భారీగా గంజాయి స్వాధీనం | Huge Cannabis surrendered in hyderabad dhoolpet | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి స్వాధీనం

Published Wed, Jan 20 2016 7:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Huge Cannabis surrendered in hyderabad dhoolpet

అబిడ్స్: ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శివలాల్‌నగర్‌లో ఒక గోడౌన్‌లో గంజాయి ఉందన్న సమాచారంతో ధూల్‌పేట్ ఏఈఎస్ జ్వాలారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడులు చేపట్టారు.

ఈ దాడులలో 48 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని సరస్వతిభాయి, కాలూసింగ్‌లను అరెస్టు చేసినట్లు ఏఈఎస్ జ్వాలారెడ్డి తెలిపారు. నిందితులు వైజాగ్, వరంగల్‌ల నుంచి గంజాయిని తీసుకువచ్చినట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుందని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement