‘కష్టించి పనిచేసేవారికే సముచిత స్థానం’ | Hard workers get suitable positions in bjp, says G. Kishan Reddy | Sakshi
Sakshi News home page

‘కష్టించి పనిచేసేవారికే సముచిత స్థానం’

Published Thu, May 29 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

‘కష్టించి పనిచేసేవారికే సముచిత స్థానం’

‘కష్టించి పనిచేసేవారికే సముచిత స్థానం’

హైదరాబాద్: కష్టించి పనిచేసే వారికి బీజేపీలో సముచిత స్థానం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో క్రమ శిక్షణ గల కార్యకర్తగా మెలిగేవారికి ఉజ్వల భవిష్యత్‌ఉంటుందన్నారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కిషన్‌రెడ్డితోపాటు గోషామహాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథలను బుధవారం రాత్రి దూల్‌పేట్ గంగాబౌలిలో లోథ క్షత్రియ సదర్ పంచాయతీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డిమాట్లాడుతూ లోథ్ కులస్తుల త్యాగాలు ఎంతో అమోఘమన్నారు. రాజాసింగ్‌లోథను గెలిపించడంతో లోథ కులస్తుల పాత్ర మరువలేనిదన్నారు. మంగళ్‌హాట్, ధూల్‌పేట్ డివిజన్లలో ఉన్న వేలాది మంది లోథ కులస్తులు ఏకమై రాజాసింగ్ లోథ గెలుపుకు కారకులయ్యారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

ఆయన అభివృద్దిని విస్మరించినందునే సమస్యలు నియోజకవర్గంలో పేరుకు పోయాయన్నారు. అంచలంచెలుగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతానన్నారు. అత్యధిక మెజార్టీతో తనను గెలిపించిన గోషామహాల్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు సేవలందిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి రుణాన్ని తీర్చుకుంటానన్నారు. అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని రాజాసింగ్‌లోథ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement