no audience
-
ప్రేక్షకులు లేకున్నా నిర్వహిస్తాం
లండన్: 2020లో కరోనా వైరస్ తీవ్రత ఉన్నా రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నిర్వహించారు. అయితే వింబుల్డన్ జరపడం మాత్రం సాధ్యం కాలేదు. ఇంగ్లండ్ దేశంలోని పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ఈ టోర్నీని రద్దు చేయాల్సి వచ్చింది. అయితే 2021లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వింబుల్డన్ జరిపి తీరుతామని నిర్వాహకులు ప్రకటించారు. అప్పటి వరకు పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నామని, అవసరమైతే ప్రేక్షకులు లేకుండానైనా జరుపుతామని వెల్లడించారు. ‘2021లో వింబుల్డన్ టోర్నీ నిర్వహించడానికే మా తొలి ప్రాధాన్యత. అందుకోసం ఇప్పటినుంచే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నాం. ఆటగాళ్లు, సిబ్బంది, మా అతిథుల ఆరోగ్య పరిరక్షణ కూడా మా బాధ్యత కాబట్టి దానిపై కూడా దృష్టి పెడతాం. ప్రభుత్వ సహకారంతో ఈ విషయంలో ముందుకు వెళతాం. గ్యాలరీలు పూర్తిగా నిండిపోయే విధంగా అభిమానులను అనుమతిస్తూగానీ, పరిమిత సంఖ్యలో అనుమతిస్తూగానీ లేదంటే పూర్తిగా ప్రేక్షకులు లేకుండా గానీ... ఎలాగైనా వింబుల్డన్ జరగడం మాత్రం ఖాయం’ అని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్యాలీ బోల్టన్ స్పష్టం చేశారు. -
ప్రేక్షకులు ఎక్కడ?
నిండుగా ఉంటేనే థియేటర్స్‌కి అందం. థియేటర్స్ నడిపేవారికి ఆనందం. థియేటర్ గేట్‌కి హౌస్‌ఫుల్ బోర్డ్‌కి మించిన మెడల్ ఏముంటుంది? అయితే కరోనా థియేటర్స్ బిజినెస్‌ను బాగా దెబ్బకొట్టింది. ఏడు నెలలు ఖాళీగా, సందడి లేకుండా ఉండిపోయాయి హాళ్లు. థియేటర్స్ మళ్లీ తెర్చుకోండి, కానీ కొన్ని షరతులు అంది ప్రభుత్వం. 50 శాతం మించి ఆడియన్స్‌కు అనుమతి లేదు. అక్టోబర్ 15న దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. మరి థియేటర్స్‌కి ప్రేక్షకులు వచ్చారా? పరిస్థితి ఏంటి? చూద్దాం. లాక్డౌన్ సమయంలో సినిమా హాళ్లు మూసివేసి ఉన్నప్పుడు, ప్రేక్షకులు వస్తారో రారా అనేది పక్కనపెడితే ముందైతే థియేటర్స్ తెరవాలి, దాన్ని నమ్ముకున్నవాళ్ల పరిస్థితి ఏంటి? అనే వాదనలు వినిపించాయి. జాగ్రత్తలు తీసుకుందాం, జనమే అలవాటు పడతారు అనే ధైర్యం కూడా ఉంది థియేటర్స్ యాజమాన్యంలో. అక్టోబర్ 15నుంచి థియేటర్స్ తెరుచుకోమని, గైడ్‌లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం. 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి ఉండడంతో కొత్త చిత్రాలేవీ రిలీజ్ చేయలేదు. గతంలో విడుదలైన చిత్రాలనే మళ్లీ ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను ప్రారంభించారు. చాలా ప్రాంతాల్లో మునుపటికంటే టికెట్ రేట్ చాలా తగ్గించారు. ప్రేక్షకులను థియేటర్స్‌కి ఆకర్షించే భాగంలో ఇదొకటì . అయితే థియేటర్స్‌కి వస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలా చాలా తక్కువ ఉండటం షాక్‌కి గురి చేస్తోంది. పలు చోట్ల పట్టుమని పదిమంది కూడా కనిపించలేదట. ఢిల్లీలో... ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో కోవిడ్ గైడ్‌లైన్స్‌తో థియేటర్ గేట్లు తెరిచారు. 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్లో 150 వరకు అనుమతిస్తూ, టికెట్ కౌంటర్ వద్ద సిబ్బంది టికెట్లు తెంచడానికి రెడీ అయ్యారు. ఏడు నెలలవుతోంది, టికెట్లు చింపి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినవాళ్లకు చిన్న షాక్ తగిలింది. కేవలం ఐదుగురు మాత్రమే సినిమా చూడటానికి వచ్చారు. ఇంకెవరైనా వస్తారని అరగంట ఆగారు. ఉహూ... వచ్చిన ఆ ఐదుగురికి సినిమా వేశారు. ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే కుతూహలంతోనే వచ్చాను’ అని సమాధానమిచ్చాడో ప్రేక్షకుడు. గురువారం మ్యాట్నీ షో పరిస్థితి ఇది. శుక్రవారం కుటుంబంతో కలసి సినిమా చూడాలని ముందు రోజు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆ థియేటర్‌కి వచ్చిన వ్యక్తి, ‘ఇంకా ఇంట్లోనే ఉంటే మానసికంగా ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందుకే థియేటర్లో సినిమా చూడాలనుకున్నాం’ అనడం విశేషం. వైజాగ్‌లో.. వైజాగ్‌లో వరుణ్ ఐనాక్స్, పూర్ణ అనే థియేటర్‌ను ఓపెన్ చేశారు. ‘అల వైకుంఠపురములో, భీష్మ’ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రేక్షకుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడ కూడా ప్రేక్షకుల సంఖ్య పదికి దాటలేదు. వైజాగ్‌లో రాత్రి 7 గంటల షో ఎప్పుడూ హౌస్‌ఫుల్. అది కూడా ఏడుగురుకంటే ఎక్కువ మంది లేరట. ఇలా షోకి వెయ్యి రూపాయిల వసూళ్లు కూడా రావడంలేదట. ఓ మూడు పాత ఇంగ్లిష్ సినిమాలను రిలీజ్‌కి రెడీ చేసి, ప్రేక్షకులు రాకపోవడంతో షోలు రద్దు కూడా చేశారని సమాచారం. ఖర్చులు కూడా మిగలవు థియేటర్స్‌లో ఒక్క షో వేస్తే... తెగిన టికెట్లు, కరెంటు బిల్లులు, థియేటర్ రెంటు ఇలా ప్రతీది లెక్క కట్టుకుని మిగిలినది లాభం. ఇక వసూళ్లు వెయ్యి రూపాయిలైతే కరెంటు బిల్లు ఖర్చులు కూడా రావు. ఇలా నడపడమెందుకు? అనే ఆలోచన కూడా రాకమానదు. ఈ క్లిష్ట పరిస్థితి గురించి చర్చించడానికి థియేటర్స్ యూనియన్‌కి సంబంధించి త్వరలో ఓ మీటింగ్ జరిగే అవకాశం ఉందని తెలిసింది. పాత సినిమాలు కదా, థియేటర్స్‌కి ఏం వెళ్తాం అని ప్రేక్షకులు భావిస్తున్నారా? కరోనా టైమ్‌లో ఇంటిపట్టున ఉండటం బెటర్ అనుకుంటున్నారా? కొత్త సినిమాలు పడితే థియేటర్స్ వైపు నడుస్తారా? థియేటర్స్‌కు మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడు? ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నలే. -
మాటల్లేవ్... ప్రేక్షకులూ ఉండరు
సియోల్: రెండు నెలల విరామం అనంతరం దక్షిణ కొరియాలో ఆట మొదలుకానుంది. కరోనా నేపథ్యంలో కఠిన నిబంధనల నడుమ శుక్రవారం నుంచి అక్కడ ‘కె–లీగ్ టోర్నీ’తో ఫుట్‌బాల్ సీజన్ ప్రారంభమవనుంది. కోవిడ్–19 సంక్షోభం తర్వాత ఆసియాలో జరుగనున్న తొలి మేజర్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. అయితే ఈ టోర్నీని ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఫుట్‌బాలర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆట సందర్భంగా సహచరులతో మాట్లాడటం, కరచాలనం, గోల్ సంబరాలు చేసుకోవడంపై ఆంక్షలు విధించారు. టోర్నీలో భాగంగా ప్రతీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లతో పాటు సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు. సీజన్ మధ్యలో ఏ ఆటగాడికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే... ఆ ఆటగాడి జట్టుతో పాటు, ఆ జట్టుతో తలపడిన ప్రత్యర్థి జట్లు రెండు వారాల పాటు టోర్నీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. మ్యాచ్‌కు ముం దు కరచాలనానికి బదులుగా శిరస్సు వంచి మర్యాదపూర్వకంగా పలకరించాలని ఆటగాళ్లకు సూచించారు. శుక్రవారం జరుగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జియోన్‌బక్ మోటార్స్‌తో సువెన్ బ్లూవింగ్స్ ఆడతుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ఆడనున్నాయి. మైదానంలో సహచరులతో మాట్లాడకుండా పుట్‌బాల్ ఆడటం అసాధ్యమని ఇంచియోన్ యుౖ¯ð టెడ్ కెప్టెన్ కిమ్ డు–హైక్ వ్యాఖ్యానించాడు. -
ప్రేక్షకులు లేకుండానే గ్రాండ్‌ప్రి ఈవెంట్లు
న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్‌ప్రి (ఐజీపీ) అథ్లెటిక్స్ సిరీస్‌లో భాగంగా జరిగే తొలి రెండు పోటీలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేలా భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) సోమవారం నిర్ణయం తీసుకుంది. మన దేశంలోనూ కోవిడ్–19 తీవ్రమవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎఫ్ఐ తెలిపింది. ఐజీపీ–1 ఈ నెల 20వ తేదీన... ఐజీపీ–2 ఈ నెల 25వ తేదీన పటియాలాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వేదికగా జరగనున్నాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి జరగకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశీయుల ప్రయాణాలపై ఆంక్షలు విధించగా... స్పోర్ట్స్ ఈవెంట్లలో పెద్ద ఎత్తున జనం ఒకేచోట గుమికూడకుండా చర్యలు తీసుకోవాలంటూ అన్ని జాతీయ క్రీడల సమాఖ్యలను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కోరింది. -
‘హాల్’ డేస్
భీమవరం టౌన్: వెెండి తెర కళతప్పింది.. కొత్త సినిమాలకు కూడా ప్రేక్షకులు కరువవుతున్నారు. అన్ని షోలు ఖాళీగానే ఉంటున్నాయి. జనంతో రద్దీగా ఉండే థియేటర్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కనీసం సైకిల్ స్టాండ్ సైకిల్ పెట్టేవారు, క్యాంటీన్లో ఒక్క సమోసా కూడా కొనేవారు కరువయ్యారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం సినిమా థియేటర్లపై తీవ్రంగా పడింది. 15 రోజులుగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను చవిచూస్తున్నాయి. రోజుకు నాలుగు షోలు థియేటర్లలో వేస్తారు. ఇప్పుడు కనీసం రెండు షోలు వెయ్యాలంటే జనం లేక యాజమాన్యాలు దిక్కులు చూస్తున్నారు. భీమవరం పట్టణంలో ఆరు థియేటర్లలలో 12 స్క్రీన్స్ ఉన్నాయి. థియేటర్లలో టిక్కెట్‌కు రూ.100 తెచ్చుకుంటేనే ఇస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్లు మార్చే ఓపిక లేక యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి తోడు జనం కూడా నగదు ససమస్యలతో విలాసాలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండడం, పొదుపును పాటిస్తూ ఆచితూచి ఖర్చుపెట్టడం కూడా ఈ రంగంపై ప్రభావం పడింది. థియేటర్లు జనంతో నిండిని నిండకపోయినా రోజుకు సుమారు రూ.10 నుంచి 15 వేలు నిర్వహణకు వ్యయం చేయాల్సి వస్తోంది. టిక్కెట్‌పై ట్యాక్స్ నిర్ణయం వల్ల జనం లేక పోతే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. కాని నిర్వహణ వ్యయం యాజమాన్యాలకు భారంగా మారింది.