taskforce team
-
టెలికం తయారీకి డాట్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం రంగంలో తయారీ వ్యవస్థకు దన్నునిచ్చేందుకు టెలికం శాఖ(డాట్) సన్నాహాలు ప్రారంభించింది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై అవసరమైన సిఫారసులను సిద్ధం చేసేందుకు నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా టెలికం తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కున్న అవరోధాలను తొలగించి బలపడేందుకు ప్రోత్సాహాన్నివ్వనుంది. ఈ విషయాలను అధికారిక మెమొరాండం పేర్కొంది. ఈ నెల మొదట్లో టెలికం గేర్ల తయారీ కంపెనీలకు చెందిన 42 మంది చీఫ్‌లతో కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకు బీజం వేసింది. ఈ సమావేశంలో కంపెనీ చీఫ్‌లు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు అవసరమున్నట్లు మంత్రి భావించారు. గేర్ తయారీకి బూస్ట్ టాస్క్‌ఫోర్సుల్లో ఒకదాని ద్వారా టెలికం గేర్ తయారీకి దశలవారీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని డాట్ సిఫారసు చేస్తోంది. తద్వారా దేశీ సరఫరా చైన్ ఎకోసిస్టమ్‌కు బూస్ట్‌నివ్వాలని యోచిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలను ఆకట్టుకునే ప్రణాళికల్లో ఉంది. తాజా మెమొరాండం ప్రకారం ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వ రంగ రీసెర్చ్ సంస్థ సీడాట్ సీఈవో ఆర్కే ఉపాధ్యాయ్‌ను సహచైర్మన్‌గా ఏర్పాటు చేయనుంది. 2016లో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు దశలవారీ కార్యక్రమాన్ని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. తేజాస్ నెట్వర్క్స్ సీఈవో సంజయ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న టాస్క్‌ఫోర్స్ ప్రస్తుత ఎకోసిస్టమ్‌ను అధ్యయనం చేస్తుంది. తదుపరి టెలి కం టెక్నాలజీ అభివృద్ధి నిధి, సెమికాన్ పాలసీ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ వంటి పథకాల ద్వారా 4–5 చిప్ డెవలప్‌మెంట్స్‌కు అవకాశాలను సూచిస్తుంది. తద్వా రా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. కస్టమ్ క్లియరెన్స్‌లపై దృష్టి మూడో టాస్క్‌ఫోర్స్ కస్టమ్ క్లియరెన్స్, ఎయిర్ కార్గో రవాణా, మౌలికసదుపాయాల అందుబాటుపై పరిశీలన చేపడుతుంది. తద్వారా లీడ్ సమయాన్ని మెరుగుపరచడం, ఉత్పత్తి, అమ్మకాలలో ఇన్వెంటరీని తగ్గించడం, కీలక విమానాశ్రయాలలో ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్ల ఏర్పాటు తదితరాల ద్వారా లాజిస్టిక్స్ సవాళ్లకు చెక్ పెడుతుంది. టెలికం గేర్ తయారీదారుల సమాఖ్య వీవోఐసీఈ(వాయిస్) డైరెక్టర్ జనరల్ ఆర్కే భట్నాగర్ అధ్యక్షతన మరో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టాస్క్‌ఫోర్స్ డిజిటల్ ఇండియా, డేటా సెంటర్లు, రైల్వే ఆధునీకరణ తదితరాలకు అవసరమైన 5జీ ప్రొడక్టుల అభివృద్ధి, తయారీకి దేశీయంగా కొత్త అవకాశాలను గుర్తించనుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లన్నీ 45 రోజుల్లోగా నివేదికలను దాఖలు చేయవలసి ఉంటుందని అధికారిక మెమొరాండం పేర్కొంది. -
కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సెపరేటు.. దొంగలతో చేతులు కలిపి
సాక్షి, హైదరాబాద్: ప్రజలను రక్షించే బాధ్యత పోలీసులదే. ఎక్కడ ఏ అన్యాయం, నేరం జరిగినా ముందుండేది ఖాకీలే. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో వీరిదే కీలక పాత్ర. పోలీస్ వృత్తికి, యూనిఫామ్‌కు ఉన్న గౌరవం అలాంటిం. అయితే అభాగుల్యకు, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే దారితప్పుతున్నారు. తక్కువ కాలంలో కోట్లు సంపాదించాలనే దురుద్దేశంతో అక్రమ మార్గాలు తొక్కుతున్నారు. నేరస్తుల పంచన చేరి తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే కానిస్టేబుల్ ఈశ్వర్.. వృత్తి పోలీస్ అయినా చేసేవన్నీ దొంగ పనులు. ప్రస్తుతం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. హఫీజ్‌పేటలో నివాసముంటున్న ఈశ్వర్ స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా స్టూవర్ట్‌పురం. గౌరవనీయమైన పోలీస్ వృత్తిలో ఉంటూ దొంగలతో చేతులు కలిపి నెలసరీ మామూళ్లు వసూళ్లు చేయడం ప్రారంభించాడు. కొన్నేళ్లకు ఈశ్వర్ ప్రవర్తన మీద ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో పోలీస్ ఆపరేషన్స్‌కు దూరంగా పెట్టారు. టాస్క్‌ఫోర్స్ విభాగానికి అటాచ్ చేశారు. ముఠా నేతగా అయినా ఈ కానిస్టేబుల్ తన వక్ర బుద్దిని మార్చుకోలేదు. అంతేనా రూటు మార్చి కొత్త పద్దతులో డబ్బు సంపాదనకు శ్రీకారం చుట్టాడు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తూ ఆ కుటుంబంలో ఉన్న యువకులు, మైనర్లను తన ఇంటికి తీసుకొచ్చేవాడు. వీరందరితో ఓ ముఠా ఏర్పాటు చేసి చోరీలకు పథకాన్ని రచించేవాడు. ఆ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించేవాడు. వారితో దొంగతనాలు, చైన్ స్నానింగ్లు వంటివి చేయించేవాడు. దొంగతనం చేసిన సొమ్ము లక్షల్లో అతని చేతిలోకి రాగానే ఒక్కొక్కరికి రూ. 40 వేల నుంచి 50 వేల వరకు చెల్లించి చేతులు దులుపుకునేవాడు. మాయమాటలు చెప్పి బెయిల్ ఒకవేళ దొంగలు పోలీసులకు పట్టుబడితే తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. పట్టుబడిన నిందితులు తనకు కావాల్సిన వారని, దగ్గరి బంధువులంటూ ఏదో మాయమాటలు చెప్పి వారిని కేసు నుంచి తప్పించడం, బెయిల్‌పై బయటకు తీసుకురావడం చేసేవాడు. అంతేగాకుండా అంతరాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు బయల్దేరగానే వారికి ముందుగానే సమాచారమిచ్చి తప్పించుకునేలా సహకరించేవాడని కూడా ఈశ్వర్‌పై ఆరోపణలున్నాయి. చదవండి: Hyderabad: టీచర్ల నిర్వాకం.. విద్యార్థులతో పారిశుద్ధ్య పనులు..! అధికారుల పరిచయాలతో చివరికి ఈశ్వర్ చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అతనిపై చీరాల, బేగంపేట, హుమాయిన్‌నగర్ తదితర పోలీస్ స్టేషన్లో గృహహింస, కిడ్నాప్ కింద కేసులు నమోదైనట్లు గుర్తించారు. దీంతో ఐదుసార్లు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే తనకున్న ఉన్నతస్థాయి అధికారుల పరిచయాలతో నెలల వ్యవధిలోనే మళ్లీ కొలువులో చేరేవాడు. నల్గొండ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా సీఐ..ఏ సీపీ స్థాయిలో ఉన్న అధికారులను బదిలీ చేయించగల సత్తా తనకుందని.. తాను దొంగతనం చేయం ఏంటని బుకాయించి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇతడు చేసే నేరాల్లో మరో కానిస్టేబుల్ కూడా సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై కూడా పోలీసులు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతునట్లు సమాచారం -
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కరోనా సీజన్లోనూ ఐపీఎల్ బెట్టింగ్‌లు జోరుగానే కొనసాగుతున్నాయి. బెట్టింగ్‌లకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేయడం లేదు. తాజాగా హైదరాబాద్ దూల్‌పేట్‌కు చెందిన శివశంకర్ సింగ్ అనే వ్యక్తి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా శివశంకర్ వద్ద నుంచి రూ. 56వేల నగదు, సెల్ ఫోన్, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : ఐపీఎల్ బెట్టింగ్: రూ.16 కోట్లు స్వాధీనం) -
పోలీసులపై రాళ్లు రువ్విన‘ఎర్ర’కూలీలు
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై కూలీలు తిరగబడిన ఘటన చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దీంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరపగా.. కూలీలు పరారయ్యారు. వారిని వెంబడించిన పోలీసులు ఒక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు టాస్క్‌ఫోర్స్ బృందం గురువారం రాత్రి శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది. ఆ బృందం శుక్రవారం తెల్లవారుజామున మూలపల్లి అటవీ ప్రాంతానికి చేరుకోగా.. పొదల మధ్య నక్కిన కూలీలు స్మగ్లర్లు ఒక్కసారిగా వారిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో వారు ఎర్రచందనం దుంగలను వదిలేసి పారిపోయారు. చీకటిలో వారిని వెంబడించగా ఒక స్మగ్లర్ దొరికాడు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన స్మగ్లర్ తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా జమునమత్తూరు తాలూకా నాచమలై గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. -
పైకి చూస్తే పెళ్లి కారు.. లోన చూస్తే..
సాక్షి, తిరుపతి : టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. కారులో తరలించేందుకు సిద్ధమైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ వాసు కథనం మేరకు.. రేణిగుంట్ల సమీపంలోని తిరుమల నగర్ వద్ద సోమవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పెళ్లి కారు కనిపించింది. ఇది పెళ్లిళ్ల సీజన్ కాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.. పెళ్లి పేరుతో అందంగా అలంకరించిన కారులో స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగలను, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిండ్ర మండలానికి చెందిన దొరవేలు, మంగళంకు చెందిన దిలీప్‌కుమార్, తేజ, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మస్తాన్‌లుగా గుర్తించారు. -
పోలీసులపై గొడ్డళ్లు, రంపాలతో దాడి..
సాక్షి, చిత్తూరు : చంద్రగిరి మండలం భీమవరం పాలెంకొండ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. తమకు ఎదురుపడ్డ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై గొడ్డళ్లు, రంపాలు, రాళ్లతో దాడికి దిగారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనలో ఫారెస్టు ఎఫ్‌బీవో కోదండకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. జవ్వాదిమలైకి చెందిన నలుగురు స్మగ్మర్లను అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వెల్లడించారు. -
సినిమా థియేటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు
సాక్షి, కరీనంగర్ : పట్టణంలోని శివ థియేటర్‌పై టాస్క్‌పోర్స్ పోలీసులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించనందుకు థియేటర్ యాజమాన్యంపై భారీగా జరిమానా విధించారు. క్యాంటిన్లో ఎమ్మార్పీ రేట్ల కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని గమనించారు. 18 రూపాయలకు విక్రయించాల్సిన కూల్‌డ్రింక్ ధర రూ.30 కి, రూ.15 కు అమ్మాల్సిన స్నాక్స్ రూ.25కు, 10 రూపాయల పాప్‌కార్న్ 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. అలాగే అన్ని ఆహార పదార్థాల ధరలు దాదాపు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. పైగా ఆహార పదార్థాల నాణ్యత నాసిరకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు, మాధవి, డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రోలజీ ఆఫీసర్ రత్నప్రభ, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రనాథ్, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కొండల్ రెడ్డి, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రకూలీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం చెర్లోపల్లి సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రకూలీలు రాళ్లదాడికి దిగారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుమారు రూ.2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రాళ్లతో దాడికి పాల్పడిన ఎర్రకూలీలు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీగా ఎర్రచందనం పట్టివేత