మోడీతో దేశం అగ్రగామీ: రాజాసింగ్ | India top under narendra modi leadership, raja singh lodha | Sakshi
Sakshi News home page

మోడీతో దేశం అగ్రగామీ: రాజాసింగ్

Published Mon, May 26 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

మోడీతో దేశం అగ్రగామీ: రాజాసింగ్

మోడీతో దేశం అగ్రగామీ: రాజాసింగ్

హైదరాబాద్: నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధాని కావడంతో దేశం ప్రపంచలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకుంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ పేర్కొన్నారు. సోమవారం నరేంద్రమోడీ ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి ఆయన నగరం నుంచి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. అంతకుముందు ధూల్‌పేట్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రధాని కావడం దేశ ప్రజల అదృష్టమని అన్నారు. కొన్ని రోజుల్లోనే భారతదేశం ఆర్థిక రంగాల్లో అమెరికాను మించిపోతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల్లో లక్షల కోట్ల కుంభకోణాలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. దేశ అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్‌ను ప్రజలు ఛీకొట్టారని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే పదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలు ఎప్పుడూ జరగలేదన్నారు. లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ మంత్రులు, నాయకులను దేశ బహిష్కరణ చేయాలని రాజాసింగ్‌లోథ డిమాండ్ చేశారు. ప్రజలంతా బీజేపీవైపే మొగ్గుచూపుతున్నారని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement