సినిమా థియేటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు | penalty on cinima theater | Sakshi
Sakshi News home page

సినిమా థియేటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు

Published Thu, Jan 11 2018 1:28 PM | Last Updated on Thu, Jan 11 2018 1:52 PM

penalty on cinima theater - Sakshi

సాక్షి, కరీనంగర్‌ :  పట్టణంలోని శివ థియేటర్‌పై టాస్క్‌పోర్స్‌ పోలీసులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించనందుకు థియేటర్‌ యాజమాన్యంపై భారీగా జరిమానా విధించారు. క్యాంటిన్‌లో ఎమ్మార్పీ రేట్ల కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని గమనించారు. 18 రూపాయలకు విక్రయించాల్సిన కూల్‌డ్రింక్‌ ధర రూ.30 కి, రూ.15 కు అమ్మాల్సిన స్నాక్స్‌ రూ.25కు, 10 రూపాయల పాప్‌కార్న్ 30 రూపాయలకు విక్రయిస్తున్నారు.

అలాగే అన్ని ఆహార పదార్థాల ధరలు దాదాపు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. పైగా ఆహార పదార్థాల నాణ్యత నాసిరకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనివాసరావు, మాధవి, డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రోలజీ ఆఫీసర్ రత్నప్రభ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రనాథ్, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కొండల్ రెడ్డి, మున్సిపల్  శానిటరీ  ఇన్‌స్పెక్టర్  శ్రీనివాస్, ఎస్సై నాగరాజు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement