సాక్షి, హైదరాబాద్: బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే అలకబూనినట్లు ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న విజయ సంకల్ప యాత్ర రథాలకు భాగ్యలక్ష్మి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి హాజరుకాని రాజాసింగ్.. నేడు భువనగిరి సభకు కూడా రాలేదు.
బీజేఎల్పీ టీంలోనూ రాజాసింగ్‌కు అవకాశం దక్కలేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయినట్లు సమాచారం. దీంతో పార్టీకి, రాజాసింగ్‌కి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కాగా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటూ ఇటీవల రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే .
గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్‌పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: ‘బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి’
Comments
Please login to add a commentAdd a comment