
నిర్మల్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై జిల్లాలో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ రాజాసింగ్‌తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పైనా కేసు నమోదు చేశారు ఖానాపూర్ పోలీసులు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ తరఫున రాజాసింగ్, పాయల్ శంకర్‌లు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే సమయం ముగిసినా కూడా ప్రచారం చేశారనే వీళ్లపై ఖానాపూర్ పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment