
సాక్షి, చిత్తూరు : చంద్రగిరి మండలం భీమవరం పాలెంకొండ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. తమకు ఎదురుపడ్డ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై గొడ్డళ్లు, రంపాలు, రాళ్లతో దాడికి దిగారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనలో ఫారెస్టు ఎఫ్‌బీవో కోదండకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. జవ్వాదిమలైకి చెందిన నలుగురు స్మగ్మర్లను అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment