dhoolpet
-
ధూల్ పేట్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో రామనవమి శోభాయాత్ర
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసిన చికోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చికోటి ప్రవీణ్ కుమార్ కలిశారు. శుక్రవారం ధూల్‌పేట్‌లోని రాజాసింగ్ నివాసానికి వెళ్లిన ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హిందూత్వ వాదిగా మాత్రమే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలవడానికి వచ్చానన్నారు. హిందూ ధర్మం కోసం పోరాడే వారందరికీ అండగా ఉంటానని తెలిపారు. తనకు ఏ పార్టీలతో కూడా ఎలాంటి సంబంధంలేదన్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఆలోచన కూడా లేదన్నారు. రాజాసింగ్ హిందూ టైగర్ కాబట్టే ఆయన కలవడానికి వచ్చానని చికోటి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: (నిత్యం పొడవాటి గడ్డంతోనే..! ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా?) -
Dhoolpet : సిలిండర్ రీఫిల్లింగ్ సెంటర్లో ప్రమాదం... ఇద్దరు మృతి
-
Dhoolpet : సిలిండర్ రీఫిల్లింగ్ సెంటర్లో ప్రమాదం... ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: ధూల్‌పేట్ టక్కరివాడిలో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తున్న కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒకరు మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. టక్కరివాడిలోని లాల్‌భవన్ వెనుక ప్రాంతంలో వీరూ సింగ్ (50) కుటుంబ సభ్యులతో కలిసి గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాన్ని నడుపుతున్నాడు. సాయంత్రం వేళ అతని భార్య సుత్ర సింగ్ కిచెన్‌లో వంట చేస్తుండగా.. కొద్ది దూరంలోనే వీరూ సింగ్ అతని కుమారులు మానవ్‌సింగ్(22), షేరుసింగ్ (25)లు సిలిండర్లలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఒక్కసారిగా సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. ఈ సంఘటనలో మానవ్‌సింగ్ మృతిచెందగా వీరూ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద కుమారుడు షేరుసింగ్, భార్య సుచిత్ర సింగ్‌లు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పేలుడు శబ్ధానికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక అయామయానికి గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు సవచారం అందుకున్న గోషామహాల్ ఏసీపీ నరేందర్ రెడ్డి, మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్రెడ్డి, గోషామహాల్ కార్పొరేటర్ లాల్‌సింగ్, స్థానికుల సహాయంతో నలుగురిని కంచన్‌బాగ్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మానవ్‌సింగ్ మృతిచెందాడు. తండ్రి వీరసింగ్ 70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. తల్లి, పెద్ద కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఉలిక్కిపడ్డ టక్కరివాడి అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తున్న కేంద్రంలో భారీ పేలుడు జరగడంతో టక్కరివాడి ప్రాంతం ఉలిక్కిపడింది. స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందో తెలియక మొదట అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రీఫిల్లింగ్ కేంద్రంలో ఒక సిలిండర్ బ్లాస్ట్ కాగా మరో సిలిండర్‌లో గ్యాస్ లీక్ అవుతుండగా స్థానికంగా నివసించే ఓ వ్యక్తి గమనించి..ఆ సిలిండర్‌ను కట్టెతో జరిపి రోడ్డుపై పడేశాడు. దీంతో ప్రవదం తప్పింది. అనంతరం స్థానికులంతా పోలీసులతో కలిసి ఇంట్లో ఉన్న అన్ని సిలిండర్లను బయట పడవేశారు. కరోనాతో కుదేలై..గ్యాస్ రీఫిల్లింగ్ గతంలో ఆటోరిక్షా నడుపుతూ వీరూ సింగ్ కుటుంబాన్ని పోషించేవాడు. గత సంవత్సరం నుండి కరోనా మహమ్మారితో ఆటో నడపక...ఉపాధి కోల్పోయాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం ప్రారంభించాడు. ఇద్దరు కువరులు కూడా ఉద్యోగాలు కోల్పోయి..ఇంటి పట్టునే ఉంటూ తండ్రికి సహాయపడుతూ వస్తున్నారు. చివరకు గ్యాస్ బండ పేలుడులో చిన్న కుమారుడు మానవ్‌సింగ్ దుర్మరణం పాలవగా...తండ్రి వీనైసింగ్ తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. కాగా వీరూ సింగ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని గోషామహల్ కార్పొరేటర్ లాల్‌సింగ్ డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కరోనా సీజన్లోనూ ఐపీఎల్ బెట్టింగ్‌లు జోరుగానే కొనసాగుతున్నాయి. బెట్టింగ్‌లకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేయడం లేదు. తాజాగా హైదరాబాద్ దూల్‌పేట్‌కు చెందిన శివశంకర్ సింగ్ అనే వ్యక్తి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా శివశంకర్ వద్ద నుంచి రూ. 56వేల నగదు, సెల్ ఫోన్, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : ఐపీఎల్ బెట్టింగ్: రూ.16 కోట్లు స్వాధీనం) -
పతంగ్ మేడిన్ ధూల్‌పేట్
-
ధూల్‌పేట్‌లో కుస్తీ పోటీల ధమాకా !
-
ధూల్‌పేట్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని ధూల్‌పేట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శనివారం తెల్లవారుజామున నుంచి ధూల్‌పేట్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. -
భారీగా గంజాయి స్వాధీనం
అబిడ్స్: ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శివలాల్‌నగర్‌లో ఒక గోడౌన్లో గంజాయి ఉందన్న సమాచారంతో ధూల్‌పేట్ ఏఈఎస్ జ్వాలారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడులు చేపట్టారు. ఈ దాడులలో 48 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని సరస్వతిభాయి, కాలూసింగ్లను అరెస్టు చేసినట్లు ఏఈఎస్ జ్వాలారెడ్డి తెలిపారు. నిందితులు వైజాగ్, వరంగల్ల నుంచి గంజాయిని తీసుకువచ్చినట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. -
పతంగులకు కేరాఫ్ అడ్రస్ ధూల్ ఫేట్
-
ధూల్‌పేటకు చవితి కళ
- ఊపందుకున్న వినాయక - విగ్రహాల విక్రయాలు - ఈసారి షోలాపూర్ నుంచి దిగుమతి - స్వల్పంగా పెరిగిన ధరలు జియాగూడ: వినాయక చవితి దగ్గర పడుతుండడంతో నగరంలో వినాయక విగ్రహాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ధూల్‌పేటలో తయారయ్యే విగ్రహాలను రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు తరలిస్తుంటారు. గత వారం రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. నగరంలోనే గాక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మండపాల నిర్వాహకులు ధూల్‌పేట నుంచే విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో ధూల్‌పేట రహదారులు కొనుగోలుదారులతో రద్దీగా మారుతున్నాయి. ఇళ్లలో మహిళలు తయారు చేస్తున్న గణనాథులు సైతం పండుగ రెండు రోజుల ముందుగానే పలు కూడళ్లలో అమ్మకానికి ఉంచారు. పెద్ద విగ్రహాలను ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. తయారీ దారులు విగ్రహాలను గాంధీపుత్ల నుంచి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ వరకు, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్, ఉస్మానియా వెనుక వైపు, ముస్లింజంగ్ పూల్, సీతారాంబాగ్, అప్పర్ ధూల్‌పేట, గంగాబౌలి తదితర ప్రధాన రహదారులకు ఇరుపక్కలా విక్రయాలకు ఉంచారు. ఈ ఏడాది గతం క ంటే అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అగ్రస్థానం ధూల్పేటదే.. ప్రస్తుతం నగరంలో పలు చోట్ల గణనాథుల విగ్రహాలు తయారు చేస్తున్నా ఎక్కువ శాతం ధూల్‌పేటలోనే తయారవడం విశేషం. క్కడ కళాకారుల చేతిలో ప్రాణం పోసుకున్న విగ్రహాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తరలిస్తుంటారు. అంతే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం ప్రాంతాలకు సైతం ఇక్కడి నుంచే తరలించడం విశేషం. బహు రూపాల్లో లభ్యం.. ఇక్కడి కళాకారులు విఘ్నేశ్వరుడిని ఎన్నో రూపాల్లో తీర్చి దిద్దుతున్నారు. ముఖ్యంగా దత్తాత్రేయ, శివపార్వతుల మధ్య విఘ్నేశ్వరుడు, హరిహరుడు, సాగర మథనం, డ్రాగన్ చైనా గణేష్, గంగా జమున, ప్రపంచ పటంలో విఘ్నేశ్వరుడు తదితర ఎన్నో రూపాల్లో విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఇతర ప్రాంతాల్లో విక్రయించే విగ్రహాల ధరలతో పోలిస్తే ధూల్‌పేట విగ్ర హాలు తక్కువకే లభిస్తాయి. అయితే, గతేడాది కంటే ఈసారి విగ్రహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. విగ్రహాన్ని బట్టి రూ.500 నుంచి 1.50 లక్షల వరకు ఉన్నాయి. ముడి సరుల ధరలు పెరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తయారీ దారులు చెబుతున్నారు. షోలాపూర్ విగ్రహాల దిగుమతి.. అన్ని ప్రాంతాలకు వినాయక విగ్రహాలను ధూల్‌పేటలో తయారు చేసి ఎగుమతి చేస్తుంటే ఈసారి షోలాపూర్ నుంచి ఇళ్లలో నెలకొల్పే గణనాథులు దిగుమతి అవుతున్నాయి. ఈ విగ్రహాల తయారీలో ప్లాస్టర్, మట్టితో చేయడంతో పాటు రంగులతో సుందరంగా తీర్చి దిద్దుతుండడంతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. వీటి ధరలు రూ.20 నుంచి రూ.800 వరకు ఉన్నాయి. -
‘కష్టించి పనిచేసేవారికే సముచిత స్థానం’
హైదరాబాద్: కష్టించి పనిచేసే వారికి బీజేపీలో సముచిత స్థానం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో క్రమ శిక్షణ గల కార్యకర్తగా మెలిగేవారికి ఉజ్వల భవిష్యత్‌ఉంటుందన్నారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కిషన్‌రెడ్డితోపాటు గోషామహాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథలను బుధవారం రాత్రి దూల్పేట్ గంగాబౌలిలో లోథ క్షత్రియ సదర్ పంచాయతీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డిమాట్లాడుతూ లోథ్ కులస్తుల త్యాగాలు ఎంతో అమోఘమన్నారు. రాజాసింగ్‌లోథను గెలిపించడంతో లోథ కులస్తుల పాత్ర మరువలేనిదన్నారు. మంగళ్‌హాట్, ధూల్‌పేట్ డివిజన్లలో ఉన్న వేలాది మంది లోథ కులస్తులు ఏకమై రాజాసింగ్ లోథ గెలుపుకు కారకులయ్యారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఆయన అభివృద్దిని విస్మరించినందునే సమస్యలు నియోజకవర్గంలో పేరుకు పోయాయన్నారు. అంచలంచెలుగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతానన్నారు. అత్యధిక మెజార్టీతో తనను గెలిపించిన గోషామహాల్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు సేవలందిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి రుణాన్ని తీర్చుకుంటానన్నారు. అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని రాజాసింగ్‌లోథ పేర్కొన్నారు. -
మోడీతో దేశం అగ్రగామీ: రాజాసింగ్
హైదరాబాద్: నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధాని కావడంతో దేశం ప్రపంచలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకుంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ పేర్కొన్నారు. సోమవారం నరేంద్రమోడీ ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి ఆయన నగరం నుంచి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. అంతకుముందు ధూల్‌పేట్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రధాని కావడం దేశ ప్రజల అదృష్టమని అన్నారు. కొన్ని రోజుల్లోనే భారతదేశం ఆర్థిక రంగాల్లో అమెరికాను మించిపోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల్లో లక్షల కోట్ల కుంభకోణాలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. దేశ అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్‌ను ప్రజలు ఛీకొట్టారని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే పదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలు ఎప్పుడూ జరగలేదన్నారు. లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ మంత్రులు, నాయకులను దేశ బహిష్కరణ చేయాలని రాజాసింగ్‌లోథ డిమాండ్ చేశారు. ప్రజలంతా బీజేపీవైపే మొగ్గుచూపుతున్నారని ఆయన అన్నారు. -
‘గణేష్’ విక్రయాలకు ‘సమైక్య’ సెగ
జియాగూడ, న్యూస్‌లైన్: వినాయక విగ్రహాల విక్రయాలకూ సమైక్య సెగ తగిలింది. ఫలితంగా ధూల్‌పేట్‌లో ఈ ఏడాది దాదాపు రెండు వేల గణేష్ విగ్రహాలు అమ్ముడుకాక మిగిలిపోయాయి. ప్రతి సంవత్సరం ధూల్‌పేట్‌లో కళాకారులు 25 వేల నుంచి 30 వేల విగ్రహాలను తయారు చేస్తారు. ఈ విగ్రహాలు నగరంతోపాటు రాష్ర్టంలోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖపట్నం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు తదితర జిల్లాల వాసులు కొనుగోలు చేసి తీసుకువెళ్తారు. కాగా ఈ సంవత్సరం గత 40 రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమం ధూల్‌పేట్ కళాకారులను నిరాశకు గురిచేసింది. పలు జిల్లాల వాసులు ఇక్కడి కళాకారులకు రెండు, మూడు నెలల ముందు గణేష్ విగ్రహాల కోసం అడ్వాన్స్‌లు ఇచ్చినా.. సమైక్య ఉద్యమంతోపాటు బంద్, ఇతర ఆందోళనల కారణంగా వాటిని తీసుకెళ్లలేదు. దాంతో దాదాపు 2వేల విగ్రహలు అలాగే మిగిలిపోయాయి. కళాకారులకు సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లింది.