
సాక్షి, హైదరాబాద్ : కరోనా సీజన్‌లోనూ ఐపీఎల్ బెట్టింగ్‌లు జోరుగానే కొనసాగుతున్నాయి. బెట్టింగ్‌లకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేయడం లేదు. తాజాగా హైదరాబాద్ దూల్‌పేట్‌కు చెందిన శివశంకర్ సింగ్ అనే వ్యక్తి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా శివశంకర్ వద్ద నుంచి రూ. 56వేల నగదు, సెల్ ఫోన్, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : ఐపీఎల్ బెట్టింగ్: రూ.16 కోట్లు స్వాధీనం)
Comments
Please login to add a commentAdd a comment