
న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్‌ప్రి (ఐజీపీ) అథ్లెటిక్స్ సిరీస్‌లో భాగంగా జరిగే తొలి రెండు పోటీలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేలా భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) సోమవారం నిర్ణయం తీసుకుంది. మన దేశంలోనూ కోవిడ్–19 తీవ్రమవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎఫ్‌ఐ తెలిపింది. ఐజీపీ–1 ఈ నెల 20వ తేదీన... ఐజీపీ–2 ఈ నెల 25వ తేదీన పటియాలాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వేదికగా జరగనున్నాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి జరగకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశీయుల ప్రయాణాలపై ఆంక్షలు విధించగా... స్పోర్ట్స్ ఈవెంట్‌లలో పెద్ద ఎత్తున జనం ఒకేచోట గుమికూడకుండా చర్యలు తీసుకోవాలంటూ అన్ని జాతీయ క్రీడల సమాఖ్యలను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment