huge Cannabis
-
50 కిలోల గంజాయి స్వాధీనం
అనంతగిరి: విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. జి.మాడుగుల నుంచి సఫారీ వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా అనంతగిరి వద్ద ఎస్ఐ దామోదర్‌నాయుడు సిబ్బందితో కలసి దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనంతో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
భారీగా గంజాయి స్వాధీనం
చింతూరు: తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా సీలేరు నుంచి ఖమ్మం జిల్లా కొత్తగూడెంనకు డీసీఎం వాహనంలో తరలిస్తున్న గంజాయిని చింతూరు గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.46 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, డీసీఎంను సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
అబిడ్స్: ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శివలాల్‌నగర్‌లో ఒక గోడౌన్లో గంజాయి ఉందన్న సమాచారంతో ధూల్‌పేట్ ఏఈఎస్ జ్వాలారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడులు చేపట్టారు. ఈ దాడులలో 48 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని సరస్వతిభాయి, కాలూసింగ్లను అరెస్టు చేసినట్లు ఏఈఎస్ జ్వాలారెడ్డి తెలిపారు. నిందితులు వైజాగ్, వరంగల్ల నుంచి గంజాయిని తీసుకువచ్చినట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. -
భారీగా గంజాయి స్వాధీనం
రాజవొమ్మంగి: తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రాజవొమ్మంగి మండలం జమ్మిచావిడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. జడ్డంగి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయితో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువు సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.