నుంచి 3వేల లీటర్ల కెపాసిటీతో నీటి వనరులను వన్యప్రాణులకు అందుబాటులో ఉంచారు. ప్రత్యేక రక్షణ చర్యలు శేషాచలం అటవీ ప్రాంతంలో జంతువుల సంరక్షణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు 12 సాసర్పిట్లు, 12 మొబైల్ సాసర్పిట్లను ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నాం. జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
Seshachalam Hills: మాట వినం..తాట తీస్తాం!
శేషాచల అడవుల్లో ఎర్ర స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఇష్టారాజ్యంగా అడవుల్లోకి చొరబడుతున్నారు. ఎర్రచందనం దుంగల నాణ్యత పరిశీలించేందుకు మొదట వాటి బెరడు తీసేస్తున్నారు. ఆపై నాణ్యత లేకుంటే అలాగే వదిలేస్తున్నారు. బెరడ తీసేయడంతో వందలాది వృక్షాలు నిలువునా ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణ కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి జిల్లా: శేషాచలం అడవుల్లో గొడ్డళ్ల చప్పుడు ఆగనంటోంది. తమిళ కూలీలు ఇష్టారాజ్యంగా చొరబడుతూ ఎర్రచందనం చెట్లను నేలకూల్చుతున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దు దాటించి జేబులు నింపుకుంటున్నారు. ఇందులో బడా స్మగ్లర్ల హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల కళ్లుగప్పుతున్నట్టు తెలుస్తోంది. క్వాలిటీ కోసం చంపేస్తున్నారు గతంలో ఎర్రచందనం వృక్షాలకు చిన్న పాటి రంధ్రం వేసి నాణ్యతను పరీక్షించేవారు. క్వాలిటీ ఉన్న చెట్లును నరికి తరలించేవారు. ఇప్పుడు కొత్త పంథాలో నాణ్యతను పరిశీలిస్తున్నారు. చెట్టును నరకకుండా పైన ఉన్న బెరడును తొలిచి నాణ్యతను చూస్తున్నారు. నాణ్యత లేకుంటే అలానే వదలేస్తున్నారు. బెరడు తీసేయడంతో ఎర్రచందనం చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. శేషాచలం మొత్తంగా కొన్నివందల చెట్లు ఇలా చనిపోయి ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల.. టన్ను రూ.1.5 కోట్లు ఎర్ర స్మగ్లర్లు నం.1 క్వాలిటీకే మెుదట ప్రాధాన్యత ఇస్తున్నారు. అడవిలో ఎన్ని కిలోమీటర్లు అయినా వెళ్లి నాణ్యమైన దుంగలు ఎంచుకుంటున్నారు. బహిరంగ వేలంలో నం.1(గ్రేడ్–1) ఎర్ర దుంగలు టన్ను రూ.1.5 కోట్లు పలుకుతున్నట్టు సమాచారం. ఆయుధాలతో ఎదురుదాడి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన వారిపై తిరుగుబాటుకు సైతం కూలీలు లెక్కచేయడంలేదు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఎర్రకూలీలను పూర్తిస్థాయిలో ఎదుర్కోవడం కొంత ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాపాడుకుంటాం ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. ఇప్పటికే ప్రభుత్వ, డిపార్టుమెంట్ ఆదేశలను పాటిస్తూ నిఘా పెట్టాం. వివిధ శాఖలతోపాటు అటవీసరిహద్దు గ్రామాల ప్రజల సహకారంతో ఎర్రచందనాన్ని కాపాడుకుంటాం. – పట్టాభి, రేంజర్, భాకరాపేట .. -
పేట్రేగిన ‘ఎర్ర’ దొంగలు
భాకరాపేట: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల తమిళ దండు దందా పేట్రేగిపోతున్నది. భాకరాపేట ఫారెస్టు రేంజర్ పట్టాభి కథనం మేరకు.. మూడు రోజుల క్రితం పీలేరు రూరల్ సీఐ, ఎర్రావారిపాళెం పోలీసులు నిర్వహించిన దాడుల్లో 12 మంది ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు. పారిపోయిన మరికొంతమంది కోసం తలకోన అటవీ ప్రాంతాన్ని రెండు రోజులుగా జల్లెడ పడుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున తలకోన సెంట్రల్ బీట్ పరిధిలో గాలిస్తుండగా..దొర్రికనుమ ప్రాంతంలో దుంగలు తీసుకొస్తూ కొంతమంది తారసపడ్డారు. వీరిని చుట్టుముట్టే క్రమంలో.. ఆ ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వారిని ఎదురుగానే ఎదుర్కోవాల్సి వచ్చింది. దొంగలు దుంగలు పడేసి రాళ్లు రువ్వుతూ పరుగులు దీశారు. వారిని వెంబడించగా కాటర్బాల్ సహాయంతో రాళ్లు రువ్వుతూ అటవీ ప్రాంతంలోకి జారుకున్నారు.1,103 కిలోల బరువు గల 36 దుంగలను స్వాధీనం చేసుకుని భాకరాపేట ఫారెస్టు కార్యాలయానికి తీసుకొచ్చినట్లు రేంజర్ తెలిపారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో ఎఫ్ఎస్వో రవిరావు, ఎఫ్‌బీవో వందనకుమార్, వినోద్‌కుమార్, శంకర్, బేస్‌క్యాంపు సిబ్బంది, తలకోన సీబీఈటీ సభ్యులు పాల్గొన్నారు. వాళ్లువీళ్లు ఒక్కటేనా? 2 రోజుల క్రితం జరిపిన దాడుల్లో పట్టుబడ్డ తమిళ స్మగ్లర్లు, మంగళవారం తప్పించుకున్న స్మగ్లర్లు ఒక బృందంలోని వారేనా అనే కోణంలో అటవీ అధికారులు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళ స్మగ్లర్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠా ఆటకట్టు
అనంతపురం క్రైం: శేషాచలం అడవుల నుంచి చెన్నై, శ్రీలంక మీదుగా చైనాకు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే అంతర్జాతీయ స్మగ్లర్లు బిలాల్, సాహుల్ బాయి ముఠా గుట్టును హిందూపురం రూరల్ పోలీసులు రట్టు చేశారు. ఇటీవల చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులో హిందూపురం రూరల్ సీఐ హమీద్‌ఖాన్, చిలమత్తూరు ఎస్ఐ రంగడు యాదవ్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల విలువ చేసే 3,305 కిలోల 165 ఎర్రచందనం దుంగలతోపాటు ఐదు వాహనాలు, 19 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు సంబంధించి 21 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 19 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 8 మంది తమిళనాడు, ఐదుగురు వైఎస్సార్ జిల్లా, ఆరుగురు చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు. దుబాయ్, కొలంబో వేదికగా.. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చెన్నయ్‌కి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లు బిలాల్, సాహుల్ హమీద్ అలియాస్ సాహుల్‌భాయ్ కీలక నిందితులు. బిలాల్ శ్రీలంక రాజధాని కొలంబోలో, సాహుల్‌భాయ్ దుబాయ్‌లో ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు. వీరిద్దరూ చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికించి, దుంగలను తమిళనాడులోని తిండివనం తరలించి గోదాముల్లో నిల్వ చేసేవారు. అక్కడి నుంచి చెన్నయ్, శ్రీలంక మీదుగా సముద్ర మార్గాన చైనాకు తరలించి భారీగా సొమ్ము చేసుకునేవారు. సాహుల్‌భాయ్‌పై వైఎస్సార్ జిల్లాలో 45, తిరుపతిలో సుమారు 40 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. బిలాల్‌పై వైఎస్సార్ జిల్లాలో 10 కేసులున్నాయి. ప్రస్తుత కేసులో పోలీసులు సాహుల్‌భాయ్‌ని ఏ–12గా, బిలాల్‌ను ఏ–13గా చేర్చారు. వీరిద్దరికీ ముఖ్య అనుచరుడైన కామేష్‌బాబు (కార్బైడ్ కాలనీ, కొడుంగైయూర్, చెన్నయ్) సహా 19 మంది పోలీసులకు చిక్కారు. కామేష్‌బాబుపై వైఎస్సార్ జిల్లాలో 16 కేసులు, తిరుపతిలో సుమారు 15 కేసులున్నాయి. ఇతనితో పాటు తిరుపతికి చెందిన జె.గురువయ్య, ఎం.జ్ఞానేంద్ర ప్రసాద్ (మురుగానపల్లి), ఇ.పునీత్‌కుమార్ (గిరింపేట), బి.రాకేష్ (చిత్తూరు), జులపాల సుబిరమని కొట్టి (కేవీబీ పురం), వినోద్‌కుమార్ గాంధీ (చెన్నయ్), తంగదురై రాజుకుమార్ (చెన్నయ్), కె.రవి (పల్లతుర్), ఎస్.కమలేష్ కుమార్ (తెన్పల్లిపట్టు), కుమార్‌బాబు (తిరువళ్లూరు), వైఎస్సార్ జిల్లాకు చెందిన నంద్యాల రామకృష్ణారెడ్డి, అంబరపు ఓబులేసు (మిట్టపల్లి), బోయిని రామనరసింహులు (ఉప్పరపల్లి), బిజివేముల జయసుబ్బారెడ్డి (బద్వేలు), పిచ్చిపాటి శ్రీనివాసులరెడ్డి (బొగ్గడివారిపల్లి), ఏనుగుల కేశవరెడ్డి (అన్నవరం, చాపాడు మండలం), అనంతపురం జిల్లా సోమన్నపల్లికి చెందిన కాకర్ల రామచంద్ర, నెల్లూరు జిల్లా నందిమలకు చెందిన సర్వాది ప్రసన్నకుమార్ కూడా పోలీసులకు చిక్కారు. -
318 టన్నుల ఎర్రచందనం.. రూ.182 కోట్ల ఆదాయం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ డిమాండ్ ఉన్న ఎర్రచందనం విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల రూ.182 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడంతో అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో అమ్మగా మిగిలిన 318 మెట్రిక్ టన్నుల దుంగలకు ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధిసంస్థ (ఏపీఎఫ్డీసీ) ద్వారా కొద్దిరోజుల కిందట విడతల వారీగా గ్లోబల్ టెండర్లు పిలిచి వేలం నిర్వహించారు. గతం కంటే డిమాండ్ బాగుండడంతో సుమారు రూ.100 కోట్ల ఆదాయం లభిస్తుందని మొదట అధికారులు భావించారు. చైనా ఇతర దేశాల మార్కెట్లో ఈ దుంగలకు మంచి ధర ఉండడంతో 80 శాతం ఎక్కువ ఆదాయం లభించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కిందట రాష్ట్రానికి ఇచ్చిన ఎర్రచందనం అమ్మకాల కోటా పూర్తయింది. 10 ఏళ్లలో 8,498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకం ఎర్రచందనం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న సరుకును బట్టి కేంద్రం రాష్ట్రాలకు అమ్మకపు కోటా నిర్దేశిస్తుంది. 10 సంవత్సరాల కిందట రాష్ట్ర కోటా కింద 8,498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. 2019 వరకు విడతల వారీగా గత ప్రభుత్వాల హయాంలో 8,180 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను విక్రయించారు. ఈ అమ్మకాలతో సుమారు రూ.1,700 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత కేంద్రం నిర్దేశించిన కోటాలో మిగిలిన 318 టన్నుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రూ.182 కోట్లకు అమ్మారు. దీంతో కేంద్రం ఇచ్చిన కోటా పూర్తయింది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఇంకా 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఉంది. శేషాచలం అడవుల్లో అక్రమంగా నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగల్ని అటవీశాఖ ఇటీవల కాలంలో భారీఎత్తున పట్టుకుని సీజ్ చేసింది. ఈ సరుకును అటవీశాఖ ఆధీనంలోని తిరుపతి సెంట్రల్ గోడౌన్లో భద్రపరిచారు. కేంద్రం కొత్త కోటా నిర్దేశిస్తే ఈ సరుకును కూడా అమ్మడానికి అటవీశాఖ సిద్ధంగా ఉంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఎర్ర చందనం నిల్వల గురించి చెప్పి అమ్మకానికి అనుమతి ఇచ్చే కొత్త కోటా నిర్దేశించాలని కేంద్ర అటవీ మంత్రిత్వశాఖను కోరింది. గతంలో కేటాయించిన కోటాకు సంబంధించిన వివరాలను మిగిలిన రాష్ట్రాలు పూర్తిగా ఇవ్వకపోవడంతో కొత్త కోటాను నిర్దేశించడానికి కేంద్రం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కోటా ప్రకారం పారదర్శకంగా విక్రయాలు జరిపిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కొత్త కోటా ఇవ్వాలని ఏపీ అటవీశాఖ కోరింది. -
శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు
తిరుమల: శేషాచలం కొండల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శేషాతీర్థం అటవీ ప్రాంతాల్లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. శేష తీర్థం సమీపంలోని డబ్బారెకుల కొనలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి మంటలు దట్టంగా వ్యాపించాయి. అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో అడవంతా అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే మంటలు చెలరేగిన ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులు చేరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ ప్రాంతానికి కనీసం మనుషులు చేరుకోడానికి ఒక రోజు సమయం పడుతుంది. దీంతో ఆ మంటలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే ఆ మంటలు ఎవరైనా ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవికాలంలో శేషచల కొండల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం సాధారణం. -
ఏపీలో పులులు పెరుగుతున్నాయ్!
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్–శ్రీశైలం అభయారణ్యంలో పులుల కారిడార్ విస్తరిస్తోంది. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ పులుల సంచారం ఉన్నట్టు అటవీ శాఖ గుర్తించింది. ఈ అభయారణ్యంలో గతంలో పులులు తిరిగే ప్రాంతం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో మాత్రమే ఉండేది. ఆ మూడు జిల్లాల్లోని నల్లమల అడవుల్లోనే పులులు సంచరించేవి. కొన్నేళ్లుగా ఇవి తిరిగే కారిడార్ నల్లమల నుంచి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల వరకూ విస్తరించింది. తరచూ నిర్వహిస్తున్న పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. అభయారణ్యం 3,727 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా.. 2,444 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా (కేంద్రీకృత ప్రాంతం)గా ఉంది. గతంలో అభయారణ్యాన్ని మూడు బ్లాకులుగా విభజించారు. పులుల కారిడార్ పెరుగుతుండటంతో.. కారిడార్ ఏరియాగా నాలుగో బ్లాక్ ఏర్పాటు చేశారు. ఈ బ్లాకులో రెండేళ్ల క్రితం కొత్తగా ఆరు పులులు కనిపించగా.. గతేడాది మరో మూడు కనిపించాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం అభయారణ్యం పరిధిలో మొత్తం 63 పులులున్నాయి. నాలుగేళ్ల క్రితం ఈ సంఖ్య 46 మాత్రమే. ఏటా పులుల సంఖ్య పెరుగుతుండగా.. ఈ ఏడాది కూడా పెరిగే అవకాశం ఉందని అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. లక్షల ఫొటోలను విశ్లేషించి.. జాతీయ స్థాయిలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పులుల గణన రాష్ట్రాల్లో మాత్రం ఏటా జరుగుతుంది. ప్రస్తుతం అభయారణ్యంలో రాష్ట్ర అటవీ శాఖ వార్షిక గణన నిర్వహిస్తోంది. నాలుగు బ్లాకుల్లోని ఆత్మకూరు, మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, కడప అటవీ డివిజన్లలో 597 అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కిలోమీటర్లకు రెండు చొప్పున కెమెరాలు పెట్టారు. అడవిలో పులులు వెళ్లే ప్రధాన దారుల్లో రెండు వైపులా రెండు జతల కెమెరాల చొప్పున అమర్చారు. ఈ కెమెరాలు వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఆటోమేటిక్‌గా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన 10 లక్షలకు పైగా ఫొటోలను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించి జంతువుల జాడను గుర్తిస్తారు. ప్రధానంగా పులుల సంఖ్య ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. ప్రతి పులి చర్మంపై ఉండే చారలు మన చేతి రేఖల్లానే ప్రత్యేకంగా ఉంటాయి. రెండు వైపులా చారలను గుర్తించి వాటి ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన పులులను లెక్కిస్తారు. ప్రస్తుతం రెండు బ్లాకుల్లో గణన పూర్తవగా మరో బ్లాకులో చివరి దశకు చేరింది. మరో బ్లాకులో త్వరలో ప్రారంభించనున్నారు. ఆగస్ట్ నాటికి లెక్కింపు పూర్తి కానుంది. రాష్ట్ర అటవీ శాఖ తీసిన ఫొటోలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) పరిశోధించి విశ్లేషిస్తుంది. వాళ్లు ఖరారు చేసిన తర్వాతే పులుల సంఖ్యను నిర్ధారిస్తారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్ దేశంలోనే పెద్దది దేశంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం అతి పెద్దది, ప్రత్యేకమైనది. పులులతోపాటు అనేక జీవరాశుల మనుగడకు ఇక్కడ అవకాశం ఎక్కువ. అందుకే కారిడార్ విస్తరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపట్టిన పులుల గణన ఆగస్ట్ నాటికి పూర్తవుతుంది. ఈ లెక్కింపు వల్ల పులుల పూర్తి సమాచారం తెలుస్తుంది. ప్రతి పులికి సంబంధించిన ఫొటోలు ఉంటాయి. కాబట్టి వాటిని సంరక్షించడం సులభమవుతుంది. – ఎన్.ప్రతీప్‌కుమార్, అటవీ దళాల అధిపతి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం అమర్చిన కెమెరాలు 50 శాతం కారిడార్‌ను కవర్ చేస్తాయి. కాబట్టి పులుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది పర్యావరణ, జీవావరణ సమతుల్యతకు కీలకం. – వై.శ్రీనివాసరెడ్డి, కన్జర్వేటర్, టైగర్ సర్కిల్ ప్రాజెక్ట్, శ్రీశైలం -
శేషాచలం అడవుల్లో మంటలు
సాక్షి, చిత్తూరు : తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. మొదటి ఘాట్‌రోడ్డులోని 33వ మలుపు వద్ద సాయంత్రం 6 నుంచి మంటలు ఎగిసిపడుతున్నా కనీసం ఫారెస్టు అధికారులు, ఫైర్ సిబ్బంది, విజలెన్స్ సిబ్బందికి సమాచారం అందలేదు. సుమారు ఒకటిన్నర గంట ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు హుటాహుటీన ఫైర్ ఇంజన్‌తో విజిలెన్స్ సిబ్బంది, ఫారెస్టు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అంతకుముందుగా తిరుమల నుంచి తిరుపతికి వెళ్లేస్థానికులు , భక్తులు ఈ మంటలను చూసి తమ వంతుగా మంటలను అదుపు చేసేందుకు అడవిమార్గంలోకి వెళ్లారు. అయినా వారి ప్రయత్నంతో కొద్దిసేపు మంటలు ఆగినా ఒక్కసారిగా ఈదురుగాలులు తోలడంతో మళ్లీ మంటలు చెలరేగాయి. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో టీటీడీ టోల్‌ప్రీ నెంబర్‌కు స్థానికులు, భక్తులు ఫోన్ చేశారు. అయినా మంటలు అదుపు కాకపోవడంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులపై నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో కొద్దిసేపు వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించారు. టీటీడీ అధికారులు రావడం ఆలస్యం కావడంతో అప్పటికే సుమారు 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణం ఆహుతైంది. -
శేషాచలం అడవుల్లో వందకుపైగా తమిళ స్మగ్లర్లు !
సాక్షి, తిరుపతి : శేషాచలం అడవుల్లో వంద మందికిపైగా తమిళ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు అనుమానిస్తున్నారు. గురువారం రాత్రి స్మగ్లర్ల కోసం టవేరా వాహనంలో ఆహార పొట్లాలను తీసుకురావటం అధికారులు గుర్తించారు. తిరుపతి ఎస్వీ జూ పార్కు సమీపంలో పొదల చాటున టవేరా బ్రాండ్ న్యూ కారు టాస్క్ ఫోర్స్ సీఐ మధు బృందం కంటపడింది. టవేరా కారు వద్దకు వారు వెళుతుండగా మరో కారు అక్కడకు చేరుకుంది. అధికారులను గమనించిన స్మగ్లర్లు కారును వేగంగా వెనక్కు తిప్పి చంద్రగిరి వైపు మళ్లించారు. దీంతో సీఐ మధు ఆ కారును వెంబడించారు. కారు వడమాలపేట మార్గంలో తప్పించుకుంది. దీంతో వెనక్కు వచ్చిన అధికారులు టవేరా వాహనాన్ని పరిశీలించగా అందులో వందకు పైగా చపాతీ ప్యాకెట్లు వాటికి కర్రీ ప్యాకెట్లు, బస్తా బియ్యం, వంటకు అవసరమైన వస్తువులు, 200 హాన్స్ ప్యాకెట్లు, బీడీ బండలు ఉన్నాయి. అక్కడ కారును రిపేర్లు చేసిన బిల్లు వారికి దొరికింది. ఆ బిల్లులో తమిళనాడు ఆరణిలోని ఓ కారు మెకానిక్ షాపు అడ్రసు ఉంది. తిరువన్నామలై జిల్లాకు చెందిన రెండు అధార్ కార్డులు ఉన్నాయి. సీఐ మధు మాట్లాడుతూ.. అడవులలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలింపులు చర్యలు తీవ్రం చేయనున్నట్లు తెలిపారు. అధార్ కార్డుల అధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారి అచూకీ కనుగొంటామన్నారు. ఖచ్చితంగా అడవులలో పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు ఉన్నారని దానికి సంబంధించిన ఆధారాలు తమకు లభించినట్లు తెలిపారు. ఐజీ శ్రీకాంతారావు దీనికి సంబంధించిన సూచనలు అందజేశారు. ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎస్ఐ సోమశేఖర్, రైటర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
ఆగని స్మగ్లింగ్..!
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చాపకింద నీరులా జరుగుతూనే ఉంది. అందులో బాలుపల్లి రేంజ్ కీలకంగా మారింది. ఈ రేంజ్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ గత నాలుగేళ్లుగా యథేచ్ఛగా సాగుతోంది. 20 రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ప్రొటెక్షన్ వాచర్లు కూడా పోలీసులకు చిక్కడం గమనార్హం. అడవులపై పూర్తి స్థాయి అవగాహన, ఏ స్మగ్లింగ్‌కు ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి తదితర విషయాలపై పోలీస్, టాస్క్‌ఫోర్స్ అధికారులకంటే వీరికే ఎక్కువ అవగాహన ఉంటుంది. పట్టుబడిన స్మగ్లర్ల వెనుక ఎవరున్నారనే విషయాలపై పూర్తి స్థాయి విచారణ జరపకపోవడం వల్ల స్మగ్లింగ్ నిరాఘాటంగా కొనసాగుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో అటవీశాఖ వైఫల్యం చెందిందనే అభిప్రాయంతో ప్రభుత్వం పోలీస్ శాఖకు అన్ని అధికారాలు ఇచ్చి కొంతకాలానికి ప్రత్యేకంగా ఎర్ర చందనం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహిస్తున్నా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదంటే దీనికి కారణం ఇంటి దొంగలేనని చెప్పవచ్చు. ఇటీవల పట్టుబడిన ప్రొటెక్షన్ వాచర్ల ఉదంతమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు కేవలం బాలుపల్లి రేంజ్ పరిధిలోనే 45 కేసులు నమోదు చేసి 11వేల 804 కేజీల బరువు గల 510 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 14 మందిని అరెస్ట్ చేశారు. రెండు రోజులక్రితం కూడా 8 దుంగలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారంటే అడవుల్లో స్మగ్లర్లు ఎంతమంది మకాం వేశారో అర్థమవుతోంది. అటవీశాఖలో పని చేస్తున్న ప్రొటెక్షన్ వాచర్లు స్మగ్లర్లకు సహకరిస్తున్నారంటే ఇలా ఇంటిదొంగలు ఎందరు ఉన్నారో పై అధికారులు తేల్చాల్సి ఉంది. -
13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సాక్షి, చంద్రగిరి: శేషాచలంలోని ఎర్రగుట్ట ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా దాచిన 13 ఎర్రచందనం దుంగలను ఆర్ఎస్సై వాసు బృందం ఆదివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఆర్ఎస్సై వాసు బృందం కూంబింగ్ చేపట్టారు. నరసింగాపురం ఎస్టీకాలనీ వద్ద కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అధికారులను చూసి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాడు. అధికారులు వెంబడించినా లాభం లేకపోయింది. ఎర్రగుట్ట వద్ద తనిఖీ చేయడంతో చెట్ల పొదల్లో దాచిన సుమారు 13 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన కూలీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడుల్లో డీఆర్వో నరసింహరావు, ఎఫ్‌బీవో జానీబాషా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కనిపిస్తే కాల్చేయండి
-
శేషాచలం అడవుల్లో కూంబింగ్
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. పెరుమాళ్లపల్లి వద్ద అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం కూంబింగ్ జరుపుతుండగా 8 మంది తమిళ కూలీలు వారికి తారసపడ్డారు. వారి వద్ద నుంచి 7 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు తమిళ కూలీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదం.
-
శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదం
చిత్తూరు: తిరుమలలోని శేషాచలం అడవుల్లో సోమవారం మంటలు చెలరేగాయి. శ్రీవారి మెట్టు సమీపంలోని చీకటీగల కోన, బాలాజీనగర్ అటవీ ప్రాంతాల్లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి సమయం కావడంతో కొండ కింద ప్రాంతాలకు ఎగిసిపడుతున్న మంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
పోలీసులపై 'ఎర్ర' కూలీల దాడి : ఇద్దరి అరెస్ట్
-
పోలీసులపై 'ఎర్ర' కూలీల దాడి : ఇద్దరి అరెస్ట్
చంద్రగిరి : చిత్తూరులో ఎర్రచందనం కూలీలు మరోసారి రెచ్చిపోయారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఆదివారం రాత్రి పోలీసులకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కూలీలు ఎదురుపడ్డారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నస్తుండగా పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లక్ష్మీపురం చెరువు సమీపంలో ఇద్దరు కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం శేషాచలం అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. -
పోలీసులపై ఎర్రచందనం కూలీలు దాడి
-
పోలీసులపై ఎర్రచందనం కూలీలు దాడి
చిత్తూరు : తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహించారు. పుట్టగడ్డ సమీపంలో వారికి 20 మంది ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దాంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై వారు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో కానిస్టేబుల్ దిలీప్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని రుయా ఆసుపత్రికి తరలించారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో పలువురు ఎర్రచందనం కూలీలు పరారైయ్యారు. వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంబడించారు. ఇద్దరు ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్వాధీనం
తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ ఎర్రచందనం కూలీలు ఫారెస్ట్ సిబ్బందిపై రాళ్లతో, గొడ్డలితో దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అటవీ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడంతో దుంగలను వదిలేసి వారు పరారయ్యారు. ఈ ఘటనలో 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమలకు 16 కిలోమీటర్ల దూరంలోని గెంజిబండ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. 23 దుంగలతోపాటు, ఓ గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు. -
శేషాచల అడవుల్లో అగ్ని ప్రమాదం
తిరుమల: తిరుమలలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. సాయంత్రం 4.45 గంటలకు ఇక్కడి బాలాజీనగర్‌కు కిలోమీటరు దూరంలోని టెంకాలతోపు వద్ద అడవిలో మంటలు చెలరేగాయి. సమాచారంతో ఫారెస్ట్ రేంజర్ రామ్లానాయక్, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, సిబ్బందితో కలసి సంఘటన స్థలికి చేరుకున్నారు. వాటర్ బ్యాగులతో నీటిని చల్లుతూ మంటలు ఆర్పివేశారు. సుమారు 50 మీటర్ల విస్తీర్ణంలోని అడవి కాలిందని అధికారులు తెలిపారు. -
పోలీసులపై రాళ్లు రువ్విన ఎర్రచందనం కూలీలు
తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో బాలుపల్లి రేంజ్ కందిమడుగు వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. అయితే పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు ఎర్రచందనం కూలీలను రక్షించేందుకు ప్రయత్నించారు. అందులోభాగంగా పోలీసులపైకి ఎర్రచందనం కూలీలు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై.... గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పరారైయ్యారు. పోలీసులు వారి కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. శేషాచల అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నేతృత్వంలో కూంబింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
శేషాచలంలో మూగవేదన...
ప్రమాదాల్లో అరుదైన జాతుల మృత్యువాత ఏటా పెరుగుతున్న ప్రమాదాలు వన్యప్రాణి సంరక్షణ పట్టని టీటీడీ ఫారెస్ట్ విభాగం తిరుమల : ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న సామెత తిరుమల శేషాచలానికి చక్కగా సరిపోతుందేమో?. అరుదైన జంతుజాతులకు శేషాచలం ఆవాసమని అధికారులు ఊదరగొడుతున్నా.. ఆ స్థాయిలో వాటి సంరక్షణ గురించి పట్టించుకోవడంలేదు. ఫలితంగా తిరుమలకొండ రెండు ఘాట్లలో రోజూ అనేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి. క్రమంగా ఈ జంతుజాతులు క్షీణదశకు చేరుకుంటున్నాయన్న సత్యాన్నీ అధికారులు గుర్తించలేకపోతున్నారు. మృత్యువాత తిరుమల కొండ రెండు ఘాట్ రోడ్లలోనూ శ్రీవారి దర్శనం కోసం రోజూ 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వేకువజాము 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలవరకు వాహనాలు క్షణం కూడా సమయం ఇవ్వకుండా ప్రయాణిస్తుంటాయి. మిగిలిన మూడు గంటలూ టీటీడీ, ప్రభుత్వ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. మలుపులతో కూడిన ఈ రెండు ఘాట్‌రోడ్లలోనూ ఆహారాన్వేషణ కోసం అటుఇటు రోడ్లు దాటుతున్న జంతుజాతులు వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. ఇందులో చిరుతలు, జింకలు, దుప్పులు, పునుగు, పందులు, ముళ్లపందులు, గండ్రంగులు (కొండముచ్చులు) ఉన్నాయి. రోజూ 0.5 నుంచి 1 శాతం వరకు జంతువులు ప్రమాదాల బారినపడుతున్నట్లు నిపుణులు గతంలోనే లెక్కగట్టారు. రక్షణ చర్యలపై టీటీడీ ఫారెస్ట్ తీవ్ర నిర్లక్ష్యం టీటీడీ పరిధిలోని జంతుజాతుల రక్షణపై సంబంధిత విభాగం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రక్షణకు పెద్దపీట వేస్తున్న అధికారులు జంతువుల విషయంలో మాత్రం శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. ‘ఆ.. జంతువులే కదా.. ఒకటి చనిపోతే మరొకటి పుట్టుకొస్తుందిలే?’ అన్నధోరణితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అటకెక్కిన సిఫారసులు జంతు మరణాలు తగ్గించేందుకు రెండు ఘాట్‌రోడ్లలోనూ ఇనుప కంచె నిర్మించాలని నిర్ణయించారు. అదే సందర్భంలో రోడ్లు కింది భాగంలో జంతువులు అటుఇటు తిరిగేలా ప్రత్యేకంగా కల్వర్టులు కూడా నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో ఏ ఒక్కటి అమలు కాలేదు. దీనివల్ల జంతు మరణాలు పెరుగుతున్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణతోపాటు అరుదైనజంతుజాతుల భవిష్యత్ మనుగడ కోసమైన ప్రస్తుత టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అయినా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకృతి ప్రేమికులు విజ్ఞప్తి చేశారు. అమలుకాని వన్యప్రాణి చట్టం ఐదున్నర హెక్టార్ల విస్తీర్ణంలోని తిరుమల శేషాచల అటవీ ప్రాంతమంతా శ్రీవేంకటేశ్వర అభయారణ్యం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ అరుదైన జంతుజాతులు ఉన్నాయి. దేవాంగపిల్లి, పునుగుపిల్లి, బంగారు బల్లి, చుక్కల జింక, కృష్ణజింక, అడవిగొర్రె, కణితి, దుప్పులు, రేసుకుక్కలు, ఎలుగుబంట్లు, చిరుతపులులు ఉన్నాయి. వీటితోపాటు నెమళ్లు, పాలపిట్ట, తోక పిట్టలు, అడవి కోళ్లు వంటి వేలాది రకాల ఎన్నెన్నో అరుదైన జాతులకు ఈ అటవీప్రాంతం కేంద్రంగా ఉంది. వీటిలో చాలావరకు అంతరించే దశలో ఉన్నాయి. వీటి సంరక్షణ కోసం ఫారెస్ట్ విభాగం కృషి అంతంత మాత్రమే. అడవుల పరిరక్షణకు అనేక చట్టాలున్నా అవి టీటీడీ పరిధిలోని అడవుల్లో అమలు కావటం లేదు. భక్తుల పేరుతో టీటీడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ఫారెస్ట్ విభాగానికి ప్రధానంగా అడ్డుపడుతున్నాయి. భక్తుల ముసుగులో దట్టమైన అటవీ ప్రాంతాన్ని దశలవారీగా నాశనం చేస్తున్నా నిలువరించే దాఖలాలు కనిపించడం లేదు. -
శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్
తిరుపతి : ఎర్రచందనం తరలింపును నిరోధించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 ఎర్ర చందనం దుంగలతోపాటు, ఓ లారీ, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అటవీ సంపదను కొల్లగొట్టిన స్మగ్లర్ల ఆటకట్టించడానికే ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ గోపినాథ్ తెలిపారు. -
శేషాచల కొండల్లో అగ్నిప్రమాదం
తిరుమల : తిరుమల శేషాచల కొండల్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. వేణుగోపాల స్వామి గుడి సమీపానికి మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సదరు ప్రాంతానికి చేరుకున్నారు. -
హంట్ ఫర్ 'రెడ్' స్మగ్లర్స్
-
శేషాచలంలో అలజడి
టాస్క్‌ఫోర్స్ కూంబింగ్‌లో ఎదురుపడ్డ ఎర్ర’దొంగలు దుంగలను పడేసి అటవీ ప్రాంతంలోకి పరారీ చంద్రగిరి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా శేషాచలం అటవీప్రాంతంలో అలజడి రేగింది. ఏప్రిల్‌లో 20 మంది ఎర్రకూలీల ఎన్కౌంటర్ జరిగిన చీకటి గల కోన ప్రాంతంలో బుధవారం రాత్రి రంగంపేట అటవీశాఖ అధికారులు, కల్యాణిడ్యాం టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో చీకటి గల కోన సమీపంలో ఎర్రచందనం దుంగలతో సుమారు 40 మంది కూలీలు ఎదురయ్యారు. వారిని నిలువరించేందుకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ప్రయత్నించారు. ఎదురు తిరిగిన కూలీలపై పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో దుంగలను వదిలి వేసి కూలీలు అడవిలోకి పారిపోయారు. దాదాపు రూ.90 లక్షల విలువైన 1500 కేజీల 35 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన కూలీలను వెదికే ప్రయత్నంలో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఒకరు తప్పిపోయారు. అతని ఆచూకీ రాత్రి వరకు దొరకలేదని అటవీశాఖాధికారులు తెలిపారు. శేషాచలం కొండల్లో దాగిన స్మగ్లర్లను ఒక్కరినీ వదలమని, అందని పట్టుకుంటామని టాస్క్‌ఫోర్స్ డీ ఐజీ కాంతరావు తెలిపారు. -
నేడు శేషాచలం అడవికి రానున్న రవి ఠాకూర్
-
నేడు శేషాచలం అడవికి రానున్న రవి ఠాకూర్
తిరుపతి: నేడు శేషాచల అడవికి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవి ఠాకూర్ రానున్నారు. ఉదయం చెన్నైలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం ఆయన సాయంత్రం శేషాచలం ఎన్కౌంటర్ ఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన కూలీలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి శనివారం ఉదయం రవి ఠాకూర్ శేషాచలం ఎన్కౌంటర్ తీరుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. -
చెన్నైలోని ఆంధ్రా హోటళ్లపై దాడి
-
చెన్నైలోని ఆంధ్రా హోటళ్లపై దాడి
చెన్నై: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ నేపథ్యంలో చెన్నై అంబాలి నగర్‌లోని ఆంధ్ర హోటళ్లపై ఆదివారం ఆగంతకులు దాడులు చేశారు. ఈ దాడిలో నాలుగు హోటళ్లు పూర్తిగా ధ్వంసమైనాయి. దాంతో హోటల్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆంధ్ర - తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత ఆదివారం కూడా కొనసాగుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. తమిళనాడు వైపునకు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు డిపోలలో నిలిచిపోయాయి. చిత్తూరు జిల్లాలో పండిన టమోట పంటను రైతులు చెన్నై నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే చెన్నైకు రవాణ సౌకర్యం లేకపోవడంతో టమోట రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో గత మంగళవారం పోలీసుల ఎన్ కౌంటర్ లో చెన్నైకు చెందిన 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమిళనాడు వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంస్థలు, ఆస్తులపై దాడులు చేస్తామని వారు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
కన్నీటి సంద్రం
వీరప్పనూరుగా నామకరణం ఒకప్పుడు వీరప్పన్ వద్ద అనుచరులుగా ఉంటూ ఎర్ర చందనం తరలిస్తున్న వారు వీరప్పన్ గుర్తుగా జవ్యాది కొండపై వీరప్పనూర్గా నామకరణం చేశారు. నేటికీ ఆ గ్రామంలో దాదాపు 90 శాతం ప్రజలు కట్టెలు కొట్టడంలోనే నిమగ్నం అయ్యారు. వీరప్పన్ ఉండే సమయంలో ఈ గ్రామంలోని ప్రజలందరూ వీరప్పన్ వద్ద పనిచేసే వారు. ప్రస్తుతం చిన్నచిన్న కట్టెలు కొట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వేలూరు: తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం తరలిస్తున్నట్లు తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలను ఆంధ్ర పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం విదితమే. వీరిలో 12 మంది తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం, జవ్యాది కొండవాసులుగా గుర్తించారు. మృతి చెందిన వారి వివరాలను ఆంధ్ర పోలీసులు వాట్సాప్ ద్వారా తమిళనాడు పోలీసులకు సమాచారం అందించి అటవీ ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. మృతి చెందిన వారి వివరాలు తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా అనంతపురం సమీపంలోని మురుగంబాడి గ్రామానికి చెందిన గోపాల్ కుమారుడు మునస్వామి(38), అదే గ్రామానికి చెందిన మూర్తి(36), గాంధీనగర్‌కు చెందిన శివాజీ కుమారుడు మహేంద్రన్(23), కళశ ముత్తు గ్రామానికి చెందిన వేలు కుమారుడు పయణి(38), పడవేడు సమీపంలోని వేటగిరి బానయత్త గ్రామానికి చెందిన పెరుమాల్(38), వేటగిరిపాళ్యంకు చెందిన మురుగన్(36), అదే గ్రామానికి చెందిన శశికుమార్(35) గా గుర్తించారు. జవ్యాది కొండ సమీపంలోని మేల్ కనవనూర్ గ్రామానికి చెందిన రామస్వామి కుమారుడు పన్నీర్‌సెల్వం(25), మేల్కుప్పసనూర్కు చెందిన గోవిందన్ కుమారుడు రాజేంద్రన్(32), అదే గ్రామానికి చెందిన సడయాన్ కుమారుడు గోవిందస్వామి(38), వెల్లయ్యన్ కుమారుడు వళ్లిముత్తు(22), చిన్నపయ్యన్ కుమారుడు చిన్నస్వామి(47)గా ఉన్నారు. ప్రస్తుతం మృతి చెందిన వారిలో నలుగురు మేల్కుప్పసనూర్ గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలోని ప్రజలు శోక సముద్రంలో మునిగి పోయారు. బందోబస్తు నడుమ మృత దేహాలు అప్పగింత ఆంధ్ర పోలీసులు తిరుపతిలో పోస్టుమార్టం నిర్వహించిన మృత దేహాలను వేలూరు, తిరువణ్ణామలై, తిరువ ళ్లూరు జిల్లాలకు చెందిన అధికారులకు అప్పగించారు. ఈ మృత దేహాలను ఆంధ్ర పోలీసులు తమిళనాడు అంబులెన్స్ ద్వారా ఆంధ్ర సరిహద్దు వరకు తీసుకొచ్చారు. ఆంధ్ర సరిహద్దులో ఉన్న తమిళనాడు పోలీసులు మృత దేహాలను పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ తిరువణ్ణామలైకి తీసుకొచ్చారు. కన్నీరు మున్నీరు మృత దేహాలను చూసిన బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీర య్యారు. మృత దేహాల కోసం, భార్య పిల్లలతో సహా తల్లులు, బంధువులు రాత్రంగా ఎదురు చూస్తూ తీవ్ర శోకంలో మునిగిపోయారు. మృత దేహాలను అంబులెన్స్ ద్వారా పోలీసులు తీసుకు రావడంతో ఒక్కసారిగా బిగ్గరగా రోదించారు. మృతదేహాలతో రాస్తారోకో ఎన్కౌంటర్లో మృతి చెందిన వేటగిరి పాళ్యంకు చెందిన శశికుమార్, మురుగన్, పెరుమాల్ బంధువులు మృత దేహాలను చూసి బోరున విలపించారు. అనంతరం ఆ మృత దేహాలను తీసుకొని పడవేడు మెయిన్ రోడ్డుకు ఊరేగింపుగా వెళ్లి మృత దేహాలను నడిరోడ్డుపై పెట్టి రాస్తారోకో చేశారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ చేపట్టాలని, మృత దేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని, మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందజేయాలని నినాదాలు చేశారు. మృత దేహాలను చూసేందుకు మంత్రు లు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ రాలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. మృతదేహాలకు కాళ్లు, చేతులు మాయం సొంత గ్రామాలకు చేరుకున్న మృత దేహాలను పరిశీలించారు. కన్నమంగళం సమీపంలోని కాళ సముద్రం గ్రామానికి చెందిన పయణి బీఎడ్ పట్టభద్రుడు. ఇతనికి మూడు నెలల మగ బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను చేతిలో పెట్టుకొని భార్య లోగనాయగి కన్నీరు మున్నీరయింది. ఆ సమయంలో పయణి కుడి కాలు కనిపించక పోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బుల్లెట్ శరీరంలో తగిలి ఉంటే ఒక కాలు లేకుండా పంపడం ఎందుకని అనుమానం వ్యక్తం చేశారు. అదే విధంగా పుదూర్ కొళ్లమేడుకు చెందిన మహేంద్రన్ మృత దేహంలో కూడా కుడి కాలు లేకపోవడంతో బంధువులు ఆశ్చర్య పోయారు. వీటిపై సీబీఐ విచారణ చేపట్టాలని తల్లి చిత్ర, సోదరుడు మాధవన్ డిమాండ్ చేశారు. కూలీలను చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపి ఉంటారని ఆంధ్ర పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కన్న మంగళంలో దుకాణాలు మూసివేత మృతి చెందిన 12 మంది కూలీలు కన్నమంగళం, జవ్యాది కొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు కావడంతో వారి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఒక్కరోజు దుకాణాలు మూసివేసి వ్యాపారులు ధర్నా చేశారు. పార్టీలకు అతీతంగా వ్యాపారులు దుకాణాలు మూసి వేసి నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శోక సంద్రంలో అటవీ ప్రాంతవాసులు ఒక్కసారిగా పక్కపక్క గ్రామాలకు చెందిన అటవీ ప్రాంత వాసులు 12 మంది మృతి చెందడంతో జవ్యాది కొండ, కన్నమంగళం వంటి చుట్టు పక్కల గ్రామస్తులు శోక సముద్రంలో మునిగి పోయారు. అటవీ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ మృత దేహాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. పొట్ట కూటి కోసం వెళ్లి మృత దేహాలుగా మిగిలి పోయారని వాపోయారు. కూలీలను తరలించే ఏజెంట్ల కోసం గాలింపు తిరువ ణ్ణామలై, వేలూరు జిల్లాల నుంచి ఎర్ర కూలీలను తీసుకెళ్లే ఏజెంట్ల కోసం తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారు. కూలీలను ఏ ప్రాంతానికి చెందిన ఏజెంట్లు తీసుకెలుతున్నారు. వారిని ఎలా అడవికి తరలిస్తున్నారు. కూలీలు తీసుకొచ్చే ఎర్ర చందనాన్ని ఎక్కడికి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వేలూరు, జవ్యాది కొండ, కన్నమంగళం, పోలూరు, తిరుపత్తూరు వంటి అటవీ ప్రాంతాల గ్రామస్తుల వద్ద పోలీసులు విచారణ చేస్తున్నారు. -
చంద్రబాబుకు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్
-
చంద్రబాబుకు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్
విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. దాంతో ఎన్‌కౌంటర్‌పై రాజ్‌నాథ్ సింగ్‌కు చంద్రబాబు వివరణ ఇచ్చారు. కాగా తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన 20మంది ఎర్రచందనం కూలీలు హతమైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై తమిళనాడు ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
తమిళ కూలీ... తూటాలకు బలి
-
తమిళ కూలీ... తూటాలకు బలి
కరువు కాలంలో అధిక కూలిపై ఆశ సాధారణ చెట్లు నరకాలంటూ కాంట్రాక్టర్ల మోసం ఏపీ పోలీసుల కాల్పులతో మృత్యువాత కరువు కాలంలో పనుల్లేక పస్తులుండే అటవీ ప్రాంతపు కూలీలకు కాంట్రాక్టర్లు అధిక కూలిని ఎరగా వేశారు. దీనికి ఆశపడిన తమిళ కూలీలు పొరుగు రాష్ట్రానికి వెళ్లి ఎర్రచందనం చెట్లను నరికేవారు. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున అక్కడి పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మృత్యువాత పడ్డారు. - వివరాలు 2లోఠ చెన్నై, సాక్షి ప్రతినిధి/వేలూరు :ఆంధ్ర రాష్ట్రంలోని శేషాచలం అడువుల్లో ఎర్రచందనం చెట్లు నరికేందుకు వెళ్లిన ఎర్ర కూలీలు 20 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతులంతా తమిళనాడుకు చెందిన వారు కావడం మరింత కలకలానికి కారణమైంది. మృతుల్లో తిరువణ్ణామలై జిల్లా జవ్యాదికొండ సమీపం జమునామరత్తూరుకు చెందిన 9 మంది, వేలూరు జిల్లాకు చెందిన ముగ్గురుగా తెలుస్తోంది. మిగిలినవారు విళుపురం జిల్లాకు చెందిన వారుగా భావిస్తున్నారు. తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో జవ్యాది కొండ ఉంది. ఇక్కడ చెట్లు నరకడంలో నిపుణులు ఉన్నారు. ఈ జవ్యాది కొండ సమీపంలో అమిర్థి, ఊట్టాన్మలై, వీరప్పనూర్, జమునామరత్తూరు, ఆలంగాయం, సెంబగతోప్పు వంటి కుగ్రామాలు అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ గ్రామాల్లో అధికంగా ప్రజలు వ్యవసాయ కూలీలుగా జీవించే వారు. ప్రస్తుతం వర్షాలు లేక పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అదే విధంగా చెట్లు నరకడంలో నిపుణులు కావడంతో వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఎక్కడ చెట్లు నరకాలన్నా ఈ ప్రాంతానికి చెందిన కూలీలనే కాంట్రాక్టర్లు తీసుకెళ్లడం పరిపాటి. ప్రస్తుతం వర్షాలు లేక పోవడం వల్ల కూలీ పనులు లేక అల్లాడుతున్నారు. కూలీల దీనపరిస్థితిని ఆసరాగా చేసుకొన్న ఎర్రచందనం స్మగ్లర్లు భారీగా సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు. సాధారణ కూలీ పనులకు నాలుగింతలు రెట్టింపు కూలీ దొరకడంతో కూలీ లు సైతం ఆకర్షితులవుతున్నారు. కొంత మంది చెట్లు నరికే కాంట్రాక్టర్లు గ్రామాల్లోని కూలీలను రోజుకు రూ.500 నుంచి 750 వరకు కూలీ ఇప్పిస్తామని చెప్పి చెట్లు నరికేందుకు తీసుకెళతారు. కాంట్రాక్టర్లు తీసుకెళ్లే సమయంలో ఉండేందుకు వసతి, భోజనం వంటి సదుపాయాలను కూడా తామే భరిస్తామని చెప్పడంతో మరింత ఆకర్షణకు గురవుతున్నారు. ఏం పనో ముందుగా చెప్పరు చెట్లు నరికేటందుకు అని చెప్పి తీసుకెళతారు కానీ ఎక్కడ ఏ చెట్లు అని ముందుగా చెప్పరు. ఆంధ్ర సరిహద్దు దాటేంత వరకు ఎర్రచందనం చెట్లన నరికే పనులకు వెళుతున్నట్లు కూలీలు తెలుసుకోలేరు. తీరా అడవుల్లోకి వెళ్లిన తరువాత తెలిసినా వెనుదిరగలేక పనుల్లో దిగుతామని వీరప్పనూర్ గ్రామస్తులు చెబుతున్నారు. అత్యాధునిక యంత్రాలతో నరుకుతాం తమ వద్ద చెట్లు నరికేందుకు అత్యాధునిక యం త్రాలు, రంపాలు, కత్తులున్నాయని వీటి ద్వారా చెట్లు కింద పడినా శబ్దం రాకుండా ఉండేలా బ్యాటరీ ద్వారా తయారు చేసిన రంపాలతో చెట్ల పైకి ఎక్కి కొమ్మలను ముందుగా కోసి అనంతరం తాడు కట్టి అతి జాగ్రత్తగా కిందకు దించుతామన్నారు. ఈ యంత్రాలతో కోస్తే పక్కన ఉన్న వ్యక్తికి కూడా శబ్దం వినిపించదన్నారు. తాము ఒక ముఠాగా ఏర్పడి చెట్లు నరికేందుకు వెళుతున్నట్లు చెప్పారు. జవ్యాది కొండ నుంచి కూలీలను కాంట్రాక్టర్లు కారులో తీసుకెళతారు. వేలూరు బస్టాండ్‌కు వెళ్లిన అనంతరం ఒకే బస్సులో ప్రయాణించే విధంగా కాంట్రాక్టర్లు తమను ప్రభుత్వ, ప్రవేటు బస్సుల్లో ఎక్కిస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా చెట్లను నరికే యంత్రాలను పసుపు బ్యాగు, లేక కవరులో వేసి తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే విధంగా అడవుల్లోకి చేరుకుంటారు. వేలూరు నుంచి వెళితే అనుమానం వస్తుందని క్రిష్ణగిరి జిల్లా నుంచి ప్రభుత్వ బస్సులో గమ్యానికి చేరుస్తారు. కూలి పోతుందని... తాము చెట్లు నరికేందుకు మాత్రమే గతంలో వెళ్లేవారమని, అది తెలుసుకున్న కొంత మంది కాంట్రాక్టర్లు తమను ఇటుకల సూలకు చెట్లు నరకాలని తీసుకెళ్లి తిరుపతి దగ్గరలోని అడవిలో వదిలి చెట్లు నరకాలని చెపుతారని బాధితులు చెబుతున్నారు. ఆ సమయంలో తాము కూడా చేసేది లేక కూలి పోతుందని ఇంత దూరం వచ్చిన తరువాత తిరిగి ఎక్కడికీ వెళ్లలేక ఎర్రచందనం నరికేందుకు సమ్మతిస్తున్నట్లు చెప్పారు. చెట్లు నరికేందుకు రోజుకు కూలి రూ.500 నుంచి రూ.750 వరకు ఇస్తారు. అదికాకుండా ఆంధ్ర రాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి రోడ్డుకు తీసుకొచ్చేందుకు అదనపు కూలిని ఇవ్వడంతో ఆశపడుతున్నారు. జవ్యాది కొండపైనున్న గ్రామాల్లో అధిక శాతం ఆదివాసులు నివాసం ఉంటున్నారు. అదే విధంగా దళితులు, గౌండర్లు కూడా అధికంగా ఉండటంతో జీవనం సాగించడం, కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారడంతోనే ఆ పనికి వెళుతున్నారు. సహజంగా వీరంతా వర్షాధార పంటలను అమ్ముకుని జీవిస్తారు. అడవిలో కాసే నేరేడు పండ్లు, జామ పండ్లు, నెల్లి పండ్లు వంటి వాటిని తీసుకొచ్చి పట్టణంలోని ప్రజలకు విక్రయించే వారు. ప్రస్తుతం అడవిలోను పండ్లు లేక, వర్షపు ఆధార పంటల్లేక, అటవీ ప్రాంతంలో కూలీలు అందక పోవడంతోనే ఎర్ర కూలీలుగా మారుతున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. కరువు పీడితులుగా మిగల్లేక కొందరు నాటుసారా తయారీలో పాలుపంచుకునేవారు. ఏళ్ల క్రితం పోలీసులు వీరిపై గూండా చట్టం ప్రయోగించడంతో ప్రత్యామ్నాయంగా ఎర్రచందన కూలీలుగా మారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. -
ఎర్ర చందనానికి ఎందుకంత క్రేజ్?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో విస్తారంగా దొరికే ఎర్ర చందనానికి అంతర్జాతీయ డిమాండ్ ఎంతో ఉంది. దీంతో అక్రమంగా చెట్లను నరికేసి దుంగలకు తరలించే దొంగలు కూడా ఎక్కువే. అలా దొంగల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న ఎర్ర చందనం దుంగల్లో కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలం వేయగా అక్షరాల వెయ్యి కోట్ల రూపాయలు వచ్చాయి. కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డెరైక్టర్ జనరల్ అనుమతితో 2014, డిసెంబర్ నెలలో 4,160 టన్నుల ఎర్ర చందనాన్ని ఏపీ ప్రభుత్వం ఈ వేలం వేయగా ఈ వెయ్యి కోట్ల రూపాయలు వచ్చాయి. వేలంలో టన్నుకు 27.41 లక్షల రూపాయల ధర పలికింది. దొంగల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనంలో ప్రభుత్వం వద్ద ఇంకా 4,694 టన్నుల చందనం ఉంది. దీన్ని ఈ ఏడాది ప్రభుత్వం వేలం వేయాలని భావిస్తోంది. రైతుల రుణాలను ఎలా మాఫీ చేస్తారంటూ విపక్షం నుంచి వచ్చిన విమర్శలకు ఎర్ర చందనాన్ని వేలం వేయడం ద్వారా మాఫీ చేస్తానని ఓ దశలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం తెల్సిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్ర చందనాన్ని కొనుగోలు చేయడానికి చైనా, జపాన్, సింగపూర్ లాంటి దేశాలు ముందున్నాయి. ‘అంతర్జాతీయ ప్రకృతి సంపద పరిరక్షణ సంఘం’ జాబితాలో చోటు చేసుకోవడం వల్ల ఎర్ర చందనం క్రయవిక్రయాలపై అంతర్జాతీయంగా పలు అంక్షలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరులోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించివున్న శేషాచలంలో అడవుల్లో 4.67 లక్షల హెక్టార్లలో ఎర్ర చందనం వనాలు విస్తారంగా ఉండడంతో అంతర్జాతీయ ఆంక్షల అడ్డంకి మనకు పెద్దగా లేదు. అలా అని చెట్లను పూర్తిగా నరికేసుకుంటామంటే కుదరదు. వేలం వేయడానికి కూడా కేంద్రం అనుమతి తప్పనిసరి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం విస్తారంగా ఎర్ర చందనం వనాలు ఉన్నప్పటికీ వాటిని పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందే. అందుకనే చందనం వేలం ద్వారా వచ్చే సొమ్ములో 30 శాతం సొమ్మును ఆ వనాల పరిరక్షణకు, మిగతా 70 శాతం సొమ్మును రైతుల రుణాల మాఫీకి ఉపయోగిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పురుషుల్లో వంధ్యత్వం నివారణకు, మహిళల్లో సంతానప్రాప్తికి ఉపయోగించే మందుల్లో ఎర్ర చందనాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. అలాగే సంగీత వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారు. అంతేకాకుండా విలాసవంతులు ఎర్రచందనంతో ఫర్నీచర్ కూడా చేయించుకుంటారు. -
శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు
రేణిగుంట: శేషాచల అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలో ఈ మంటలు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు వదిలేయడంతో వ్యాపించిన మంటలు అమరరాజా ఫ్యాక్టరీ, తారకరామా నగర్ వైపు వ్యాపించాయి. ఫ్యాక్టరీ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫ్యాక్టరీ వెనుక భాగం నుంచి తారకరామా నగర్ వైపు మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. తిరుపతి డీఎఫ్‌వో శ్రీనివాసులు, రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, సీఐ బాలయ్య, అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగి స్థానికుల సహకారంతో రెండు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎఫ్‌వో శ్రీనివాసులు ప్రమాదం గురించి మాట్లాడుతూ... శేషాచల అడవుల్లోని 3.5 హెక్టార్లలో మంటలు వ్యాపించాయని, అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. -
శేషాచలంలో మళ్లీ కార్చిచ్చు
చంద్రగిరి : తిరుమల శేషాచలం అడవుల్లో మంగళవారం సాయంత్రం మళ్లీ కార్చిచ్చు రేగింది. తిరుమల వేద పాఠశాలకు 3 కిలోమీటర్ల దూరంలోని గాడికోన సమీపంలో రగిలిన ఈ చిచ్చు కళ్యాణిడ్యామ్ పరిసరాల వరకు వ్యాపించింది. దాదాపు 200 హెక్టార్లకు పైగా అటవీ సంపద కాలిబూడిదైంది. అటవీశాఖ సిబ్బంది మంటలార్పేందుకు దాదాపు 70 మంది సిబ్బంది మంగళవారం అర్ధరాత్రి వరకు శ్రమించారు. తిరుపతి డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో 30 మంది స్ట్రైకింగ్ పోర్స్ సిబ్బంది ఫైరింజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఏడు ఫైరింజన్లతో నీళ్లు చల్లినా ఫలితం లేకపోయింది. రాత్రి 10 గంటల వరకు ఈ మంటలు అదుపులోకి రాలేదు. -
శ్రీలంక పాము.. శేషాచలం అడవుల్లో..!
-
కస్టమ్స్ విభాగం సహకరించాల్సిందే!
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో లభించే అరుదైన ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే కచ్చితంగా కస్టమ్స్ విభాగం సహకారం అవసరమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఉదంతాల ఆధారంగా ఎర్రచందనం ఎక్కువగా దుంగల రూపంలో ఓడల ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నట్లు నిర్థారిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు సహా అనేక పోర్టుల ద్వారా జరుగుతున్న ఈ స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలంటే కస్టమ్స్, ఓడరేవులు సహా ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని పని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ త్వరలో ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు, సిఫార్సులతో కూడిన లేఖ రాయాలని పోలీసు అధికారులు యోచిస్తున్నారు. ఈ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడమే తెలిసిన స్మగ్లర్లకు దానితో విదేశాల్లో ఏం చేస్తున్నారనేది స్పష్టంగా తెలియడంలేదు. దీనిపై ఆరాతీసిన పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. చైనా, జపాన్ సహా అనేక మధ్య ఆసియా దేశాల్లో ఎర్రచందనానికి ఎంతో డిమాండ్ ఉంది. దీన్ని లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధంగా అక్కడి వారు వినియోగిస్తున్నారు. ఎర్రచందనంతో చేసిన పాత్రల్లో నీరుపోసి, నిర్ణీత సమయం నిలువ ఉంచి తాగితే మంచి ఫలితాలు ఉంటాయని వారు భావిస్తుంటారు. అక్కడి కొన్ని దేశాల్లో ధనవంతుల ఇళ్లల్లో పెళ్లి జరగాలంటే ఎర్రచందనం తప్పనిసరి. దీంతో తయారు చేసిన షామిచాన్ అనే వాయిద్య పరికరాన్ని కానుకగా ఇవ్వడం ఆ దేశాల్లో ఆనవాయితీగా వస్తోంది. వీటన్నింటికీ మించి ఎర్రచందనంలో రేడియో ధార్మికతను తట్టుకునే శక్తి ఉందని, అందుకే న్యూక్లియర్ సంబంధ పరికరాల్లో దీని పొడిని పూతగా పూస్తారని చెబుతున్నారు. ఈ విధంగా డిమాండ్ ఉండటంతో దుంగల్ని వివిధ పేర్లతో పోర్టుల ద్వారా ఆయా దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. -
పోలీసు కాల్పుల్లో ఎర్రచందనం కూలీ మృతి
భాకరాపేట: శేషాచలంలోని ఎర్రచందనం సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ కూలీ హతమయ్యాడు. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ పంచాయతీ సమీపంలోని కడతలకొండ అటవీ ప్రాంతం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. వివరాలు...శేషాచల అటవీ ప్రాంతంలోని తలకోన సమీపంలో పెద్ద సంఖ్యలో ఎర్రచందనం దుంగలను కూలీలు తరలిస్తున్నారనే సమాచారం అందడంతో చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ ఏఆర్ పోలీసులను నాలుగు బృందాలుగా కూంబింగ్ కు పంపించారు. ఇందులో రెండు పార్టీలు తలకోనలో కూంబింగ్ జరుపుతుండగా 150 మంది కూలీలు, స్మగ్లర్లు వీరి కంటపడ్డారు. పోలీసులను చూసిన నిందితులు తప్పించుకున్నారు. వారిలో 30 మంది బొంబాదికొండ నుంచి కడతలకొండ వైపుగా భాకరాపేట కనుమ వద్దకు ఎర్రచందనం దుంగలు మోసుకుంటూ వెళ్లి అక్కడే బస చేశారు. ఇదే సమయంలో కల్యాణిడ్యాం నుంచి కూంబింగ్ జరుపుతూ వచ్చిన మరో పార్టీ పోలీసులకు వీరు కనిపించారు. దీంతో పోలీసులు ముందుగా హెచ్చరించారు. కూలీలు రాళ్లదాడికి దిగడంతో పోలీసులు గాలిలోకికాల్పులు జరిపారు. అయినా కూలీలు రాళ్ల వర్షం కురిపించడంతో పోలీసులు నేరుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక కూలీ మృతి చెందాడు. దీంతో సంఘటన స్థలం వద్ద దుంగలను వదిలేసి మిగిలిన వారంతా పారిపోయారు. వారు వదిలేసి వెళ్లిన 13 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన కూలి ఎవరనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. -
శేషాచలం అడవుల్లో వీరప్పన్ అనుచరులు!
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికివేసి, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాల్లో చనిపోయిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మాజీ అనుచరులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసు, అటవీశాఖల అధికారులు నిర్ధారించారు. పోలీసు, అటవీ శాఖల అధికారుల భయంతో ఈ చెట్లను నరికే పని చేయడానికి స్థానికులు వెనుకడుగు వేస్తుండటంతో స్మగ్లర్లు.. వీరప్పన్, అతడి ప్రధాన అనుచరుల వద్ద ఏళ్ల పాటు పని చేసిన తమిళనాడుకు చెందిన కూలీలకు అధిక మొత్తాల ఆశచూపి రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం ముఠాలు ఆకర్షిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ప్రత్యేకంగా ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌నే ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్ కనుసన్నల్లో పని చేసి ఉండటంతో.. పోలీసులే ఎదురుపడి కాల్చి చంపుతామని బెదిరించినా వీళ్లు లొంగకుండా ఎదురు దాడికి దిగుతున్నారని.. రాళ్లు, మారణాయుధాల తో దాడికి పాల్పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. అలాగే.. తెరవెనుక నుంచి ఈ కూలీల ముఠాలను నిర్వహిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, మణిపూర్‌కు చెందిన స్మగ్లర్లూ ఉన్నట్లు పోలీసు, అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. -
శేషాచలం అడవుల్లో కూంబింగ్!
-
తిరుమలలో చిరుత హల్ చల్
తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయ మళ్లీ మంటలు చెలరేగాయి.ఆ అటవీ ప్రాంతంలోని ఓ చిరుత భయంతో తిరుమలలో ప్రవేశించింది. దేవదేవుని దర్శించుకునేందుకు తిరుమల వచ్చిన భక్తులు ఆ చిరుతను చూసి పరుగు తీశారు. ఆ చిరుత ఈవో కార్యాలయం వద్ద హాల్చల్ చేయడంతో అటవీశాఖ, టీటీడీ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాపవినాశనం మార్గంలోని జపాలి తీర్థం సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు ఎగసి పడి శేషాచల అటవీప్రాంతంలో మంటలు రాజుకున్నాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ మంటలు ఆర్పేందుకు అటు టీటీడీ, ఇటు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. భక్తుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. -
అదుపులోకి వచ్చిన మంటలు
-
ఈ కార్చిచ్చుకు బాధ్యులెవరు?
సంపాదకీయం నిత్యం గోవింద నామ స్మరణతో మార్మోగే శేషాచలం కొండల్లో అగ్నికీలలు ఎగిసిపడి అడవిని బుగ్గిపాలుచేశాయి. ఇప్పటికి సరిగ్గా మూడురోజులనాడు మూడుచోట్ల రాజుకున్న నిప్పు అరికట్టేవారులేక యథేచ్ఛగా విస్తరించింది. సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని 460 హెక్టార్ల అడవి నాశనమైంది. మంటలు అంటుకున్న ప్రాంతం శ్రీవారు కొలువుదీరిన తిరుమల కొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంవల్ల భక్తులంతా కలవరపాటుకు గురయ్యారు. భక్తుల భద్రత కోసమని పాపవినాశం, ఆకాశగంగ, జాపాలీతీర్థం, వేణుగోపాలస్వామి ఆలయ మార్గాలను, దుకాణాలను మూసేశారు. గురువారంనాటికి నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు, 100మంది జవాన్లు రంగంలోకి దిగి ప్రయత్నించాక మంటలు అదుపులోకొచ్చాయి. ఏ ప్రమాదం జరిగినా షరా మామూలైపోయిన ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ఉదంతంలోనూ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కొంపలంటుకున్నాక బావి తవ్వబోయిన చందాన మంటలు విస్తరించాక తప్ప అధికార యంత్రాంగంలో కదలిక రాలేదు. కార్చిచ్చును అదుపుచేయడానికి అసలు ప్రయత్నాలే జరగలేదని కాదు. వివిధ శాఖల సిబ్బంది, 15 ఫైరింజన్లతో అక్కడికి తరలివెళ్లారు. కానీ, ఆ స్థాయి మంటలను అదుపుచేయడం సాధారణ ఫైరింజన్ల వల్ల సాధ్యమవుతుందా? ప్రమాదం సంభవించి 24 గంటలు గడిచాకగానీ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రక్షణశాఖ సాయాన్ని ఎందుకు కోరలేకపోయింది? అసలు అగ్నికీలల జాడలు తెలిసిన సమయం గురించే ఇప్పుడు వివాదం ఉన్నది. ఉపగ్రహాలు పంపిన ఛాయాచిత్రాల ఆధారంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, మన రిమోట్ సెన్సింగ్ సెంటర్లు ఈ నెల 2 నే మంటల జాడను పసిగట్టి హెచ్చరించాయని అంటున్నారు. కానీ ఎవరిలోనూ కదలికే లేదు. నిర్లక్ష్యమూ, నిర్లిప్తతా కలగలిసి అపురూపుమైన వృక్ష సంపదను బుగ్గిపాలు చేశాయి. వేల సంఖ్యలో మూగజీవాలు కూడా ఈ మంటల్లో మాడి మసైపోయాయని కొందరంటుంటే... అటవీ అధికారులు కాదంటున్నారు. ఇది ప్రమాద తీవ్రతను తగ్గించిచెప్పే ప్రయత్నమో, నిజమో తేలవలసి ఉంది. అటవీ ప్రాంతంలో అప్పుడప్పుడు ఇలా నిప్పు రాజుకోవడం, అదుపుచేయడం సాధారణమే. కానీ, ఇంత పెద్దయెత్తున ఇన్ని వందల హెక్టార్ల అడవి బూడిద కావడం మాత్రం ఇదే ప్రథమం. స్వల్ప సమయంలో మూడుచోట్ల మంటలంటుకున్న తీరును చూస్తే ఇదంతా ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అనిపిస్తున్నది. ఎర్రచందనం స్మగ్లర్లు తమ కార్యకలాపాలకు తగిన దోవను ఏర్పర్చుకోవడానికి ఈ పనిచేశారా లేక భక్తులెవరైనా అక్కడ వంటలు చేసుకుని నిప్పు ఆర్పకుండా వెళ్లడంవల్ల ప్రమాదం జరిగిందా అన్నది లోతైన విచారణ జరిగితే తప్ప తెలిసే అవకాశం లేదు. అసలు చాలా ముందుగానే వచ్చిన ప్రమాద సమాచారాన్ని బేఖాతరు చేసినవారెవరు? అలాంటి సమాచారం ఒక్క అటవీశాఖకు మాత్రమేనా... ఇతర ప్రభుత్వ విభాగాలకు కూడా అందుతుందా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చిపడినప్పుడు లేదా తలెత్తే అవకాశం ఉన్నదని తెలిసినప్పుడూ అన్ని శాఖలనూ సమన్వయం చేసి రంగంలోకి దిగాల్సిన జాతీయ విపత్తు నివారణ సంస్థకు ఇలాంటి ముందస్తు సమాచారం అందే ఏర్పాటు ఉన్నదా? ఏదో ఒక శాఖకు సమాచారం ఇచ్చే పద్ధతి కాకుండా అన్ని ముఖ్యమైన విభాగాలకూ ఆ సమాచారం చేరే ఏర్పాటుచేస్తే ఎవరో ఒకరు సకాలంలో మేల్కొని చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఆ తరహా పద్ధతులు అమల్లో ఉన్న దాఖలాలు కనిపించడంలేదు. ఈ ఉదంతంలో ఒక్క అటవీశాఖ మాత్రమే కాదు... జిల్లా యంత్రాంగం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకూ అందరి బాధ్యతా రాహిత్యమూ కనబడుతూనే ఉంది. ఆగమ నిబంధనల ప్రకారం కొండపై హెలికాప్టర్లు, విమానాలు ఎగరకూడదు. కానీ, ప్రమాదం వెలుగు చూసిన మంగళవారంనాడే ఆ విషయమై ఆగమ పండితులను సంప్రదించడానికి... వారికి పరిస్థితి తీవ్రతను వివరించి, ఒప్పించడానికి ఏం అడ్డువచ్చింది? వారితో ఒకపక్క మాట్లాడుతూనే మరోపక్క కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించివుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రమాద తీవ్రతను, దాని విస్తృతిని సరిగా అంచనా వేయలేకపోవడంవల్లనే వెనువెంటనే ఇవన్నీ జరగలేదనిపిస్తుంది. సైన్యం, వైమానిక దళం కొన్ని గంటల్లోనే మంటల్ని నియంత్రించగలిగారన్నది గుర్తుంచుకుంటే ఈ చురుకుదనం ఎంత అవసరమో అర్ధమవుతుంది. అడవులున్నచోట ప్రమాదాలైనా కావొచ్చు, ఉద్దేశపూర్వకంగా చేసేవి కావొచ్చు...ఇలాంటి ఉదంతాలు జరగడం సర్వసాధారణం. నిరుడు అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో దావానలం చెలరేగి మంటలార్పడానికి వెళ్లిన 19మంది సిబ్బంది చనిపోయారు. మూడేళ్లక్రితం రష్యాలో వరస కార్చిచ్చులు 1.90 లక్షల హెక్టార్లలో అడవి నాశనమైంది. ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటివి తరచు జరుగుతుంటాయి. మనకు కూడా అటవీప్రాంతం ఎక్కువే గనుక విపత్తు నివారణ సంస్థ వంటివి ఈ తరహా ప్రమాదాల వివరాలను సేకరించి, అక్కడ తీసుకున్న చర్యలెలాంటివో గమనించివుంటే ఇలాంటి ఉదంతాల సమయంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రమాద సమయాల్లో ఎవరెవరిని కదిలించాలో, అందుబాటులో ఉంచాల్సినవి ఏమిటో అవగాహనకొస్తాయి. ఇప్పుడు భవిష్యత్తు ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ దృష్టి సారించింది. అడవి చుట్టూ రింగురోడ్డు, ప్రహరీ గోడ నిర్మిస్తామంటున్నారు. అందుకు అవసరమైన అనుమతులనూ తీసుకొస్తామంటున్నారు. బాగానే ఉంది. ఈ పని ఎన్నడో చేసి ఉండాల్సింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను గుర్తించి చర్య తీసుకోవాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలి. -
కొండల్లో.... కార్చిచ్చు
-
అగ్నికీలలను నాసా ముందే పసిగట్టింది
తిరుమల : శేషాచలం కొండల్లో మంటలు చాలా రోజుల ముందే చెలరేగాయా? మంటలు అంటుకున్న విషయం అటవీశాఖ అధికారులకు ముందే సమాచారం ఉందా? హెచ్చరికలు వచ్చినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించలేదా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. శేషాచలం అడవుల్లో మంటలను నాసా ముందే గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నెల రెండో తారీఖునే అగ్నికీలలను పసి గట్టిన నాసా... అటవీశాఖ అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. శేషాచలం అటవీ ప్రాంతంలో దావానలంపై అధికారులకు ఫోన్ల ద్వారా సందేశాలు పంపిన నాసా అధికారులు... తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హెచ్చరికలను అటవీశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని అందువల్లే ప్రమాద తీవ్రత పెరిగిందనే వాదన వినిపిస్తోంది. -
అగ్నికీలలను నాసా ముందే పసిగట్టింది
-
ఆర్మీ సిబ్బందితో ఆపరేషన్ శేషాచలం
తిరుమల : తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు వందమంది ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగాయి. రెండు రోజులుగా శ్రమిస్తున్నా మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. తిరుమల కొండకు మూడు కిలోమీటర్ల దూరంలో మంటలు వ్యాపించాయి. ఇప్పటికే అయిదువేల హెక్టర్లలో అటవీ సంపద కాలి బూడిదయ్యింది. మంటలు అదుపులోకి రాకపోవటంతో ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్ నావికా దళాలు ఇప్పటికే రేణిగుంట చేరుకున్నాయి. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాంతో తిరుమల కొండల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయ సహకారాలు అందించాలని గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి, ఆర్మీ, నేవీకి విజ్ఞప్తి చేశారు. నీరు, నురగతో కూడిన రసాయనాలను గగనతలం నుంచి చల్లి మంటలను ఆర్పేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎంఐ-17 హెలికాప్టర్లు తిరుమలకు రానున్నాయి. ఇప్పటికే బుధవారం ఓ హెలికాప్టర్ శేషాచలంపై చక్కర్లు కొట్టి అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో సర్వే చేసి వెళ్లింది. ఆగమ నిబంధనలను అతిక్రమించకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. తమిళనాడు అరక్కోణం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తిరుమల చేరుకున్నాయి. అటవీ శాఖ డీజీ సమీక్ష కేంద్ర అటవీ శాఖ డెరైక్టర్ జనరల్ (డీజీ) ఎస్ఎస్ గార్బియల్ గురువారం ఉదయం తిరుపతిలో వివిధ రాష్ట్రాల అటవీ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రాల నుంచి ఏనుగుల వలస సమస్య, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల అటవీశాఖల ఉన్నతాధికారులు, వన్యప్రాణి సంరక్షణాధికారులతో చర్చలు జరుపుతున్నారు. -
అగ్నికీలల్లోనే శేషాచలం
సాక్షి, తిరుమల/హైదరాబాద్ : తిరుమల శేషాచల అడవి మంటల్లో చిక్కుకుని బుగ్గి అవుతోంది. ఆలయానికి కిలోమీటరు దూరంలోని ఉత్తర, ఈశాన్య దిశలో కాకుల కొండ వద్ద 40 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. వివిధ శాఖలకు చెందిన 500 మంది సిబ్బంది, 15 ఫైరింజన్లు రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, రక్షణ దళాల సహకారాన్ని కోరింది. బుధవారం గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీటీడీ ఉన్నతాధికారులతో సంప్రదించారు. అనంతరం రక్షణ దళాలను రంగంలోకి దించే ఏర్పాట్లు చేశారు. నేవీ, ఎయిర్ఫోర్స్లకు చెందిన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను, నాలుగు హెలికాప్టర్లను, వంద మంది సిబ్బందిని తిరుపతికి తరలిస్తున్నారు. శేషాచలం అడవుల్లో మంగళవారం మూడు ప్రాంతాల్లో అడవి అంటుకుంది. అంతకంతకూ విస్తరించిన మంటలు బుధవారం మరింతగా చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని సుమారు 2 వేల హెక్టార్ల అడవి బూడిద యింది. టీటీడీ పవన విద్యుత్ ప్లాంట్ దెబ్బతింది. నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, చిత్తూరు జిల్లా కలెక్టర్ రాంగోపాల్, సీవీఎస్వో శ్రీనివాసరావు, అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు బుధవారం సంఘటన స్థలాన్ని సందర్శించి మంటలు ఆర్పేందుకు ప్రత్యేక బృందాలను రప్పించారు. అటవీ శాఖ, అగ్నిమాపక శాఖల సిబ్బందితోపాటు టీటీడీ ఇంజనీరింగ్, హెల్త్, విజిలెన్స్, పోలీసు విభాగాలకు చెందిన 500 మందితో పది బృందాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల నుంచి 15 ఫైరింజన్లను తెప్పించారు. నీటి సరఫరాకు టీటీడీకి చెందిన ఆరు ట్యాంకర్లు, గుంతలు తవ్వేందుకు ఆరు జేసీబీలు తెప్పించారు. ఈ బృందాలు కాకుల కొండ నుంచి గోగర్భం డ్యాము వరకు మంటలు విస్తరించకుండా చర్యలు తీసుకున్నాయి. కాకులకొండ దిగువ ప్రాంతంలో సాయంత్రం 6 గంటలకు మంటలు కొంత అదుపులోకి వచ్చినా, పవన విద్యుత్ ప్లాంటు సమీపంలో చెలరేగుతూనే ఉన్నాయి. పాపవినాశనం, అవ్వాచ్చారికోన, కపిలతీర్థం, కరకంబాడి, మామండూరు ప్రాంతాల్లో కూడా మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి సిబ్బంది కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రక్షణ దళాల సహకారం తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. డిఫెన్స్, ఎయిర్‌ఫోర్సుకు ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లను తెప్పించాలని నిర్ణయించారు. ఆగమ నిబంధనల ప్రకారం తిరుమల కొండపై హెలికాప్టర్లు, విమానాలు ఎగురకూడదు. ఇప్పటివరకు ఈ నిబంధనను కచ్చితంగా అమలుచేశారు. అయితే, ఇప్పుడు కార్చిచ్చు అంతకంతకూ వ్యాపిస్తుండటంతో ఆలయ అర్చకులు కూడా సానుకూల దృక్పథంతో హెలికాప్టర్లు తెప్పించేందుకు అంగీకరించారు. రంగంలోకి రాష్ట్రప్రభుత్వం: తిరుమల కొండల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయ సహకారాలు అందించాలని బుధవారం కేంద్ర ప్రభుత్వానికి, ఆర్మీ, నేవీకి విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం, రక్షణ దళాలు, కేంద్ర విపత్తు నిర్వహణ విభాగాలు తక్షణమే స్పందించాయి. రాష్ట్ర ప్రభుత్వం కొరిన మేరకు ఏర్పాట్లు చేశాయి. గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) గిరిధర్ గోపాల్, చిత్తూరు కలెక్టర్ రాంగోపాల్‌తో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులతో గవర్నర్ స్వయంగా మాట్లాడారు. మంటలను ఆర్పేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన విమానాలను, నిపుణులను పంపాలని ఎయిర్‌ఫోర్సు, నేవీ, ఇతర సాయుధ బలగాల అధిపతులను కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బుధవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శితో, రక్షణ అటవీ, విపత్తు నిర్వహణ శాఖల కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడారు. రసాయనాలను వెదజల్లి మంటలను ఆర్పే ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్‌లు రెండింటిని పంపాలని ఆర్మీ, నేవీని కోరారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లను, నాలుగు హెలికాప్టర్లను, వందమంది సిబ్బందిని వెంటనే పంపుతామని రక్షణ దళాల అధికారులు తెలిపారు. రసాయనాలతో మంటలను ఆర్పే ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎయిర్‌ఫోర్సు, నేవీ అధికారులు తిరుపతి రానున్నారని గవర్నర్ టీటీడీ ఈవోకు తెలిపారు. వారితో నేరుగా సమన్వయం చేసుకోవాలని, ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సూచించారు. టీటీడీ ఈవో గోపాల్ కూడా కేంద్ర రక్షణ మంత్రి, కేబినెట్ కార్యదర్శి, ఎయిర్‌ఫోర్సు అధికారులతో కూడా చర్చించారు. నీరు, నురగతో కూడిన రసాయనాలను గగనతలం నుంచి చల్లి మంటలను ఆర్పేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎంఐ-17 హెలికాప్టర్లు తిరుమలకు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బుధవారం ఓ హెలికాప్టర్ శేషాచలంపై చక్కర్లు కొట్టి అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో సర్వే చేసి వెళ్లింది. ఆగమ నిబంధనలను అతిక్రమించకుండా ఏర్పాట్లు చేశామని ఈవో చెప్పారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ పార్థసారథి కూడా జాతీయ విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడారు. బుధవారం తమిళనాడు అరక్కోణం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తిరుమల చేరుకున్నాయి. తిరుపతిలోనే బస చేసిన రాష్ట్ర అటవీ దళాల అధిపతి బి.సోమశేఖరరెడ్డి ఢిల్లీలోని అటవీ శాఖ డెరైక్టర్ జనరల్ గార్బియల్తో మాట్లాడి పరిస్థితిని వివరించారు. మంటలను ఆర్పే పనులు పగలంతా చురుగ్గా సాగాయని, మూడు చోట్ల మంటలు అంటుకోగా రెండు చోట్ల పూర్తిగా అదుపులోకి వచ్చాయని సోమశేఖరరెడ్డి ‘సాక్షి’కి టెలిఫోన్లో తెలిపారు. రాత్రి సమయంలో మంటలను ఆర్పడం వీలుకానందున పని ఆపేశారని, తిరిగి గురువారం ఉదయమే ప్రారంభిస్తామని చెప్పారు. ఆందోళన వద్దు : గవర్నర్, ఈవో శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగినప్పటికీ, భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని గవర్నర్ నరసింహన్, టీటీడీ ఈవో గోపాల్ చెప్పారు. ఎప్పటిలానే శ్రీవారి దర్శనానికి రావచ్చని ఈవో చెప్పారు. తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని గవర్నర్ తెలిపారు. వివిధ ప్రాంతాలకు మంటలు చెలరేగడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భక్తుల భద్రత కోసం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పాపవినాశనం, ఆకాశగంగ, జాపాలీతీర్థం, వేణుగోపాల స్వామి ఆలయాలకు వెళ్లే మార్గాలను, అక్కడి దుకాణాలను మూసివేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే కాలిబాటను కూడా మూసివేశారు. నేడు తిరుపతిలో అటవీ శాఖ డీజీ సమీక్ష సాక్షి, హైదరాబాద్: కేంద్ర అటవీ శాఖ డెరైక్టర్ జనరల్ (డీజీ) ఎస్ఎస్ గార్బియల్ గురువారం ఉదయం తిరుపతిలో వివిధ రాష్ట్రాల అటవీ అధికారులతో సమావేశమవుతున్నారు. రాష్ట్రాల నుంచి ఏనుగుల వలస సమస్య, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల అటవీశాఖల ఉన్నతాధికారులు, వన్యప్రాణి సంరక్షణాధికారులతో చర్చిస్తారు. ఆయన పర్యటన పది రోజుల కిందటే ఖరారైంది. అయితే, గత మూడు రోజులుగా శేషాచలం అడవుల్లో మంటలు రేగుతుండటంతో, ఈ అంశంపై కూడా ఆయన సమీక్షించే అవకాశం ఉంది. -
శ్రీవారి కొండలపై దావానలం!!
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న ఏడు కొండల్లో మొట్టమొదటిదైన శేషాద్రి మీద మొదలైన కార్చిచ్చు.. ఎంతకీ ఆరట్లేదు. ఎవరు ఎంతగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రకృతి పగబట్టినట్లు మంటలు మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా ఈ మంటలు తిరుమల వైపు వ్యాపించాయి. పవన విద్యుత్ కేంద్రాల వరకు కూడా మంటలు ఎగబాకడంతో టీటీడీ అధికారులు పాపవినాశనానికి వెళ్లే దారి మూసేశారు. పాపవినాశనం, ఆకాశగంగ, గోపాలస్వామి దారులు మూతపడ్డాయి. కొండపైకి కాలినడక భక్తులకు అనుమతి నిరాకరించారు. మంగళం డీసీఆర్ కాలనీలో సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. టీటీడీ, ఫైర్ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో వందలాది ఎకరాల్లో వృక్షసంపద బుగ్గిపాలైంది. కొంతమంది సిబ్బంది కూడా ఈ మంటల్లో చిక్కుకోవడంతో వెంటనే సంఘటన స్థలానికి అంబులెన్స్ తరలించారు. ఏం చేసినా మంటలు ఆరకపోవడంతో.. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. -
శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు
-
అందరూ దొంగలే
-
అందరూ దొంగలే
* అధికారులు, నేతల కనుసన్నల్లో ఎల్లలు దాటుతున్న ఎర్రచందనం * జపాన్, సింగపూర్, మలేసియూలకు అక్రమంగా ఎగుమతి * ఖాళీ అవుతున్న శేషాచలం, పాపికొండలు, లంకమల అభయారణ్యాలు * అరుదైన సంపద అంతరించిపోతున్నా పట్టించుకోని పోలీసు, అటవీ అధికారులు * అప్పుడప్పుడు చిన్న స్మగ్లర్లు పట్టుబడినా వదిలేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు.. ఎల్.రఘురామిరెడ్డి, సాక్షి: వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అందరూ దొంగలే! డబ్బు మూటల సాక్షిగా అధికారులు, రాజకీయనేతల ‘అపవిత్ర బంధం’తో అత్యంత కట్టుదిట్టమైన నెట్వర్క్ మధ్య ‘ఎర్రబంగారం’ అనునిత్యం రాయలసీమ జిల్లాల నుంచి దేశం ఎల్లలు దాటిపోతోంది. పోలీసు, అటవీశాఖలకు చెందిన పలువురు అధికారులు ఇంటి దొంగల పాత్ర పోషిస్తుండగా.. కొందరు రాజకీయ నేతలు రాజీలు కుదిర్చే పెద్దన్నల పాత్ర పోషిస్తున్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా అందరూ కలిసి ఎర్రచందనాన్ని నిరాటంకంగా సరిహద్దులు దాటిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఈ ఇంటి దొంగలకు తెలియకుండా ఎవరైనా అధికారులు దాడులు చేసి పట్టుకున్నా దొరికేది కూలీలు, డ్రైవర్లే! వారు చెప్పే వివరాల ఆధారంగా చిన్న స్మగ్లర్లను అధికారులు అరెస్టు చేసినా వెంటనే వదిలేయాలంటూ నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తాయి. గట్టి అధికారి ఎవరైనా వినకపోతే ఉన్నతాధికారులతో చెప్పించి విడుదల చేయిస్తారు. అంతటితో దాని ‘కథ’ ముగిసిపోతుంది. శేషాచలం టూ సింగపూర్ కోట్లు కుమ్మరిస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణా ఓ మాఫియాలా మారడంతో.. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని అత్యంత అరుదైన, విలువైన ఈ వృక్షజాతి ఉన్న అడవులు అంతరించిపోతున్నాయి. ఈ అయిదు జిల్లాల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఈ వృక్ష జాతి లేదు. (అంతరించిపోతున్న వృక్షజాతుల్లో చేర్చారు) ఈ కలప ఎగుమతికి ఎవరికీ అనుమతి లేదు. దీంతో రాష్ట్రంలోని, తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని రాయలసీమలోని శేషాచలం, పాపికొండలు, లంకమల అభయారణ్యాల నుంచి వేలాది టన్నులు జపాన్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్ తదితర దేశాలకు చట్టవిరుద్ధంగా తరలిస్తున్నారు. పెలైట్ల సాయంతో చెక్‌పోస్టులు దాటి ఒక ప్రాంతం నుంచి వాహనంలో సరుకు తరలించే ముందు స్మగ్లర్లు తమకు అనుకూలమైన పోలీసు, అటవీ సిబ్బంది ద్వారా సదరు మార్గంలో ఎవరైనా అధికారులు ఉన్నారా? అని విషయం తెలుసుకుంటారు. లైన్ క్లియర్‌గా ఉందని సమాచారం వచ్చినా ఒక పట్టాన నమ్మరు. ఆ ప్రాంతంలోని నమ్మకస్తులైన కొందరు యువకులను మాట్లాడుకుని మోటార్ సైకిల్ లేదా కారులో ఆ మార్గంలో పెలైట్‌గా పంపుతారు. అటవీ/పోలీసు సిబ్బంది లేరని నిర్ధారించుకున్న తర్వాత ముందు ఒక ఖాళీ వాహనం వెళుతుంది. దాని వెనుక ఎర్రచందనం దుంగలున్న వాహనం వెళుతుంది. మధ్యలో సెల్ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ఏమాత్రం అనుమానం వచ్చినా వాహనాన్ని దారి మళ్లించేస్తారు. అటవీ ప్రాంతం, చెక్‌పోస్టులు దాటుకుని నిర్ధారిత ప్రధాన మార్గానికి చేరుకుంటారు. ఇలా పెలైట్‌గా వెళ్లినవారికి 3 నుంచి 5 కిలోమీటర్లకు రూ.10 వేలు చొప్పున ఇస్తారు. కంటెయినర్లలో ఓడరేవుకు సాధారణంగా చెన్నై పోర్టు ద్వారానే ఎర్రచందనాన్ని విదేశాలకు పంపిస్తారు. అందువల్ల ఆయూ జిల్లాల నుంచి చెన్నై మార్గంలో వెళ్లే వాహనాలనే అధికారులు తనిఖీ చేస్తారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు తాము కలప నిల్వ చేసిన ప్రాంతం నుంచి తొలుత హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకు తరలిస్తున్నారు. అంబులెన్సులు మొదలు ఆయిల్ ట్యాంకర్ల వరకూ దేనిలో వీలైతే దానిలో తరలిస్తున్నారు. ఆయా నగరాల్లోని ఫ్యాక్టరీల నుంచి వెళ్లే భారీ కంటెయినర్ల డ్రైవర్లకు దారిమధ్యలో భారీగా డబ్బు ఎరవేసి అందులో ఎర్రచందనం దుంగల్నీ నింపి చెన్నై, కృష్ణపట్నం, ముంబై, కాండ్లా తదితర ఓడరేవులకు చేరవేస్తున్నారు. ఇలా వేరే సరుకుల పేరుతో కంటెయినర్లు విదేశాలకు చేరతాయన్న మాట. కస్టమ్స్ అధికారులు పెద్ద పెద్ద కంపెనీలకు సెల్ఫ్ సీలింగ్ సదుపాయం కల్పించడమూ ఇందుకు అనువుగా మారింది. ‘‘మా పోర్టు నుంచి ప్రతిరోజూ 1500 కంటెయినర్లు వెళుతుంటాయి. అన్నింటినీ తనిఖీ చేయాలంటే రవాణా వ్యవస్థ స్తంభించి షిప్పులన్నీ ఆగిపోతాయి. అందువల్ల ర్యాండమ్ పద్ధతిలో కొన్ని కంటెయినర్లే తనిఖీ చేస్తాం. అలా చేసినప్పుడు గతంలో కొన్నింటిలో ఎర్రచందనం దొరికింది. దానిని సీజ్ చేశాం’’ అని చెన్నైకి చెందిన డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారి తెలిపారు. తమిళ కూలీలకు కాసులే కాసులు అటవీ ప్రాంతంలో చెట్లు నరికి ఎర్రచందనం దుంగలు తరలించే కూలీలకు వేలకు వేల కూలీ లభిస్తోంది. అందువల్లే తమిళనాడు సరిహద్దుల నుంచి ఈ పనికి 18-25 ఏళ్ల మధ్య వయసుగల కూలీలు అధిక సంఖ్యలో శేషాచలం అడవులకు వస్తున్నారు. అడవిలో చెట్టుకొట్టి తయారు చేసిన దుంగను వీరు 25-30 కిలోమీటర్లు మోసి వాహనాలు వెళ్లే మార్గం దగ్గరకు చేరవేస్తారు. ఇందుకు వారికి కిలోకు రూ.500 నుంచి రూ. 700 వరకూ ఇస్తున్నారు. ఒక్కో కూలీ మూడు రోజుల్లో 30 కిలోల బరువున్న దుంగను ఇలా చేర్చుతారు. వీరికి కిలోకు రూ.500 చొప్పున మూడు రోజుల కూలి కింద రూ.15 వేలు వస్తుంది. అంటే రోజు కూలి అక్షరాలా రూ.5 వేలు. అందువల్లే తమిళనాడులోని జమునా మత్తూర్, మామత్తూర్, ఆంబూర్, కన్నమంగళం, మలయార్ మక్కల్ ప్రాంతాల నుంచి కూలీలు వచ్చి ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారు. గత నెలలో శేషాచలం అడవుల్లో ఇద్దరు అటవీశాఖ సిబ్బందిని హత్య చేసింది ఈ ప్రాంతాలకు చెందిన కూలీలే. రాష్ట్రానికి చెందిన కూలీలకు రోజుకు రూ.2వేల నుంచి రూ.4 వేల వరకు ఇస్తున్నారు. 2011-12లో అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం 1430 మెట్రిక్ టన్నులుండగా.. దీనికి 10 నుంచి 12 రెట్లు విదేశాలకు తరలి ఉంటుందని అంచనా. పట్టుబడుతున్నదీ కూలీలే ఇటీవల రాయలసీమలో ప్రత్యేకించి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికేవారిలో 90 శాతం మంది తమిళ కూలీలే. కేసుల భయంవల్ల మన రాష్ట్రంలోని అటవీ పరిసర గ్రామాలవారు ఎర్రచందనం చెట్లు నరికేందుకు ఇష్టపడట్లేదు. స్మగ్లింగ్ నిరోధం పేరిట పోలీసు, అటవీ సిబ్బంది పట్టుకుంటున్నది కేవలం ఈ కూలీలు, వారిని పంపించే చిరుచేపల్నే. అధికారులు, రాజకీయ నేతల సహకారంతో రూ. వేల కోట్లు ఆర్జిస్తున్న తిమింగలాల్లాంటి అసలు నేరగాళ్లు దొరల్లా దర్జాగా తిరుగుతున్నారు. టాస్క్ఫోర్సు పట్టించిన చిన్న స్మగ్లర్లపై కేసు పెట్టకుండా వదిలేయడం వల్లే సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన సీఐ పార్థసారథితోపాటు ఇద్దరు పోలీసు అధికారులు సస్పెండ్ కావడం, మరికొందరి పాత్రపై దర్యాప్తు జరుగుతుండ టం స్మగ్లింగ్‌లో ఇంటి దొంగల పాత్రను స్పష్టం చేస్తోంది. తమిళనాడుకు చెందిన లాయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని అరెస్టరుున కూలీలకు బెయిల్ ఇప్పిస్తున్న స్థానిక న్యాయవాదులూ భారీగా ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. ‘‘అరెస్టయినట్లు తెలియగానే ఇక్కడి అడ్వకేట్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఒకరికి బెయిలిప్పిస్తే రూ.10 వేలు తీసుకుంటున్నారు.’’ అని కడపకు చెందిన ఓ లాయర్ తెలిపారు. -
స్మగ్లర్లు దొరికారని..బట్టలిప్పి చితక్కొట్టిన పోలీసులు
తిరుపతి: స్మగ్లర్లపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఏడుగురు స్మగ్లర్లు చిక్కారు. ఇంకే ముంది.. పోలీసులు రెచ్చిపోయారు. తమ చేతిలో ఉన్న కర్రలకు పని చెప్పారు. దొరకడమే అదునుగా భావించిన పోలీసులు స్మగ్లర్లను చితకబాదారు. వారి బట్టలిప్పి మరీ చావబాదారు. స్మగ్లర్లను కిందపడేసిన పోలీసులు వారు చుట్టుముట్టి మూకుమ్ముడిగా దాడి చేశారు. గతవారం స్మగ్లర్ల కార్యకలాపాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఇద్దరు అధికారులను మట్టుబెట్టడంతో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం ఏడుగురు స్మగ్లర్లు పోలీసులకు చిక్కడంతో వారిని చావబాదారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఎర్రచందనం దొంగలు - అటవీ, పోలీసు సిబ్బందికి మధ్య శనివారం కూడా పరస్పర దాడులు జరిగాయి. పోలీసులు ఒక దొంగను అదుపులోకి తీసుకుని విచారించగా ఒక బడా స్మగ్లర్ ఆచూకీ తెలిసింది. జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు వివిధ మార్గాల ద్వారా 145 మంది పోలీసులు అటవీ సిబ్బందితో కలిసి అడవుల్లో స్మగ్లర్లను గాలిస్తూ వెళ్లారు. తిరుపతి, భాకరాపేట, రేణిగుంట, కడప, రాజంపేట మీదుగా శేషాచలం అడవిలోకి చేరుకున్నారు. భాకరాపేట మీదుగా నామాల గుండుకు 9 కిలోమీటర్ల దూరంలో 15 మంది ఎర్రచందనం దొంగ కూలీలను పోలీసులు గుర్తించారు. వారు పోలీసులను చూడగానే రాళ్లతో దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ రోజు పకడ్బందీగా కూంబింగ్ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు కొంతమంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారికి నరకం చూపించారు. ఇంత జరిగినా అటవీ శాఖ అధికారులు మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. -
పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి
శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్ ఒకరి అరెస్ట్.. ఒక బడా స్మగ్లర్ వివరాలు లభ్యం భాకరాపేట, న్యూస్‌లైన్: శేషాచలం కొండల్లో ఎర్రచందనం దొంగలు - అటవీ, పోలీసు సిబ్బందికి మధ్య శనివారం పరస్పర దాడులు జరిగారుు. పోలీసులు ఒక దొంగను అదుపులోకి తీసుకుని విచారించగా ఒక బడా స్మగ్లర్ ఆచూకీ తెలిసింది. జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు వివిధ మార్గాల ద్వారా 145 మంది పోలీసులు అటవీ సిబ్బందితో కలిసి అడవుల్లో స్మగ్లర్లను గాలిస్తూ వెళ్లారు. తిరుపతి, భాకరాపేట, రేణిగుంట, కడప, రాజంపేట మీదుగా శేషాచలం అడవిలోకి చేరుకున్నారు. భాకరాపేట మీదుగా నామాల గుండుకు 9 కిలోమీటర్ల దూరంలో 15 మంది ఎర్రచందనం దొంగ కూలీలను పోలీసులు గుర్తించారు. వారు పోలీసులను చూడగానే రాళ్లతో దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో వారు పరుగులు తీశారు. ఎం.శివయ్య అనే వ్యక్తిని మాత్రం పోలీసులు పట్టుకున్నారు. విచారణలో అందరూ చిన్నగొట్టిగల్లు వుండలం చిట్టేచెర్ల పంచాయుతీ తువ్ముచేనుపల్లె గ్రామానికి చెందిన వారిగా వెల్లడైంది. ఆ గ్రామానికి చెందిన గూటాల కృష్ణారెడ్డి ఎర్రచందనం దుంగలను తీసుకురవ్ముని పంపించినట్లు వెల్లడైరుుంది. దీంతో అటవీశాఖాధికారులు, పోలీసులు తువ్ముచేనుపల్లెలోని కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను పరారయ్యూడు. అతనికి సంబంధించిన ఆధార్‌కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఇతని కువూరుడు ఏసీబీ ఉద్యోగి కావటం విశేషం. భాకరాపేట కేంద్రంగా తిరుపతి డీఎఫ్‌వో శ్రీనివాసులు, పీలేరు సీఐ పార్థసారథి వుకాం వేసి కూంబింగ్ కొనసాగిస్తున్నారు. -
'ఎర్ర’ స్మగ్లర్ల కోసం వేట
శేషాచలాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు అదుపులో 310 మంది దొంగ కూలీలు ముగ్గురు తమిళ స్మగ్లర్ల అరెస్ట్ వివిధ ప్రాంతాల్లో కూలీల అరెస్టులు.. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి.. తిరుమల శేషాచల అడవిలో ఇద్దరు అధికారులను హత్య చేసి మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచిన ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం పోలీసులు ఆదివారం రాత్రి నుంచే వేట ప్రారంభించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లిన 14 కూంబింగ్ బృందాలు స్మగ్లర్లు, కూలీల కోసం ముమ్మర గాలింపు చేపట్టాయి. వీరితోపాటు చిత్తూరు, వైఎస్ఆర్జిల్లా, కర్నూలుకు చెందిన పోలీసులు కూడా పాల్గొన్నారు. చెన్నై రైళ్లపై నిఘా పటిష్టం చేసి విసృ్తత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుమల, రేణిగుంట, తిరుపతిల్లోని ఎంఆర్ పల్లి, శ్రీకాళహస్తి, కల్యాణిడ్యామ్, మామండూరు రైల్వేస్టేషన్, చిత్తూరు ప్రాంతాల్లో 310 మందిని అరెస్టు చేశారు. తిరుమలలో పట్టుబడిన వారిని విచారించడంతో అటవీశాఖ అధికారులపై దాడి చేసినట్లు ముగ్గురు అంగీకరించారు. తిరుమలలో అరెస్టయిన 107 మందిని తిరుపతి టాస్క్ఫోర్సు కార్యాలయంలో విచారిస్తున్నారు. మిగిలిన వారిని రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శేషాచలం అడవుల నుంచి తమిళనాడుకు వెళ్తున్న వంద మంది ఎర్రచందనం కూలీలను చిత్తూరు చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు పోలీసులు ముంబై వెళ్లే జయంతి ఎక్స్‌ప్రెస్‌ను తనిఖీ చేసి దీనిలోని 48 మంది కూలీలను తిరుపతికి తరలించారు. ముగ్గురూ తమిళ స్మగ్లర్లే..: అటవీ శాఖాధికారులపై దాడి, హత్య ఘటనకు సంబంధించి ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు సోమవారం మీడియాకు తెలిపారు. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరు తాలూకాలోని కల్లపూరుకు చెందిన గోవిందరాజులు, చవదన్కాళి కాళహస్తి, అదేతాలూకా కిల్లనూరుకు చెందిన రామస్వామి అలియాస్ మాదిగాలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అధికారులపై కర్రలు, బండలతో దాడిచేసినట్టు వారు అంగీకరించారని.. మరణించిన అధికారులు శ్రీధర్, డేవిడ్ల సెల్ఫోన్లు, ఉంగరాలు, నగదును వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 147, 148, 341, 302, 307, 332, 333, 120బి, 149 కింద, అటవీ చట్టం 21 ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ఇలాం టి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా 20 మంది సాయుధ పోలీసులను అటవీశాఖకు అప్పగిస్తున్నామన్నా రు. ఇదిలావుంటే.. తిరుపతి అటవీశాఖ కార్యాలయంలో అడవుల పరిరక్షణ ప్రధానాధికారి సోమశేఖర్‌రెడ్డితో పాటు స్పెషల్ పీసీసీఎఫ్ ఎస్.బి.సి.మిశ్రా, సీఎఫ్ఓ రవికుమార్, డీఎఫ్‌వోలు సమావేశమై దాడి ఘటనపై సమీక్షించారు. కుటుంబ సభ్యులకు మృత దేహాల అప్పగింత: స్మగ్లర్ల దాడిలో చనిపోయిన అటవీ అధికారుల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం సోమవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీధర్ మృతదేహాన్ని ర్యాలీగా తీసుకెళ్లి తిరుపతి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించగా, డేవిడ్ మృతదేహాన్ని తిరుపతి వెస్ట్ చర్చికి తరలించి ప్రార్థనల అనంతరం అంత్యక్రియలు నిర్వహించా రు. మరోపక్క ఇదే దాడిలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందు తున్న అధికారులు కోలుకుంటున్నారు. ఆయుధాల కోసం సిబ్బంది ఆందోళన: తిరుపతిలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద సోమవారం జిల్లా అటవీశాఖ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విధుల్లో తమకు ఆయుధాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆయుధాలు అందిస్తామని అడవుల పరిరక్షణ ప్రధానాధికారి బి.సోమశేఖర్‌రెడ్డి హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. గవర్నర్ దిగ్భ్రాంతి అటవీ అదికారులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి, ఇద్దరు అధికారుల హత్యలపై గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరాచక శక్తులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. -
అడవిలో దొంగలరాజ్యం!
శేషాచల అడవుల్లో ఎప్పటిలా స్మగ్లర్ల ఇష్టారాజ్యమే నడుస్తున్నదని మరోసారి రుజువైంది. అలసత్వంవహించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షిగా ఆదివారం అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు దాడులకు దిగి ఇద్దరు అధికారులను పొట్టనబెట్టుకున్నారు. మరో ముగ్గురు సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. దాడులు ఒకసారి కాదు... రెండుసార్లు జరిగాయి. దాదాపు ఆరుగంటలపాటు కొనసాగాయి. దాదాపు వంద మంది స్మగ్లర్లు, కూలీలు కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడిచేసి చేశారంటే పరిస్థితి ఎలా ఉందో, స్మగ్లింగ్ కార్యకలాపాల విస్తృతి ఎంతగా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. మహావృక్షాలను కూల్చేయడానికి అక్కడకు వెళ్లేవారంతా హెలికాప్టర్లలోనో, పారాచూట్లలోనో అక్కడ దిగరు. చాలా గ్రామాలను దాటుకునే వెళ్తారు. ఎర్ర చందనాన్ని దర్జాగా ట్రక్కుల్లో తరలిస్తారు. అయినా వారి కార్యకలాపాలపై స్థానిక అధికారులకు, పోలీసులకు సమాచారం అందదు. ప్రాణభీతి ఉన్నవారో, అవినీతికి అలవాటుపడినవారో ఈ స్మగ్లర్ల కార్యకలాపాలను చూసీచూడనట్టు ఊరు కుంటారు. కానీ, చిత్తశుద్ధితో కర్తవ్య నిర్వహణ చేయడానికి ప్రయత్నించేవారు ఇలా ప్రాణాలు కోల్పోతుంటారు. శేషాచల అడవుల్లో ఇదేమీ ఊహించని ఘటన కాదు. అక్కడ నిత్యమూ స్మగ్లర్లు తమ ఉనికిని చాటు కుంటూనే ఉన్నారు. తామెక్కడా తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నారు. ఇటు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, ఉదయగిరి మొదలుకొని మంగళూరు, ముంబై, కొచ్చి వరకూ ఎటు కుదిరితే అటు... ఎలా వీలైతే అలా అపురూపమైన ఎర్రచందనాన్ని స్మగ్లర్లు ఎల్లలు దాటిస్తూనే ఉన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడల్లా చర్యలు తీసుకుంటా మనడం, స్మగ్లర్ల పనిపడతామనడం తప్ప పటిష్టమైన వ్యవస్థను ఏర్పరచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అందువల్లే స్మగ్లింగ్‌కు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. ఎర్రచందనం వృక్ష సంపద ప్రపంచంలోనే అరుదైనది. ఇది ఎక్కడపడితే అక్కడ పెరిగేది కాదు. మన దేశానికీ, అందులోనూ మన రాష్ట్రానికి పరిమితమైన అపురూపమైన సంపద. ఎన్నడో 1973లోనే దీన్ని అరుదైన వృక్షజాతుల పరిధిలో చేర్చారు. రాష్ట్రంలో శేషాచలం, పాలకొండలు, లంకమల అడవుల్లో ఇది ఏపుగా పెరుగుతుంది. ఖరీదైన బొమ్మల తయారీనుంచి ఆయుర్వేద ఔషధాలు, అణు రియాక్టర్ల వరకూ ఎన్నిటిలోనో ఇది ఉపయోగపడుతుంది. దుంగ నాణ్యతను బట్టి టన్ను ధర పాతిక లక్షల రూపాయలవరకూ పలుకుతుంది. విదేశాల్లో గిరాకీనిబట్టి దీని ధర మరిన్ని రెట్లు ఉంటుంది. దాదాపు అయిదున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ వృక్ష సంపద ఉన్నదని సర్కారీ లెక్కలు చెబుతున్నా, నిత్యమూ చందనం వృక్షాలను నేలకూల్చడంలో బిజీగా ఉంటున్న స్మగ్లర్లు ఇందులో ఏమేరకు మిగిల్చారో అనుమానమే. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, మణిపూర్ రాష్ట్రాలకు ఈ ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ అయి అక్కడి నుంచి విదేశాలకు... ముఖ్యంగా చైనా, జపాన్, మయన్మార్ వంటి దేశాలకు తరలిపోతాయి. మూడేళ్లక్రితం మలేసియా అధికారులు ఒక ఓడను తనిఖీచేసి చెన్నై పోర్టు నుంచి ఈ ఎర్రచందనాన్ని అక్రమంగా తెస్తున్నారని నిర్ధారించి వెనక్కు పంపారు. అయిదారురోజులక్రితమే కోల్‌కతా విమానా శ్రయంలో కస్టమ్స్ విభాగం అధికారులు 179 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని అయిదుగురు చైనా జాతీయులను అరెస్టుచేశారు. నెలరోజుల వ్యవధిలో కోల్‌కతా విమానాశ్రయంలో ఇలా ఎర్రచందనాన్ని పట్టుకోవడం ఇది నాలుగోసారని, ఇంతవరకూ మొత్తం 600 కిలోల ఎర్రచందనం స్వాధీనమైందని వారు చెప్పారంటే స్మగ్లింగ్ కార్యకలాపాలు ఎంత జోరుగా సాగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. స్మగ్లర్ల ధాటిని తట్టుకోవడం తమవల్ల కావడంలేదని అటవీ శాఖ అధికారులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం, ఆయుధాలివ్వకపోవడంవల్లే ఎర్రచందనాన్ని రక్షించలేకపోతున్నామని చెబుతు న్నారు. అయినా ప్రభుత్వపరంగా చర్యలు లేవు. అటవీశాఖ అధికారులకు ఆయుధాలిచ్చే ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ తుదినిర్ణయం తీసుకోవడంలో జాప్యంచేస్తోంది. పట్టుబడినవారిపై బెయిలబుల్ కేసులే పెట్టడం, కోర్టుల్లో చాలా సందర్భాల్లో తగిన సాక్ష్యాలు లభించక ఆ కేసులు వీగిపోతుండటం స్మగ్లర్లకు వరంగా మారుతున్నది. పైగా, స్మగ్లింగ్ కేసుల్లో పెద్ద తలకాయలను మినహా యిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిరుడు హోంశాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారాన్ని సమీక్షించింది. అటవీశాఖనుంచి, పోలీసు శాఖనుంచి నివేదికలు కోరింది. ఆ సంఘం తదుపరి చర్యలేమిటో ఇంతవరకూ తెలియలేదు. ఈ స్మగ్లింగ్ బెడదను నివారించడానికి మరో మార్గం కూడా ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. వివిధ అటవీశాఖ డిపోల్లో పలు సందర్భాల్లో పట్టుబడిన 15,000 టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయి. ఇందులో దాదాపు 9,000 టన్నుల ఎర్రచందనాన్ని వేలం వేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ చాన్నాళ్లక్రితమే అనుమతినిచ్చింది. అయితే ఇంతవరకూ ఆ వేలం ప్రారంభం కాలేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా ఎర్ర చందనానికున్న డిమాండ్ కొన్నేళ్లపాటు నిలిచిపోతుందని, ఫలితంగా స్మగ్లింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగానైనా తగ్గిపోతాయని అంటున్నారు. ఆ పని చేయడంతోపాటు మొత్తంగా ఎర్రచందనం వృక్షాల రక్షణకు తీసుకోవాల్సిన బహు ముఖ చర్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాలి. ముఖ్యంగా ఈ స్మగ్లింగ్‌ను అరికట్టడానికి అటవీశాఖ అధికారులకు ఏమేమి అవసరమో గుర్తించి వాటిని తీర్చడంతోపాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా మార్చి, కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటుచే యాలి. ఇవన్నీ చేసినప్పుడే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడుతుంది. -
‘రెడ్’ కార్పెట్ చిత్తూరు!
=ఎర్రచందనం అక్రమ రవాణాకు రాచమార్గం =తమిళనాడు నుంచి శేషాచలం కొండలకు యథేచ్ఛగా ‘ఎర్ర’ కూలీల రాక =అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా లేకపోవడమే కారణం =వేలూరు వయా నరహరిపేట చెక్‌పోస్టు మీదుగా ప్రవేశం సాక్షి, చిత్తూరు: జిల్లా నుంచి కోట్ల రూపాయల విలువజేసే ఎర్రచందనం నిత్యం అక్రమంగా తరలిపోతోంది. ఇందుకు చి త్తూరు పట్టణం ప్రధాన రహదారిగా మారింది. శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు కూలీలు తమిళనాడు నుంచి చిత్తూరు పట్టణం మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. శే షాచలం అడవుల్లోకి దాదాపు 170-200 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడు నార్త్ ఆర్కాట్, సేలం, తిరువణ్ణామలై జిల్లాల నుంచి ఎర్రచందనం నరికేందుకు కూలీలు వందల సంఖ్యలో బ్యాచ్‌లు, బ్యాచ్‌లుగా ప్రతి రోజూ వస్తున్నారు. వీరు ఏ వాహనంలో వచ్చినా చిత్తూరు-వేలూరు అంతర్రాష్ట్ర రహదారి లేదా, గుడియాత్తం, యాదమరి మీదుగా చిత్తూరుకు వచ్చి అక్కడి నుంచి తిరుపతి సమీపంలోని అటవీప్రాంతాలకు చేరుకోవాల్సిందే. అటవీ ప్రాంతానికి చేరుకోకముందే వీరిని నిరోధించి అదుపులోకి తీసుకునే చర్యలు దాదాపుగా లేవు. గుడిపాల మండలం వద్ద తమిళనాడు నుంచి ప్రవేశించే మార్గంలో నరహరిపేట చెక్ పోస్టుతో పాటు, ప్రధాన రహదారిపైనే గుడిపాల పోలీసు చెక్‌పోస్టు ఉంది. తమిళనాడు నుంచి వచ్చే ఏ వాహనం అయినా ఈ మార్గంలోనే రావాలి. ఇక్కడ పోలీసులు, అటవీశాఖ సంయుక్తంగా చిత్తూరు వైపు వస్తున్న వాహనాల్లో అనుమానం వచ్చిన వాటిని తనిఖీ చేస్తే కచ్చితంగా ఎర్రచందనం నరికే తమిళ కూలీలను ముందేపట్టుకోవచ్చని అటవీశాఖలోని ఓ అధికారి వెల్లడించారు. సరిహద్దుల్లో నిఘా అవసరం తిరుపతి సమీపంలోని ఐతేపల్లె వద్ద గతంలో అటవీశాఖ అధికారులు నిఘావేసి తమిళనాడు ఆర్టీసీ బస్సుల్లో వస్తున్న చాలా మంది తమిళ కూలీలను పట్టుకున్నారు. రెండు నెలల క్రితం పనపాకం వద్ద అడవిలోకి ప్రవేశిస్తున్న తమిళ కూలీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి పోలీసు పరిధిలోని రేణిగుంట సబ్ డివిజన్లోని మామండూరు వద్ద లారీల్లో వచ్చి అడవిలోకి ప్రవేశిస్తున్న తమిళతంబీలను రేణిగుంట పోలీసులు అరెస్టు చేశారు. అయినప్పటికీ నిత్యం జిల్లా నుంచి ఎర్రచందనం తరలుతూనే ఉంది. ఈ నిఘా చిత్తూరు సరిహద్దుల్లోనే చేపడితే ఇక్కడి వరకు ఎర్రదొంగలు రారని అటవీశాఖవర్గాలే చెబుతున్నాయి. స్మగ్లర్ల రూటే వేరు... శేషాచలం కొండల నుంచి ఎర్రచందనాన్ని చిత్తూరు మీదుగా రాణిపేట బైపాస్ ద్వారా చెన్నై ఓడరేవుకు తరలిస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో మామండూరు అడవుల్లో నరికే ఎర్రచందనం శ్రీకాళహస్తి వయా తడ మీదుగా చెన్నై శివార్లలోని గోడౌన్లకు తరలిస్తారు. అక్కడి హార్బర్ నుం చి షిప్పుల్లో విదేశాలకు వెళుతుంది. రేణిగుంట, గాజులమండ్యం మీదుగా పుత్తూరు నగరి రహదారుల్లోనూ ఎర్రచందనం చెన్నై చేరుతోంది. వెఎస్సార్ జిల్లా రాజంపేట నుంచి రాయచోటి, పెద్దమండ్యం బైపాస్, ములకలచెరువు, చింతామణి, చిక్బల్లాపూర్ ద్వారా స్మగ్లర్లు బెంగళూరు రూరల్‌లోని గోడౌన్లకు ఎర్రచందనం పంపిస్తారు. అక్కడి నుంచి వాహనాల్లో ముంబై హైవే ద్వారా రోడ్డుమార్గంలోనే ముంబైపోర్టుకు అక్కడి నుంచి విదేశాలకు పంపుతున్నట్లు సమాచారం. ఒక వేళ పోలీసులు ఈ రూట్లో దృష్టిసారిస్తే పీలేరు, పుంగనూరు, రామసముద్రం, చింతామణి మార్గంలో కర్ణాటకకు ఎర్రచందనం తరలిస్తున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే ముందుగా జిల్లాలోకి ఎర్రచందనం కూలీలు రాకుండా అటవీశాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా కృషి చేయాల్సి ఉంది.