అనంతగిరి: విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. జి.మాడుగుల నుంచి సఫారీ వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా అనంతగిరి వద్ద ఎస్‌ఐ దామోదర్‌నాయుడు సిబ్బందితో కలసి దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనంతో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.