‘హాల్’ డేస్
‘హాల్’ డేస్
Published Tue, Nov 22 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
భీమవరం టౌన్:
వెెండి తెర కళతప్పింది.. కొత్త సినిమాలకు కూడా ప్రేక్షకులు కరువవుతున్నారు. అన్ని షోలు ఖాళీగానే ఉంటున్నాయి. జనంతో రద్దీగా ఉండే థియేటర్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కనీసం సైకిల్ స్టాండ్ సైకిల్ పెట్టేవారు, క్యాంటీన్‌లో ఒక్క సమోసా కూడా కొనేవారు కరువయ్యారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం సినిమా థియేటర్లపై తీవ్రంగా పడింది. 15 రోజులుగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను చవిచూస్తున్నాయి. రోజుకు నాలుగు షోలు థియేటర్లలో వేస్తారు. ఇప్పుడు కనీసం రెండు షోలు వెయ్యాలంటే జనం లేక యాజమాన్యాలు దిక్కులు చూస్తున్నారు. భీమవరం పట్టణంలో ఆరు థియేటర్లలలో 12 స్క్రీన్స్ ఉన్నాయి. థియేటర్లలో టిక్కెట్‌కు రూ.100 తెచ్చుకుంటేనే ఇస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్లు మార్చే ఓపిక లేక యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి తోడు జనం కూడా నగదు ససమస్యలతో విలాసాలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండడం, పొదుపును పాటిస్తూ ఆచితూచి ఖర్చుపెట్టడం కూడా ఈ రంగంపై ప్రభావం పడింది. థియేటర్లు జనంతో నిండిని నిండకపోయినా రోజుకు సుమారు రూ.10 నుంచి 15 వేలు నిర్వహణకు వ్యయం చేయాల్సి వస్తోంది. టిక్కెట్‌పై ట్యాక్స్ నిర్ణయం వల్ల జనం లేక పోతే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. కాని నిర్వహణ వ్యయం యాజమాన్యాలకు భారంగా మారింది.
Advertisement