cinima halls
-
కెనడా హిందీ సినిమా హాళ్లలో కలకలం
టొరంటో: కెనడాలోని గ్రేటర్ టొరంటో ప్రాంతంలో హిందీ సినిమాలను ప్రదర్శించే మూడు వేర్వేరు సినిమా హాళ్లలో కలకలం రేగింది. మాస్క్ ధరించిన వ్యక్తులు గుర్తు తెలియని రసాయనాన్ని స్ప్రే చేయడంతో ప్రేక్షకులు అసౌకర్యానికి గురయ్యారు. యార్క్‌లోని వౌఘన్ సినిమా కాంప్లెక్స్‌లో మంగళవారం రాత్రి 9.20 గంటల సమయంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆ సమయంలో థియేటర్లో 200 మంది ఉన్నారు. స్ప్రే కారణంగా ప్రేక్షకుల్లో కొందరు దగ్గడం ప్రారంభించారు. శ్వాసలో ఇబ్బందికి గురయ్యారు. పోలీసులొచ్చేసరికే అనుమానితులు పరారయ్యారు. కొందరు బాధితులకు పోలీసులు చికిత్స చేయించారు. ఈ వారంలోనే ఇలాంటి ఘటనలే జరిగినట్లు పీల్, టొరంటోల్లోనూ జరిగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. స్కార్బరో టౌన్ సెంటర్లోని థియేటర్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దుర్వాసన వెదజల్లే బాంబును అమర్చినట్లు తమకు ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. విద్వేషపూరిత నేరం సహా పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. -
దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి?
‘ఈమధ్య మీరు ఏ సినిమా చూశారు?’ ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరి దగ్గరా సమాధానం ఉంటుంది. ఇందులో తేడా ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. మరికొందరు తమ జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకోవడానికి పాత సినిమాల గురించి ప్రస్తావిస్తారు. మొత్తం మీద దీనికి మంచి సమాధానమే దొరుకుతుంది. అయితే ఇదే సమయంలో దేశంలోనే మొదటి సినిమా థియేటర్ గురించిన వివరాలు తెలిస్తే ఎవరైనా కాసేపు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం భారతదేశంలోని మొట్టమొదటి సినిమా థియేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో నిర్మితమైన మొదటి సినిమా థియేటర్ చాప్లిన్ సినిమా. దీనిని ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ‘చాప్లిన్ సినిమా’ను 1907లో జమ్షెడ్జీ రామ్‌జీ మదన్ నిర్మించారు. ఆయన మదన్ థియేటర్స్ పేరుతో భారతదేశంలో మొదటి థియేటర్ చైన్ స్థాపించారు. ‘చాప్లిన్ సినిమా’.. 5/1, చౌరింగ్గీ ప్లేస్, కోల్‌కతా చిరునామాలో ఉండేది. జమ్షెడ్జీ రామ్‌జీ మదన్‌ను భారతదేశంలో చిత్ర నిర్మాణ పితామహునిగా పిలుస్తారు. మదన్ ఎల్ఫిన్‌స్టోన్ డ్రామా క్లబ్లో అసిస్టెంట్ బాయ్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఈ క్లబ్ ఎంతో విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు సాగించింది. జమ్షెడ్జీ కలకత్తాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ప్రసిద్ధ నాటక థియేటర్ అయిన కొరింథియన్ హాల్‌ను కొనుగోలు చేశారు. 1902లో మైదాన్ చుట్టూ బయోస్కోప్ షోలను ఏర్పాటు చేశారు. చివరికి అతని ఆసక్తి సినిమా ప్రదర్శన వైపు మళ్లింది. 1907లో ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌ను ప్రారంభించారు. ఈ ప్యాలెస్‌కు తరువాతి కాలంలో మినర్వా అనే పేరు పెట్టారు ఇది హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించే ప్రసిద్ధ థియేటర్‌గా మారింది. థియేటర్ లాభాలను కాపాడుకునే ప్రయత్నంలో దీనిని చార్లీ చాప్లిన్ పేరు మీద ‘చాప్లిన్ సినిమా’ అనే పేరు పెట్టారు. అయితే ఈ థియేటర్‌ను పలు కారణాలతో 2003లో కూల్చివేశారు. ఇది కూడా చదవండి: ఫ్రాన్స్‌లో నల్లుల నకరాలు.. జనం పరేషాన్! -
ఇలా అయితే థియేటర్లో సినిమాలు చూసినట్లే?, వైరల్‌గా మారిన పాప్‌కార్న్ బిల్
మనలో చాలా మందికి సినిమా థియేటర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సినిమాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటాం. కానీ మహమ్మారి రాకతో సినిమా థియేటర్లలో సందడి తగ్గింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ల హవా పెరిగింది. కోవిడ్‌కు ముందు తమకు నచ్చిన అభిమాన హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసిన సినీ లవర్స్ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఓటీటీల్లో కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకు ప్రధాన కారణం థియేటర్లో సినిమా చూడడం ఖర్చుతో కూడుకుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు సినిమా టిక్కెట్ల కోసం ఖర్చుతో పాటు స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలతో సినీ ప్రేక్షకుల జేబుకు చిల్లు పడుతుందని వాపోయాడు ఓ నెటిజన్. ఓ థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లిన తనకు పాప్ కార్న్ బిల్లు చూసి కళ్లు బైర్లు కమ్మాయంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. Rs 460 for 55gm of cheese popcorn, Rs 360 for 600ml of Pepsi. Total Rs 820 at @_PVRCinemas Noida. That’s almost equal to annual subscription of @PrimeVideoIN. No wonder people don’t go to cinemas anymore. Movie watching with family has just become unaffordable. pic.twitter.com/vSwyYlKEsK — Tridip K Mandal (@tridipkmandal) July 1, 2023 ఇటీవల ట్విటర్ యూజర్ త్రిదీప్ కె మండల్ నోయిడాలోని పీవీఆర్ సినిమాస్‌లో సినిమా చూశాడు. అందుకు అతనికైన ఖర్చు అక్షరాల రూ.820. సినిమా టికెట్ ధర వేరే ఉంది. పాప్‌కార్న్ ధర రూ.460, కూల్‌డ్రింక్‌కి రూ. 360కి చెల్లించాల్సి వస్తుందంటూ ఆ బిల్లును ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు, ఒక్క సినిమా కోసం నేను ఖర్చు చేసిన మొత్తం ధరతో ఏడాది పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లో కావాల్సినన్ని సినిమాల్ని చూడొచ్చు. అందుకే ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు ఇష్ట పడడం లేదు అని ట్వీట్లో పేర్కొన్నాడు. ఆ ట్వీట్‌ను 1.2 మిలియన్లకు పైగా వీక్షించగా, 17.8k లైక్ కొట్టారు. తినడానికి కాదుగా దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సినిమా థియేటర్లలో అధిక ధరల్ని ఎలా భరించగలం? సినీ లవర్స్ థియేటర్లకు వెళ్లకుండా మానుకోవడంలో ఆశ్చర్యం లేదని ఓ నెటిజన్ చేయగా.. పాప్‌కార్న్ డబ్బుల్ని ఆదా చేసుకోండి. ఇంటికెళ్లి భోజనం చేయండి అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. థియేటర్‌కు వెళ్లి సినిమా మాత్రమే చూడండి. తినడం కోసం మాత్రం వెళ్లొద్దంటూ సలహా ఇస్తున్నారు. మొత్తానికి ఇప్పుడీ ఈ అంశం నెట్టింట్లో వైరల్‌గా మారింది. Ghar se khaana kha ke niklo sabhi — dr_vee (@dr_vee95) July 2, 2023 50 స్క్రీన్లను మూసేస్తున్న మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్కు నష్టాలు వెంటాడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 333 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 105 కోట్లకుపైగా నష్టం నమోదైంది. దీంతో వరుస నష్టాల నుంచి బయటపడేందుకు మల్టీప్లెక్స్ చైన్ కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పీవీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఎవరీ లలితాజీ.. సర్ఫ్ ఎక్సెల్ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు? -
కరోనా కట్టడి.. ఏపీ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: కరోనా తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిమ్‌లు, స్టేడియాలు, స్విమ్మింగ్‌పూల్స్ మూసివేయమని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక ఇక మీదట ఏ వేడుకకైనా 50 మందికి మాత్రమే అనుమతి అని ఏపీ వైద్యశాఖ స్పష్టం చేసింది. 50 శాతం పరిమితితోనే ప్రజారవాణాకు అనుమతిస్తామని.. సినిమా థియేటర్లలో 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి అని తెలిపింది. అలానే ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌తో ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది. కోవిడ్ చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను సమకూరుస్తున్నాం.. రెమిడెసివిర్ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నది. రెమిడెసివిర్ కొరత ఉంటే హెల్ఫ్‌లైన్ నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. మెడికల్ ఆక్సిజన్ వినియోగాన్ని పర్యవేక్షిస్తున్నామని.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య శాఖ తెలిపింది. చదవండి: ఏపీ: పేదలకు 10 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చిరంజీవి
సాక్షి, అమరావతి: కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లకు సంబంధించి విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఫిక్స్డ్ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు భారీ ఊరట లభించనుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అక్కినేనితో పాటు పలువును సినీ ప్రముఖులు కృతజ్ఞతులు తెలిపారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చిరు, నాగ్ విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆదుకున్నారని ప్రశంసించారు. సీఎం జగన్ సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. My hearty thanks to Hon'ble CM Shri. @ysjagan for the much deserved relief measures for the Film Industry during Covid times. Your sympathetic support will help several thousands of families dependent on this industry. — Chiranjeevi Konidela (@KChiruTweets) April 6, 2021 అలాగానే బుధవారం నాగార్జున అక్కినేని కూడా ట్విటర్ వేదికగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ‘మహమ్మారి వంటి విపత్కర సమయంలో సినిమా హాల్ల విద్యుత్ చార్జీలకు రాయితీ ఇచ్చి అవసరమైన సమయంలో అదుకుని భారీ ఊరటనిచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు. Thanking the Hon’ble chief minister of Andhra Pradesh Shri @ysjagan for the much needed relief measures given to the film Industry During these dark times of Covid🙏 — Nagarjuna Akkineni (@iamnagarjuna) April 7, 2021 చదవండి: సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు -
తెరుచుకోని సినిమా హాళ్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ లాక్‌డౌన్‌తో మూతపడ్డ సినిమా థియేటర్లను ఈనెల 15 నుంచి పలు నిబంధనలతో తెరుచుకోవచ్చని కేంద్రం ఆదేశాలు ఇచ్చినా, రాష్ట్రంలో మాత్రం తెరుచుకోలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. దీనికి తోడు తమ సమస్యలు తీర్చాకే థియేటర్లు ఓపెన్ చేయాలని సినీ ఎగ్జిబిటర్స్ నిర్ణయించారు. ఇందులో లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు వాయిదాతో పాటు థియేటర్ నిర్వహణ చార్జీల పెంపు, సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. ఈ మూడు అంశాలపై స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్లాలని తెలంగాణ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే కర్ణాటక, గుజరాత్, బెంగాల్, యూపీ, బిహార్, ఢిల్లీ తదితర 14 రాష్ట్రాల్లో గురువారం నుంచి థియేటర్లు ప్రారంభించారు. ఈ విషయమై తెలంగాణ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి గోవింద్రాజ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ, వీలైనంత త్వరగా తమ ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
థియేటర్లు తెరిచేందుకు అనుమతివ్వాలి
సాక్షి, హైదరాబాద్: అన్‌లాక్ 5.0లో భాగంగా క్టోబర్ నుంచి సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రంలో థియేటర్ల పునః ప్రారంభంపై చర్చించేందుకు సుదర్శన్ థియేటర్లో సమావేశమయ్యింది. దీనికి తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి, సుదర్శన్ థియేటర్ పార్టనర్ బాల గోవింద్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ‘అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్ల ఒపెన్‌కి కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణా ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని భావిస్తున్నాము. మా ఓనర్స్ అసోసియేషన్ అందరం థియేటర్స్ తెరవాలని నిర్ణయించాం’ అన్నారు. (చదవండి: 75 శాతం సినిమా టికెట్ల అమ్మకానికి ఓకే) అంతేకాక ‘తెలంగాణా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించాలి. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని నమ్మతున్నాం. పార్కింగ్ రుసుము వసూలు చేసుకొనే విధంగా ప్రభుత్వం అనుమతించాలి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ కూడా సినిమా హాళ్లు ఓపెన్ చెయ్యాలి అని చెప్పారు. వారికి మా కృతజ్ఞతలు’ అన్నారు విజయేంద్ర రెడ్డి. అనంతరం బాల గోవింద్ రాజు మాట్లాడుతూ ‘మమ్మల్ని కాపాడగలిగేది స్టేట్ గవర్నమెంట్ మాత్రమే. మాకు కొన్ని రాయితీలు ఇవ్వాలి. పార్కింగ్ విషయంలో, కరెంట్ విషయంలో ప్రభుత్వం మాకు సహకరించాలి’ అని కోరారు. -
అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ: అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా మినహాయింపులు ఇచ్చే అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొంది. సెప్టెంబర్ 30తో అన్‌లాక్ 4.0 గడువు ముగియడంతో మరిన్ని సడలింపులతో తాజా మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో సినిమా థియేటర్లు, మల్లీ ప్లెక్సులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు/మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. క్రీడాకారుల కోసం స్విమ్మింగ్‌పూల్స్‌కు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అంతేగాక, అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. ఆన్లైన్ క్లాసులు కొనసాగించవచ్చని తెలిపింది. ఇక కోచింగ్ సెంటర్లు, కాలేజీలు దశల వారీగా తెరిచే అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఇక కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగనుంది. రాష్ట్రాల మధ్య రాకపోకల్లో ఎలాంటి నిబంధనలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. (చదవండి: ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు) -
75 శాతం సినిమా టికెట్ల అమ్మకానికి ఓకే
బీజింగ్: త్వరలో కోవిడ్-19 ఆంక్షలను సడలించనున్నట్లు చైనా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీనిలో భాగంగా సినిమా థియేటర్లలో 75 శాతం టిక్కెట్లను విక్రయించడానికి అనుమతించింది. ప్రస్తుతం చైనాలో 50 శాతం టిక్కెట్ల అమ్మకానికి అనుమతి ఉంది. ఈ క్రమంలో కొత్త మార్గదర్శకాలను చైనా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొజెక్షన్ అసోసియేషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ నూతన మార్గదర్శకాలు సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ చర్యల వల్ల సినీ పరిశ్రమలోని వారికి ఎంతో మేలు జరగనుంది. గత ఆరు నెలలుగా థియేటర్ల షట్‌డౌన్ కావడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలోనే చైనాలో అనేక బ్లాక్ బాస్టర్ మూవీలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంతేకాక సెలవులు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. సెప్టెంబర్ 25 న చైనాలో మొత్తం 9 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. (చదవండి: ప్రచార యుద్ధంలో చైనా కొత్త తంత్రం) -
నిద్రపోతున్న నిఘా నేత్రం
నిజామాబాద్ నాగారం : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లో నిఘా నేత్రం నిద్రపోతోంది. పేరుకే సీసీ కెమెరాలు పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఏ రోజు కూడా అవి పనిచేసిన దాఖలాలు లేవు. మరోవైపు బస్టాండ్‌లో దొంగలు రాజ్యమేలుతున్నారు. బస్టాండ్‌లో పోలీస్ బూత్ ఉన్నా అక్కడ పోలీసులే కనిపించారు. ఈ బస్టాండ్ ద్వారా ప్రతిరోజు సుమారు 80 వేల నుంచి లక్ష వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. బస్టాండ్‌లో సుమారు 60 పైగా దుకాణాల సముదాయాలు ఉన్నాయి. బస్టాండ్‌లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కొన్ని నెలల క్రితం బస్టాండ్‌లో సుమారు ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు మాత్రమే ఇవి పనిచేశాయి. ఆ తర్వాత మానేశాయి. సీసీ కెమెరాలను మానిటరింగ్ చేసే కంప్యూటర్ సిస్టం సక్రమంగా పని చేయడం లేదు. బస్టాండ్‌లో ఒక పక్క చోరీలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడన్నట్లు వ్యవహరిస్తున్నారని వివర్శలు వస్తున్నాయి. బస్టాండ్‌లోనే కాకుండా ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలోనూ పర్సులు, డబ్బులు, బంగారం చైన్లను దొంగలు కొట్టేస్తున్నారు. రూ. వేలు విలువ చేసే స్మార్ట్ఫోన్లను సైతం మాయం చేస్తున్నారు.బాధిత ప్రయాణికులు లబోదిబో మంటూ బస్టాండ్‌లో õఉన్న పోలీస్‌బూత్ దగ్గరకు వెళ్తే అక్కడ ఎవరూ ఉండటం లేదు. దీంతో బస్‌స్టేషన్‌మాష్టార్ కార్యాలయంలోకి వెళ్తే తమకేమీ తెలియని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని ఉచిత సలహా ఇస్తున్నారు. రక్షణ లేకుండా పోయింది బస్టాండ్‌లో వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు ప్రయాణికుల భద్రత పట్ల కనీస చర్యలు తీసుకోవడం లేదు. బస్టాండ్‌లో చాలా మంది ప్రయాణికులు చోరీలకు గురవుతూనే ఉన్నారు. మా బంధువులు సైతం బస్టాండ్‌లో ఉండగానే చోరీకి గురయ్యారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. –భోజన్న, ప్రయాణికుడు సెల్‌ఫోన్, పర్సుపోయింది మా స్నేహితులతో కలిసి బస్సుఎక్కుతున్న సమయంలో పర్సు, విలువైన సెల్‌ఫోన్ చోరీకీ గురైంది. ఈ విషయంలో సంబంధిత స్టేషన్ మాష్టార్‌కు చెబితే వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని సలహా ఇచ్చారు. సీసీ కెమెరాలు పనిస్తే చాలా వరకు దొంగతనాలను అరికట్టవచ్చు. –కిషోర్, ప్రయాణికుడు -
థియేటర్ల తీరే వేరు..
మహబూబ్‌నగర్ రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు ముఖ్య పట్టణాల్లోని సినిమా థియేటర్లలో జరుగుతున్న తంతు తెలిసినా అధికారులు ఎందుకో కానీ ఇంతకాలం మామూలుగా తీసుకున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చూద్దాం అన్నట్లు వారు వ్యవహరించిన తీరుతో థియేటర్ల బాధ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉల్లాసం, ఉత్సాహం కోసం సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు పార్కింగ్ రుసుము వసూలు చేయడంతో పాటు తినుబండారాలను ధరలు పెంచి మరీ అమ్ముతుండడంతో ప్రేక్షకులు ఆవేదనకు లోనవుతున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ శుక్రవారం అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రంలోని పలు థియేటర్లలో మునిసిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి పార్కింగ్ రుసుము వసూలు చేయొద్దని ఆదేశించడంతో పాటు తినుబండారాల అమ్మకాలను పరిశీలించారు. అయితే, ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీలు చేయడం కాకుండా తరచుగా పరిశీలించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. ఎన్నో నిబంధనలు.. అన్నీ పక్కకే.... సినిమా థియేటర్లలో వాహనాలకు పార్కింగ్ చార్జీ వసూలు చేయొద్దని.. తినుబండారాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించడమే కాకుండా మలమూత్ర విసర్జన శాలలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే, థియేటర్ల బాధ్యులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో ప్రేక్షకులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టింది మొదలు బయటకు వెళ్లే వరకు పలు రకాలుగా దోచుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్కింగ్‌కు చార్జీ వసూలు చేయొద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు పలుమార్లు హెచ్చరికలు చేసినా జిల్లా కేంద్రంలోని థియేటర్లలో మాత్రం పరిస్థితి మారడం లేదు. ఇక తినుబండారాలపై ఎమ్మార్పీ ముద్రించి అదే ధరకు విక్రయించాల్సి ఉండగా తమకు ఇష్టమైన ధరలు నిర్ణయించి దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు ఇంతకాలం పట్టించుకోలేదు. రెండు శాఖల సంయుక్త ఆధ్వర్యాన.. మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ సురేందర్ సంయుక్త ఆధ్వర్యాన తమ సిబ్బందితో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు సినిమా థియేటర్లలో తనిఖీలు చేశారు. తినుబండారాలకు అధిక ధరలు తీసుకోవడం, పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించి యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియమ, నిబంధనలను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశం మాట్లాడుతూ సినిమా థియేటర్ల యజమానులు పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. పార్కింగ్ చార్జీలు వసూలు చేయొద్దని, తినుబండారాలు ఎమ్మార్పీకే విక్రయించాలే తప్ప అధిక ధరలు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో గిర్దావర్ క్రాంతికుమార్‌గౌడ్, ఏసీపీ విద్యాసాగర్, పీపీఓ ప్రతాప్ తదితరులు ఉన్నారు. పార్కింగ్ రుసుము వసూలు చేయొద్దు : జేసీ మహబూబ్‌నగర్ న్యూటౌన్: సినిమా హాళ్లు, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ రుసుము వసూలు చేయొద్దని జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శుక్రవారం రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాణిజ్య సంస్థలు, సినిమాహాళ్ల యాజమాన్యం నడుచుకుంటున్నాయా, లేదా అని తరచూ తనిఖీ చేయాలని సూచించారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, జడ్చర్ల, భూత్పూర్, కోస్గి ప్రాంతాల్లో ఉన్న సినిమా హాళ్లలో పార్కింగ్ రుసుము తీసుకోకుండా చూడాలన్నారు. అలాగే, థియేటర్లలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒక బోర్డును ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారుల ఫోన్ నెంబర్లు పొందుపర్చేలా సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ క్రాంతి, డీఎస్పీ గిరిబాబు, ఆర్డీఓలు శ్రీనివాస్, శ్రీనివాసులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న జేసీ వెంకట్రావు -
దోపిడీ టాకీస్!
కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్(పేరుమార్చాం) దసరా సెలువులకు కాస్త విశ్రాంతి దొరికిందని శుక్రవారం నగరంలోని ఓ ప్రముఖ సినిమాహాల్కు సినిమా చూసేందుకు వెళ్లాడు. బైక్‌ను పార్కింగ్‌స్థలంలో నిలిపి లోపలికి వెళ్తుండగా.. నిర్వాహకులు అడ్డుకున్నారు. ‘మీ బైక్‌కు పార్కింగ్ రుసుం చెల్లించాలి’ అని రశీదు చించి ఇచ్చారు. ఆశ్చర్యానికి గురైన శ్రీనివాస్ ‘ సుప్రీంకోర్టు పార్కింగ్ రుసుం వసూలు చెయొద్దంది కదా..?’ అని నిలదీశాడు. దానికి ‘ఇక్కడ వసూలు చేస్తాం. మాకు రూల్స్ వర్తించవు.. రుసుం కట్టే వెళ్లండి’ అని సినిమాహాల్ నిర్వాహకులు హుకుం జారీ చేశారు. ససేమీర అన్న శ్రీనివాస్‌పై ఒకింత దాడికి దిగారు. కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని అక్కడి నుంచి వెళ్లాడు. కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని పలు సిని మాహాళ్లలో నిర్వాహకులు ‘అంతా తమ ఇష్టం’గా వ్యవహరిస్తున్నారని సినిమాకు వెళ్లే ప్రేక్షకులు అంటున్నారు. నిత్యం ఉద్యోగ, వ్యాపారాలతో బిజీగా గడిపి... ఖాళీ సమయంలో కాస్త విశ్రాంతి కోసం సినిమా చూసేందుకు హాల్‌కు వెళ్తే.... నిలువుదోపిడీకి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. బైక్‌పై వెళ్తే.. బండి లోపల పెట్టింది మొదలు... క్యాంటీన్లో కూడా అధిక ధరలకు తినుబండారాత విక్రయాలు చేస్తున్నారని, హాల్ ఆవరణలో కనీస భద్రతాచర్యలు కరువయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని నిలదీస్తే... దాడులకు సైతం దిగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు.. సినిమా థియేటర్లలలో పార్కింగ్‌ఫీజు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, అప్పటి నగరపాలక కమిషనర్ శశాంకాలు నగరంలో ఉన్న సినిమాహాళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. దీంతో పాటు ప్రతీ థియేటర్లో నాణ్యమైన మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే థియేటర్లకు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆదేశాలు బేఖాతర్.. ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ నగరంలోని పలు సినిమాహాళ్ల నిర్వాహకులు నిబంధనలను పెడ చెవిన పెడుతున్నారు. అడ్డగోలుగా పార్కింగ్‌ఫీజు వసూలు చేస్తున్నారు. సినిమాకు వచ్చే ప్రేక్షకులకు సరైన వసతులు కల్పించడం లేదు. నాసిరకమైన ఫుడ్ అందుబాటులో ఉంచుతున్నారు. దాన్నీ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో పలు థియేటర్ల క్యాంటీన్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించినా... పద్ధతిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రశ్నిస్తే.. దాడులే.. నగర నడిఒడ్డున ఉన్న ఓ ప్రముఖ వ్యక్తికి చెందిన సినిమాహాల్ నిర్వాహకులు సినిమాకు వచ్చేవారిపట్ల రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఓ తహసీల్దార్ సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లాడు. నిర్వాహకులు పార్కింగ్ ఫీజు అడిగారు. పార్కింగ్ ఫీజు వసూలు చేయెద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసిందని, ఫీజు కట్టనని చెప్పిన పాపానికి అతడిపై దాడికి యత్నించారు. నెట్టివేసి అవమానకరంగా మాట్లాడారు. ఈ విషయమై సదరు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా... వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఓ ఉన్నతాధికారికే న్యాయం జరగలేదంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ థియేటర్లో జరిగే అన్యాయాలను గురించి ప్రశ్నిస్తే... పట్టించునే వారే కరువయ్యారని శుక్రవారం సైతం దాడికి గురైన వ్యక్తి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు సినిమాహళ్లలో నిబంధనలు అతిక్రమించే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. సినిమాకు వచ్చే ప్రేక్షకులను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధితశాఖతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. సినిమాహళ్లలో పార్కింగ్‌ఫీజు విషయంలో నిబంధనల ప్రకారం, భద్రత ప్రమాణాలు పాటించని వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలుకు పూనుకుంటాం.– తుల శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ, కరీంనగర్ -
‘పైసా ఎక్కువ వసూలు చేసినా కేసే’
సాక్షి, హైదరాబాద్ : మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లల్లో ప్యాకేజ్డ్ వస్తువులను ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని తూనికల, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్పి కంటే అధికంగా వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తూనికల కొలతల శాఖ గత నెలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేసింది. ఈ విషయంపై మంగళవారం రోజు పౌరసరఫరాల భవన్లో సినిమాహాల్స్, మల్టీప్లెక్స్ యజమాన్యాలతో అకున్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బహిరంగ మార్కెట్లో ఎంఆర్పీ ప్రకారం ఏవిధంగా అయితే వస్తువులను విక్రయిస్తారో అదే విధంగా సినిమాల హాళ్లు, మల్టిప్లెక్స్‌లలో కూడా విక్రయించాలని ఆదేశించారు. ఎంఆర్పి కంటే ఒక్క పైసా కూడా అధికంగా వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. పైసా అదనంగా వసూలు చేసినా తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి ఖచ్చితంగా బిల్లు ఇవ్వాలని, ఇది ప్రతి మల్టీప్లెక్స్, సినిమా థియేటర్ యజమాన్యాల బాధ్యత అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేది నుంచి కచ్చితంగా ధరలను ముద్రించుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులతో పాటు అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. -
‘తెర’చాటు దోపిడీ
సగటు మానవునికి వినోదం కలిగించేవి సినిమాలే. కానీ అక్కడకు వెళ్లే ప్రేక్షకుడిని యాజమాన్యాలు పీడించేస్తున్నాయి. అడ్డూ అదుపూ లేని ధరలతో నిలువు దోపిడీ చేస్తున్నాయి. నియంత్రణ లేని చర్యలతో దోచుకుంటున్నాయి. ఇదేమని అడిగితే... అది అంతే... చల్... అంటూ కసురుకుంటున్నారు. వీరి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అందుకే థియేటర్ల యజమానుల ఇష్టారాజ్యం నడుస్తోంది... శృంగవరపుకోట: సామాన్యుడు సరదా కోసం సినిమా హాల్‌కు వెళ్తే... అక్కడ లేనిపోని నిబంధనల పేరిట జేబులు ఖాళీ అవుతున్నాయి. రంగుల రంగస్థలంలో ఆనందిద్దామని వెళ్లే వారికి యాజమాన్యాలు ధరాభారంతో దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. అదనపు వసూళ్లతో నిలువునా దోచేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన టికెట్ ధరలతో సతమతమవుతున్న వారికి నెలలో ఒక సినిమా చూసేందుకు ఒక కుటుంబానికి రూ.వెయ్యి ఖర్చవుతోంది. ఇది భరించలేని సగటు మనిషి వినోదానికి దూరమవుతున్నాడు. జిల్లాలో గతంలో 76 థియేటర్లు ఉండగా వీటిలో సగానికిపైగా మూతపడ్డాయి. ప్రస్తుతం బొబ్బిలి నియోజకవర్గంలో 8, ఎస్.కోటలో 5, పార్వతీపురంలో 5, గజపతినగరంలో 3, చీపురుపల్లిలో 3, సాలూరులో 5, నెల్లిమర్లలో 3, విజయనగరం జిల్లా కేంద్రంలో 13 థియేటర్లు నడుస్తున్నాయి. వీటిలో సౌకర్యాలు ఎలా ఉన్నా ధరల బాదుడు మాత్రం తప్పడం లేదు. పార్కింగ్‌కు వద్దన్నా.. వదలట్లేదు.. సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌కు వచ్చే ప్రేక్షకులు, వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూళ్లు చేయకూడదంటూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జిల్లా అధికారులు, మండల స్థాయి రెవెన్యూ అధికారుల వరకూ అందాయి. అయినా థియేటర్ల యజమానులు మాత్రం వదలటం లేదు. టూవీలర్‌కు రూ.10లు, ఆటో, కార్లకు రూ.20లు చొప్పున వసూలు చేస్తున్నారు. తీసుకున్న సొమ్ముకు కనీసం టోకెన్ ఇచ్చే వ్యవస్థ ఎక్కడా లేదు. క్యాంటీన్లలోనూ దోపిడీ... థియేటర్లలో క్యాంటిన్లను కాంట్రాక్టర్లకు లీజుకు ఇస్తున్నారు. క్యాంటిన్ల నిర్వాహకులు నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ ధరలకు తినుబండారాలు, డ్రింక్స్, బిస్కట్స్, ఐస్‌క్రీమ్స్ వంటివి అమ్ముతున్నారు. క్యాంటిన్ల వద్ద ధరల పట్టికలు ఎక్కడా కానరావు. అడిగితే నచ్చితే కొను..లేదందటే బయటికిపో... అంటూ ప్రేక్షకులకు చీదరింపులే ఎదురవుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన రెవెన్యూ, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటూ ఏమీ ఎరగనట్టు నిద్ర నటిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు ఉత్తర్వుల పేరుతో లూఠీ... థియేటర్ల నిర్వహణ పెనుభారం కావటంతో ఉన్న థియేటర్లు కూడా డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోకి పోయాయి. తక్కువ సమయంలో సొమ్ము చేసుకోవాలనే కాంక్షతో కోర్టు ఉత్తర్వులు పేరు చెప్పి టికెట్ల ధరలు అమాంతం పెంచి లూఠీ చేయటంతో సగటు ప్రేక్షకుడు రెండు వారాల వరకూ థియేటర్ల వైపు పోవటం లేదు. ఈ లోగా సినిమా మారిపోయి తమ అభిమాన నటుల చిత్రాలు చూసి ఆనందించే భాగ్యం కూడా సాధారణ ప్రజలకు దక్కటం లేదు. సినిమా పైరసీకి పెరిగిన టికెట్ల ధరలు కూడా కారణమే అని చెబుతున్నారు. నియంత్రణ ఉండాలి.. ఉన్నత వర్గం నుంచి సామాన్యుల వరకూ వినోదం పంచే సాధనం సినిమా. అది అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండాలి. అడ్డగోలు నిబంధనలతో థియేటర్ల ఉనికికి చేటు చేస్తూ, దాన్ని అధిగమించటానికి అధిక వసూళ్లకు పాల్పడటం సరికాదు. సినిమాహాళ్లపై కచ్చితమైన నియంత్రణ ఉండాలి. – సి.హెచ్.పద్మావతి, వైఎస్సార్ సీపీ మహిళా నేత దోపిడీకి అడ్డుకట్ట వేయాలి కోర్టు ఉత్తర్వుల పేరుతో అ«ధిక రేట్లకు టికెట్ల అమ్మకాలు, పార్కింగ్ చార్జీలు, క్యాంటీన్లలో అమ్మకాల పేరుతో జేబులకు చిల్లుపెట్టి సామాన్యుల్ని దోపిడీ చేసే వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలి. సమాజంలో అన్ని వర్గాల వారికి స్వేచ్ఛగా బతికే అవకాశం ఇవ్వాలి. –బుగత అప్పలరాజు, ఎస్.కోట వినోదం సామాన్యుల హక్కు... వినోదం సామాన్యుల హక్కు. సగటు మనిషి సినిమాను చూసే అవకాశం లేకుండా చేయటం నేరం. చట్టాలను సోషల్ మీడియాలో పోస్టు చేసే అధికారులు వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలన్న బాధ్యతను విస్మరించటం సరికాదు. ఉన్న చట్టాలను అమలు చేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ సమన్యాయం జరుగుతుంది. –కె.రామరాజు, న్యాయవాది, ఎస్.కోట -
సినిమా థియేటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు
సాక్షి, కరీనంగర్ : పట్టణంలోని శివ థియేటర్‌పై టాస్క్‌పోర్స్ పోలీసులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించనందుకు థియేటర్ యాజమాన్యంపై భారీగా జరిమానా విధించారు. క్యాంటిన్లో ఎమ్మార్పీ రేట్ల కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని గమనించారు. 18 రూపాయలకు విక్రయించాల్సిన కూల్‌డ్రింక్ ధర రూ.30 కి, రూ.15 కు అమ్మాల్సిన స్నాక్స్ రూ.25కు, 10 రూపాయల పాప్‌కార్న్ 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. అలాగే అన్ని ఆహార పదార్థాల ధరలు దాదాపు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. పైగా ఆహార పదార్థాల నాణ్యత నాసిరకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు, మాధవి, డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రోలజీ ఆఫీసర్ రత్నప్రభ, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రనాథ్, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కొండల్ రెడ్డి, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘హాల్’ డేస్
భీమవరం టౌన్: వెెండి తెర కళతప్పింది.. కొత్త సినిమాలకు కూడా ప్రేక్షకులు కరువవుతున్నారు. అన్ని షోలు ఖాళీగానే ఉంటున్నాయి. జనంతో రద్దీగా ఉండే థియేటర్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కనీసం సైకిల్ స్టాండ్ సైకిల్ పెట్టేవారు, క్యాంటీన్లో ఒక్క సమోసా కూడా కొనేవారు కరువయ్యారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం సినిమా థియేటర్లపై తీవ్రంగా పడింది. 15 రోజులుగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను చవిచూస్తున్నాయి. రోజుకు నాలుగు షోలు థియేటర్లలో వేస్తారు. ఇప్పుడు కనీసం రెండు షోలు వెయ్యాలంటే జనం లేక యాజమాన్యాలు దిక్కులు చూస్తున్నారు. భీమవరం పట్టణంలో ఆరు థియేటర్లలలో 12 స్క్రీన్స్ ఉన్నాయి. థియేటర్లలో టిక్కెట్‌కు రూ.100 తెచ్చుకుంటేనే ఇస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్లు మార్చే ఓపిక లేక యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి తోడు జనం కూడా నగదు ససమస్యలతో విలాసాలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండడం, పొదుపును పాటిస్తూ ఆచితూచి ఖర్చుపెట్టడం కూడా ఈ రంగంపై ప్రభావం పడింది. థియేటర్లు జనంతో నిండిని నిండకపోయినా రోజుకు సుమారు రూ.10 నుంచి 15 వేలు నిర్వహణకు వ్యయం చేయాల్సి వస్తోంది. టిక్కెట్‌పై ట్యాక్స్ నిర్ణయం వల్ల జనం లేక పోతే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. కాని నిర్వహణ వ్యయం యాజమాన్యాలకు భారంగా మారింది.