13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | res sandl wood seazed | Sakshi
Sakshi News home page

13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Dec 18 2017 8:20 AM | Updated on Dec 18 2017 8:20 AM

సాక్షి, చంద్రగిరి: శేషాచలంలోని ఎర్రగుట్ట ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా దాచిన 13 ఎర్రచందనం దుంగలను ఆర్‌ఎస్సై వాసు బృందం ఆదివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఆర్‌ఎస్సై వాసు బృందం కూంబింగ్‌ చేపట్టారు. నరసింగాపురం ఎస్టీకాలనీ వద్ద కూబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అధికారులను చూసి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాడు. అధికారులు వెంబడించినా లాభం లేకపోయింది. ఎర్రగుట్ట వద్ద తనిఖీ చేయడంతో చెట్ల పొదల్లో దాచిన సుమారు 13 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన కూలీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడుల్లో డీఆర్వో నరసింహరావు, ఎఫ్‌బీవో జానీబాషా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement