indian athletics
-
Paris Olympics 2024: భారత అథ్లెట్ల పూర్తి జాబితా ఇదే?
ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పారిస్ ఒలింపిక్స్ 2024కు రంగం సిద్దమైంది. మరో 17 రోజుల్లో ఈ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు పారిస్ వేదికగా ఈ విశ్వక్రీడలు జరగనున్నాయి. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 32 క్రీడల్లో 329 ఈవెంట్స్‌ల్లో తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి భారత్ నుంచి ఒలింపిక్స్‌లో పాల్గోనే అథ్లెట్లు సంఖ్య తగ్గింది.గతంలో టోక్యో ఒలింపిక్స్‌కు 124 మంది అథ్లెట్లతో కూడిన అతిపెద్ద బృందాన్ని భారత్ పంపింది. ఈ సారి విశ్వక్రీడల్లో భారత్ నుంచి మొత్తం 113 మంది క్రీడాకారులు సత్తాచాటేందుకు సిద్దమయ్యారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పతాకధారిగా వ్యహరించనుంది.పారిస్ ఒలింపిక్స్ భారత అథ్లెట్ల పూర్తి జాబితాఆర్చరీధీరజ్ బొమ్మదేవర: (పురుషుల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్)తరుణ్ దీప్ రాయ్: పురుషుల జట్టు (పురుషుల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్)ప్రవీణ్ జాదవ్: పురుషుల జట్టు(పురుషుల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్)భజన్ కౌర్: (మహిళల వ్యక్తిగత, ఉమెన్స్ టీమ్ ఈవెంట్)దీపికా కుమారి: (మహిళల వ్యక్తిగత, ఉమెన్స్ టీమ్ ఈవెంట్)అంకితా భకత్: (మహిళల వ్యక్తిగత, ఉమెన్స్ టీమ్ ఈవెంట్)అథ్లెటిక్స్అక్షదీప్ సింగ్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్వికాస్ సింగ్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్పరమ్ జీత్ సింగ్ బిష్త్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ప్రియాంక గోస్వామి: మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్అవినాష్ సాబుల్: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్పారుల్ చౌదరీ: మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్, మహిళల 5000 మీటర్ల స్టీపుల్ ఛేజ్జ్యోతి యర్రాజీ: మహిళల 100 మీటర్ల హర్డిల్స్కిరణ్ పహల్: మహిళల 400 మీటర్ల హర్డిల్స్తజిందర్ పాల్ సింగ్ తూర్: పురుషుల షాట్ పుట్అభా ఖాతువా: పురుషుల షాట్ పుట్నీరజ్ చోప్రా: పురుషుల జావెలిన్ త్రోకిశోర్ జెనా: పురుషుల జావెలిన్ త్రోఅన్నూ రాణి: మహిళల జావెలిన్ త్రోసర్వేష్ కుషారే: పురుషుల హైజంప్ప్రవీణ్ చిత్రవేల్: పురుషుల ట్రిపుల్ జంప్అబ్దుల్లా అబూబకర్: పురుషుల ట్రిపుల్ జంప్మహ్మద్ అనాస్ యాహియా, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సంతోష్ తమిళరసన్, రాజేష్ రమేష్: పురుషుల 4×400 మీటర్ల రిలేమిజో చాకో కురియన్: 4×400 మీటర్ల రిలే, 4×400 మీటర్ల మిక్స్ డ్ రిలేవిద్యా రామరాజ్, జ్యోతిక శ్రీ దండి, ఎంఆర్ పూవమ్మ, సుభా వెంకటేశన్, ప్రాచి: మహిళల 4×400 మీటర్ల రిలేప్రాచి: 4×400 మీటర్ల మిక్స్డ్ రిలేప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వర్: రేస్ వాక్ మిక్స్ డ్ మారథాన్మిజో చాకో కురియన్: 4×400 మీటర్ల రిలే, 4×400 మీటర్ల మిక్స్ డ్ రిలేవిద్యా రామరాజ్, జ్యోతిక శ్రీ దండి, ఎంఆర్ పూవమ్మ, సుభా వెంకటేశన్, ప్రాచి: మహిళల 4×400 మీటర్ల రిలేప్రాచి: 4×400 మీటర్ల మిక్స్డ్ రిలేప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వర్: రేస్ వాక్ మిక్స్ డ్ మారథాన్బ్యాడ్మింటన్హెచ్.ఎస్.ప్రణయ్: పురుషుల సింగిల్స్లక్ష్యసేన్: పురుషుల సింగిల్స్పీవీ సింధు: మహిళల సింగిల్స్సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి: పురుషుల డబుల్స్అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో: మహిళల డబుల్స్బాక్సింగ్నిఖత్ జరీన్: మహిళల 50 కేజీల విభాగంఅమిత్ ఫంగల్ : పురుషుల 51 కేజీల విభాగంనిషాంత్ దేవ్ : పురుషుల 71 కేజీల విభాగం,ప్రీతి పన్వర్ : మహిళల 54 కేజీల విభాగంజాస్మిన్ లంబోరియా: మహిళల 57 కేజీల విభాగంఈక్వెస్ట్రియన్అనూష్ అగర్వాలా: డ్రెస్సేజ్గోల్ఫ్శుభాంకర్ శర్మ: పురుషుల గోల్ఫ్గగన్జీత్ భుల్లర్: పురుషుల గోల్ఫ్అదితి అశోక్: మహిళల గోల్ఫ్దీక్షా డాగర్: మహిళల గోల్ఫ్పురుషుల హాకీ జట్టుపీఆర్ శ్రీజేష్, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోగిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), సుమిత్, సంజయ్, రాజ్‌కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్జూడోతులికా మాన్ : మహిళల 78 కిలోల విభాగంరోయింగ్బాల్రాజ్ పన్వార్ : ఎం1ఎక్స్సెయిలింగ్విష్ణు శరవణన్: పురుషుల వన్ పర్సన్ డింగీనేత్రా కుమనన్: మహిళల వన్ పర్సన్ డింగీషూటింగ్పృథ్వీరాజ్ తొండైమాన్: పురుషుల ట్రాప్రాజేశ్వరి కుమారి: మహిళల ట్రాప్శ్రేయాసి సింగ్: మహిళల ట్రాప్అనంత్ జీత్ సింగ్ నరుకా: పురుషుల స్కీట్రైజా ధిల్లాన్: మహిళల స్కీట్మహేశ్వరి చౌహాన్: మహిళల స్కీట్అనంత్ జీత్ సింగ్ నరుకా/మహేశ్వరి చౌహాన్: స్కీట్ మిక్స్ డ్ టీమ్సందీప్ సింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్అర్జున్ బబుతా: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ఎలవెనిల్ వలరివన్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్రమితా జిందాల్ : మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్స్వప్నిల్ కుసాలే: పురుషుల 50 మీటర్ల రైఫిల్ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్: పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్సిఫ్ట్ కౌర్ సామ్రా: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్అంజుమ్ మౌద్గిల్: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్సందీప్ సింగ్/ఎలవెనిల్ వలరివన్: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్అర్జున్ బాబుటా/రమిత జిందాల్: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్అర్జున్ చీమా: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్సరబ్జోత్ సింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్మను భాకర్: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్రిథమ్ సంగం: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్విజయవీర్ సిద్ధు: పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్అనీష్ భన్వాలా: పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్మను భాకర్: మహిళల 25 మీటర్ల పిస్టల్ఈషా సింగ్: మహిళల 25 మీటర్ల పిస్టల్సరబ్జోత్ సింగ్/మను భాకర్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్అర్జున్ చీమా/రిథమ్ సంగం: 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్స్విమ్మింగ్ధినిధి దేశింగు: మహిళల 200మీ ఫ్రీస్టైల్శ్రీహరి నటరాజ్: పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్టేబుల్ టెన్నిస్శరత్ కమల్: పురుషుల సింగిల్స్ మరియు పురుషుల జట్టుహర్మీత్ దేశాయ్: పురుషుల సింగిల్స్ మరియు పురుషుల జట్టుమానవ్ ఠక్కర్: పురుషుల జట్టుమనిక బాత్రా: మహిళల సింగిల్స్ మరియు మహిళల జట్టుశ్రీజ ఆకుల: మహిళల సింగిల్స్ మరియు మహిళల జట్టుఅర్చన కామత్: మహిళల జట్టుటెన్నిస్సుమిత్ నాగల్: పురుషుల సింగిల్స్రోహన్ బోపన్న మరియు శ్రీరామ్ బాలాజీ: పురుషుల డబుల్స్వెయిట్ లిఫ్టింగ్మీరాబాయి చాను: మహిళల 49 కేజీలురెజ్లింగ్అమన్ సెహ్రావత్: పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలువినేష్ ఫోగట్: మహిళల 50 కేజీలుఅన్షు మాలిక్: మహిళల 57 కేజీలునిషా దహియా: మహిళల 68 కేజీలురీతికా హుడా: మహిళల 76 కేజీలుయాంటిమ్ ఫంఘల్: మహిళల 53 కేజీలు -
Asian Games 2023: పతకాల శతకం
కోరినది నెరవేరింది. అనుకున్నట్టే... ఆశించినట్టే... ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశం పతకాల శతకం పండించింది. చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఏషియన్ గేమ్స్‌లో 655 మంది సభ్యుల భారత బృందం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలు గెలిచింది. మునుపు 2018లో జకార్తా ఏషియన్ గేమ్స్‌లో సాధించిన 70 పతకాల రికార్డును తిరగరాసింది. ఆసియా క్రీడల పతకాల వేటలో మూడంకెల స్కోరుకు మన దేశం చేరడం ఇదే ప్రప్రథమం. శతాధిక పతకాల సాధనలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే చైనా, జపాన్, దక్షిణ కొరియాల సరసన అగ్ర శ్రేణి క్రీడాదేశంగా మనం కూడా స్థానం సంపాదించడం గర్వకారణం. ఈ క్రమంలో అతి సామాన్య స్థాయి నుంచొచ్చి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన మనవాళ్ళ కథలు స్ఫూర్తిదాయకం. ఈ క్రీడోత్సవాల్లో 201 స్వర్ణాలతో సహా మొత్తం 383 పతకాలతో తిరుగులేని ప్రథమ స్థానంలో చైనా నిలిచింది. 188 మెడల్స్‌తో జపాన్, 190తో దక్షిణ కొరియా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా వల్ల ఏడాది ఆలస్యంగా 2021లో జరిగిన టోక్యో–2020 వేసవి ఒలింపిక్స్ లోనూ చైనా, జపాన్‌లు ఇలాగే పతకాల సాధనలో రెండు, మూడు స్థానాల్లోనే ఉన్నాయి. ప్రపంచస్థాయి ఒలింపిక్స్‌లోనే అంతటి విజయాలు నమోదు చేసుకున్న ఆ దేశాలు ఇప్పుడు ఆసియా క్రీడోత్సవాల్లోనూ ఇలా ఆధిక్యం కనబరచడం ఆశ్చర్యమేమీ కాదు. అయితే, ఒలింపిక్స్ పతకాల ర్యాంకింగుల్లో ఆసియా దేశాల కన్నా వెనకాల ఎక్కడో 48వ ర్యాంకులో ఉన్న భారత్, తీరా ఏషియాడ్‌లో మాత్రం వాటన్నిటినీ వెనక్కి నెట్టి, నాలుగో ర్యాంకులోకి రావడం గణనీయమైన సాధన. మొత్తం 107 పతకాల్లో అత్యధిక పతకాలు (6 స్వర్ణాలతో సహా 29) మనకు అథ్లెటిక్స్‌లోనే వచ్చాయి. ఆపైన అత్యధికంగా షూటింగ్లో (22 మెడల్స్), ఆర్చరీలో (9), అలాగే బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, హాకీల్లో మనవాళ్ళు ప్రపంచ శ్రేణి ప్రతిభ కనబరిచారు. హాంగ్జౌలోని ఈ తాజా ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశానికి మరో విశేషం ఉంది. ఈ క్రీడల పోరులో సాంప్రదాయికంగా తనకు బలమున్న హాకీ, రెజ్లింగ్, కబడ్డీ, షూటింగ్ లాంటి వాటిల్లోనే కాదు... అనేక ఇతర అంశాల్లో జమాజెట్టీలైన ఇతర దేశాల జట్లకు ఎదురొడ్డి భారత్ పతకాలు సాధించింది. పట్టున్న హాకీ, కబడ్డీ లాంటి క్రీడల్లో ప్రతిష్ఠ నిలబెట్టుకుంటూనే, ఆటల్లోని ఆసియా అగ్రరాజ్యాలను ఢీ కొని, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ప్రపంచ శ్రేణి ఆటల్లోనూ పతకాలు గెలుచుకుంది. ఇది గమనార్హం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆదివారం ముగిసిన ఈ ఆసియా క్రీడా సంబరంలో మన ఆటగాళ్ళ విజయగీతిక భారత క్రీడారంగంలో అత్యంత కీలక ఘట్టం. కేవలం పతకాల గెలుపు లోనే కాక, క్రీడాజగతిలో మన వర్తమాన, భవిష్యత్ పయనానికీ ఇది స్పష్టమైన సూచిక. క్రీడాంగణంలోనూ మన దేశం వేగంగా దూసుకుపోతూ, రకరకాల ఆటల్లో విశ్వవిజేతల సరసన నిలవాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్న తీరుకు ఇది నిలువుటద్దం. 2018 నాటి ఏషియన్ గేమ్స్‌లో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్ ఇవాళ నాలుగో స్థానానికి ఎగబాకిందంటే, దాని వెనుక ఎందరు క్రీడాకారుల కఠోరశ్రమ, దృఢసంకల్పం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా ప్రాధికార సంస్థలు ఆటలకు అందించిన ప్రోత్సాహమూ మరువలేనిది. ఆతిథ్యదేశమైన చైనా వైఖరి అనేక అంశాల్లో విమర్శల పాలైంది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్ళకు తన వీసా విధానంతో అడ్డం కొట్టి, డ్రాగన్ తన దుర్బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జావెలిన్ త్రో సహా కొన్ని అంశాల్లో చైనా అధికారిక రిఫరీలు భారత ఆటగాళ్ళ అవకాశాల్ని దెబ్బ తీసేలా విచిత్ర నిర్ణయాలు తీసుకోవడమూ వివాదాస్పదమైంది. తొండి ఆటతో బీజింగ్ తన కుత్సితాన్ని బయటపెట్టుకున్నా, స్థానిక ప్రేక్షకులు ఎకసెక్కాలాడుతున్నా భారత ఆటగాళ్ళ బృందం సహనంతో, పట్టుదలతో ఈ విజయాలను మూటగట్టుకు వచ్చింది. ఆ విషయం విస్మరించలేం. అందుకే కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నా, కొందరు క్రీడాతారలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆటతీరులో నిలకడ చూపలేక పోయినా తాజా ఆసియా క్రీడోత్సవాల్లో భారత ప్రదర్శనను అభినందించి తీరాలి. వచ్చే ఏటి ప్యారిస్ ఒలింపిక్స్‌కు దీన్ని ఉత్ప్రేరకంగా చూడాలి. మునుపటితో పోలిస్తే, క్రీడాజగత్తులో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం సంతో షకర పరిణామం. అలాగని సాధించినదానితో సంతృప్తి పడిపోతేనే ఇబ్బంది. ఇప్పటికీ జనాభాలో, అనేక ఇతర రంగాల్లో మనతో పోలిస్తే దిగువనున్న దేశాల కన్నా ఆటల్లో మనం వెనుకబడి ఉన్నాం. అది మర్చిపోరాదు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో పాటు క్రీడావ్యవస్థలోని సవాలక్ష రాజకీయాలు, పెత్తందారీ విధానాలు, క్రీడా సంఘాలను సొంత జాగీర్లుగా మార్చుకున్న నేతలు – గూండాలు మన ఆటకు నేటికీ అవరోధాలు. మహిళా రెజ్లర్లతో దీర్ఘకాలంగా అనుచితంగా వ్యవహరిస్తున్నట్టు అధికార పార్టీ ఎంపీపై అన్ని సాక్ష్యాలూ ఉన్నా ఏమీ చేయని స్వార్థ పాలకుల దేశం మనది. అలాంటి చీకాకులు, చిక్కులు లేకుంటే మన ఆటగాళ్ళు, మరీ ముఖ్యంగా ఇన్ని ఇబ్బందుల్లోనూ పతకాల పంట పండిస్తున్న పడతులు ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో! ఏషియాడ్‌లో మనం గెల్చిన 28 స్వర్ణాల్లో 12 మాత్రమే ఒలింపిక్స్ క్రీడాంశాలనేది గుర్తు చేసుకుంటే చేయాల్సిన కృషి, సాధించాల్సిన పురోగతి అవగతమవుతుంది. మహారాష్ట్రలోని దుర్భిక్ష ప్రాంతంలోని రైతు కొడుకు, ముంబయ్‌లో కూరలమ్మే వాళ్ళ కూతురు లాంటి మన ఏషియాడ్ పతకాల వీరుల విజయగాథలెన్నో ఆ లక్ష్యం దిశగా మనకిప్పుడు ఆశాదీపాలు! -
నీరజ్... నంబర్‌వన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెటిక్స్ ముఖచిత్రంగా మారిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కెరీర్లో మరో గొప్ప ఘనతను సాధించాడు. సోమవారం విడుదల చేసిన వరల్డ్ అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నీరజ్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం నీరజ్ 1455 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 1433 పాయింట్లు) రెండో స్థానంలో, జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 1416 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. గత ఐదేళ్లుగా నీరజ్ అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం... 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం... 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం... 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణం... ఇలా నీరజ్ అంతర్జాతీయ వేదికలపై పతకాల పంట పండిస్తున్నాడు. తాజా సీజన్లో భాగంగా ఈనెలలో దోహాలో జరిగిన డైమండ్ లీగ్ తొలి సిరీస్‌లో నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. తదుపరి వచ్చే నెలలో ఫిన్లాండ్లో జరిగే పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. -
World Athletics Championships 2022: నీ‘రజత’ధీర..!
అమెరికాలో ఆదివారం ఉదయం భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అద్భుతం చేశాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు రజత పతకం అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీజార్జి కాంస్య పతకాన్ని సాధించింది. తాజా ప్రదర్శనతో నీరజ్ ఒలింపిక్స్, ఆసియా చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, దక్షిణాసియా క్రీడలు, డైమండ్ లీగ్ మీట్ తదితర మెగా ఈవెంట్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించాడు. కోట్లాది మంది భారతీయుల అంచనాలను నిజం చేస్తూ... మన అథ్లెట్స్లోనూ ప్రపంచస్థాయి వేదికపై పతకాలు గెలిచే సత్తా ఉందని నిరూపిస్తూ... గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ప్రదర్శనను నమోదు చేస్తూ... అమెరికా గడ్డపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ... భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం ఆవిష్కరించాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలిసారి రజత పతకాన్ని అందించాడు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్య పతకాన్ని సాధించగా... నీరజ్ తాజాగా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అథ్లెట్‌గా ఘనత వహించాడు. యుజీన్ (అమెరికా): సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. 19 ఏళ్ల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మళ్లీ పతకాల బోణీ కొట్టింది. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అందరి అంచనాలకు అనుగుణంగా రాణించి భారత్‌కు రజత పతకం అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) జావెలిన్‌ను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోగా... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) జావెలిన్‌ను 88.09 మీటర్ల దూరం పంపించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ (78.22 మీటర్లు) పదో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా... జావెలిన్ త్రో ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడ్డారు. తొలి మూడు రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశకు చేరగా... మిగతా నలుగురు నిష్క్రమించారు. క్వాలిఫయింగ్‌లో తొలి ప్రయత్నంలోనే అర్హత ప్రమాణాన్ని అందుకున్న 24 ఏళ్ల నీరజ్ చోప్రా ఫైనల్లో మాత్రం తొలి అవకాశంలో ఫౌల్ చేశాడు. అయితే ఆందోళన చెందకుండా నీరజ్ నెమ్మదిగా పుంజుకున్నాడు. రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.39 మీటర్లు... మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరిన నీరజ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక నాలుగో ప్రయత్నంలో నీరజ్ తన శక్తినంతా కూడదీసుకొని జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. నీరజ్ ఐదో, ఆరో ప్రయత్నాలు ఫౌల్ కాగా... 24 ఏళ్ల అండర్సన్ పీటర్స్ చివరిదైన ఆరో ప్రయత్నంలో ఈటెను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. వాద్లెచ్, జూలియన్ వెబర్ (జర్మనీ), అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) లసీ ఇటెలాటలో (ఫిన్లాండ్), ఆండ్రియన్ మర్డారె (మాల్డోవా) తదితరులు తర్వాతి ప్రయత్నాల్లో నీరజ్ దూరాన్ని అధిగమించకపోవడంతో భారత అథ్లెట్ ఖాతాలో రజతం చేరింది. నీరజ్ సాధించిన రజత పతకంతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ సంయుక్తంగా 29వ ర్యాంక్‌లో ఉంది. ఒక రజతం, ఐదుగురు ఫైనల్స్ చేరడంద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఈసారి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. జెలెజ్నీ తర్వాత... డిఫెండింగ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్ ఆరు ప్రయత్నాల్లో మూడుసార్లు జావెలిన్‌ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరి ఫైనల్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ (1993, 1995) తర్వాత వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ అండర్సన్ చాంపియన్‌గా నిలిచాడు. ప్రశంసల వర్షం... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితర ప్రముఖులు నీరజ్ ప్రదర్శనను కొనియాడారు. ‘నీరజ్‌కు శుభాకాంక్షలు. భారత క్రీడల్లో ఇదెంతో ప్రత్యేక ఘట్టం. భవిష్యత్‌లో నీరజ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని ప్రధాని ట్విటర్లో అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా, దిగ్గజ అథ్లెట్స్ పీటీ ఉష, అంజూ బార్జి కూడా నీరజ్‌ను అభినందించారు. విసిరితే పతకమే... 2016 జూలై 23న పోలాండ్‌లో జరిగిన ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వెలుగులోకి వచ్చిన నీరజ్ చోప్రా అటునుంచి వెనుదిరిగి చూడలేదు. హరియాణాకు చెందిన నీరజ్ ఆ తర్వాత బరిలోకి దిగిన ప్రతి మెగా ఈవెంట్లో పతకంతో తిరిగి వచ్చాడు. 2016లోనే జరిగిన దక్షిణాసియా క్రీడల్లో... 2017లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో... 2018 జకార్తా ఆసియా క్రీడల్లో... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో... నీరజ్ జావెలిన్ త్రోలో భారత్‌కు పసిడి పతకాలు అందించాడు. 2017లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా ఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన నీరజ్ 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మోచేయి గాయంతో బరిలోకి దిగలేదు. గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో బంగారు పతకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ తర్వాత రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకొని గత అక్టోబర్‌లో మళ్లీ శిక్షణ ప్రారంభించాడు. గత నెలలో ఫిన్లాండ్లో జరిగిన కుర్టానో గేమ్స్‌లో స్వర్ణం... పావో నుర్మీ గేమ్స్‌లో రజతం... స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో రజతం సాధించిన నీరజ్ అదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కొనసాగించి భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించాడు. ఈనెల 28 నుంచి బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఎల్డోజ్ పాల్‌కు తొమ్మిదో స్థానం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారమే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో భారత ప్లేయర్ ఎల్డోజ్ పాల్ నిరాశపరిచాడు. కేరళకు చెందిన పాల్ 16.79 మీటర్ల దూరం గెంతి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే హీట్స్‌ను మొహమ్మద్ అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం 3ని:07.29 సెకన్లలో పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందలేకపోయింది. నీరజ్ గ్రామంలో సంబరాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా ప్రదర్శనతో... హరియాణాలోని పానిపట్‌కు సమీపంలోని ఖాండ్రా గ్రామంలో నీరజ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు. ‘దేశం మొత్తం, హరియాణా రాష్ట్రం మొత్తం నీరజ్ ప్రదర్శనకు గర్వపడుతోంది. నిరంతరం శ్రమిస్తూ అతను దేశానికి పేరుప్రతిష్టలు తెస్తున్నాడు’ అని నీరజ్ తల్లి సరోజ్ వ్యాఖ్యానించారు. -
తేజస్విన్‌కు అనుమతి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత హైజంప్ ప్లేయర్ తేజస్విన్ శంకర్‌కు నిర్వాహకులు అనుమతించారు. ఒకే ఈవెంట్లో వైదొలిగిన ప్లేయర్ స్థానంలో మరొకరికి అనుమతి ఇస్తామని గతంలో తేజస్విన్ ఎంట్రీని నిర్వాహకులు తోసిపుచ్చారు. అయితే శుక్రవారం డెలిగేట్ రిజిస్ట్రేషన్ మీటింగ్ ముగిశాక తేజస్విన్ ఎంట్రీకి పచ్చజెండా ఊపారు. స్వదేశంలో సెలెక్షన్ టోర్నీలో తేజస్విన్ బరిలోకి దిగలేదు. అయితే అతను కామన్వెల్త్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని అమెరికాలో నేషనల్ కాలేజియట్ అథ్లెటిక్స్ మీట్లో నమోదు చేశాడు. కానీ భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) తేజస్విన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోకుండా అతనిని ఎంపిక చేయలేదు. దాంతో తేజస్విన్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. చివరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఏఎఫ్ఐ అధికారులు తేజస్విన్ పేరును కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులకు పంపించారు. -
ఆత్మ విశ్వాసంతో ఆడండి..!!
-
‘పతకాలే కాదు హృదయాలు గెలిచారు’
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికెత్తారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ సారి పతక విజేతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి అద్భుతమైన ప్రదర్శన దేశంలోని యువతకు స్ఫూర్తినిచి్చందని ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల ప్రదర్శన చూసి భారత్ గరి్వస్తోంది. అథ్లెట్లు పతకాలే కాదు హృదయాల్ని గెలిచారు. యువతకు ప్రేరణగా నిలిచారు. ఇక్కడికొచి్చన అతిథులు, దేశంలోని ప్రజలంతా ఈ సంద ర్భంగా వారికి జేజేలు పలకాలి’ అని మోదీ అన్నారు. ఈ వేడుకల్లో పతక విజేతలు నీరజ్ చోప్రా, సింధు, మీరాబాయి, లవ్లీనా, రవి, బజరంగ్, పురుషుల హాకీ జట్టు సభ్యులతో పాటు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇతర ప్లేయర్లు పాల్గొన్నారు. -
భారత అథ్లెటిక్స్ కోచ్ అనూహ్య మృతి
పాటియాలా: భారత్ అథ్లెటిక్స్ (మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్) కోచ్ నికొలాయ్ స్నెసరెవ్ శుక్రవారం అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. బెలారస్‌కు చెందిన 72 ఏళ్ల స్నెసరెవ్... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని తన హాస్టల్ గదిలో శవమై తేలారు. మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. పాటియాలాలో శుక్రవారం ఇండియన్ గ్రాండ్‌ప్రి టోర్నీ జరిగింది. సన్నాహాల్లో భాగంగా ఉదయమే అథ్లెట్లతో కలిసి సాధన లో పాల్గొన్న స్నెసరెవ్ మధ్యాహ్నం ప్రధాన ఈవెంట్ జరిగే సమయంలో కనిపించలేదు. దాంతో అధికారులు ఆయన గదికి వెళ్లగా లోపలి నుంచి తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి చూస్తే తన మంచంపై కోచ్ పడిఉన్నారు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అవినాశ్ సాబ్లేతో పాటు ఇతర మిడిల్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్లకు ఆయన శిక్షణ ఇస్తున్నారు. 2005లో తొలిసారి భారత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్నెసరెవ్ హయాంలోనే ప్రీజా శ్రీధరన్, కవితా రౌత్, సుధా సింగ్, లలిత తదితరులు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించారు. అయితే భారత అథ్లెటిక్స్ సమాఖ్యతో విభేదాలతో 2019 ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కోచ్‌గా నియమించడంతో మంగళవారమే ఆయన భారతదేశానికి వచ్చారు. -
ఒక కిడ్నీతోనే పతకాలు సాధించా
కొచ్చి: స్టార్ ఒలింపియన్ అంజూ బాబీ జార్జి భారత అథ్లెటిక్స్కే వన్నె తెచ్చింది. లాంగ్‌జంప్‌లో తన పతకాలతో చరిత్ర సృష్టించింది. ఇంత చేసిన ఆమె పయనం నల్లేరుపై నడకలా సాగలేదని ఇన్నేళ్ల తర్వాత తాజాగా వెల్లడించింది. తాను సుదీర్ఘ కాలం కిడ్నీ సమస్యలతో సతమతమయ్యానని 43 ఏళ్ల అంజూ చెప్పింది. పోటీల్లో తలపడే సమయానికే ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో కేవలం ఒకే కిడ్నీతో ఆమె ఒంట్లో ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే బయట ఈవెంట్లలో ప్రత్యర్థులతో పోటీ పడినట్లు పేర్కొంది. ‘మీరు నమ్మినా నమ్మకపోయినా... ఒకే కిడ్నీతో ప్రపంచ క్రీడల్లో పోటీపడిన అతికొద్ది మందిలో నేనుంటాను. అలర్జీ, కాలి నొప్పి చాలా ఆరోగ్య సమస్యలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నా భర్త, కోచ్ బాబీ జార్జి ప్రోద్బలంతోనే వీటన్నింటిని అధిగమించి పతకాలు నెగ్గాను’ అని ప్రస్తుతం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) చైర్‌పర్సన్‌గా ఉన్న అంజూ ట్వీట్ చేసింది. కేరళకు చెందిన అంజూ 2003 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్ (2005)లో స్వర్ణం గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. అయితే మరియన్ జోన్స్ (అమెరికా) డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. అంతకుముందు 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఆమె బంగారు పతకం సాధించింది. అంజూ ట్వీట్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘నీ కఠోర శ్రమ, నిబద్దతతో భారత్ ప్రతిష్ట పెంచావు’ అని కొనియాడారు. -
భారత అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వోల్కర్ రాజీనామా
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వోల్కర్ హెర్మన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని వోల్కర్ స్వయంగా తన ఫేస్బుక్ పేజీ ద్వారా పంచుకున్నారు. అత్యున్నతమైన ఈ పదవి కోసం విధించుకున్న స్వీయ అంచనాలను ఇక అందుకోలేనని పేర్కొంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2019లో వోల్కర్ ఈ బాధ్యతను స్వీకరించారు. టోక్యో ఒలింపిక్స్‌తో ఆయన పదవీకాలం ముగియనుండగా... సెప్టెంబర్‌లో భారత క్రీడా మంత్రిత్వ శాఖ 2024 వరకు ఆయనకు పొడిగింపునిచ్చింది. అయితే దీన్ని తిరస్కరించిన వోల్కర్ కొన్ని వారాల కిందటే రాజీనామా పత్రాన్ని సమర్పించారని ఏఎఫ్ఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఏఎఫ్ఐ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన జర్మనీకి వెళ్లేందుకే సిద్ధపడ్డారని సమాఖ్య అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా తెలిపారు. -
ప్రేక్షకులు లేకుండానే గ్రాండ్‌ప్రి ఈవెంట్లు
న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్‌ప్రి (ఐజీపీ) అథ్లెటిక్స్ సిరీస్‌లో భాగంగా జరిగే తొలి రెండు పోటీలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేలా భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) సోమవారం నిర్ణయం తీసుకుంది. మన దేశంలోనూ కోవిడ్–19 తీవ్రమవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎఫ్ఐ తెలిపింది. ఐజీపీ–1 ఈ నెల 20వ తేదీన... ఐజీపీ–2 ఈ నెల 25వ తేదీన పటియాలాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వేదికగా జరగనున్నాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి జరగకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశీయుల ప్రయాణాలపై ఆంక్షలు విధించగా... స్పోర్ట్స్ ఈవెంట్లలో పెద్ద ఎత్తున జనం ఒకేచోట గుమికూడకుండా చర్యలు తీసుకోవాలంటూ అన్ని జాతీయ క్రీడల సమాఖ్యలను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కోరింది. -
డబ్బు కడితేనే క్రీడాగ్రామంలోకి
న్యూఢిల్లీ: ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొనేందుకు జకార్తా వెళ్లిన భారత బృందాన్ని నిర్వాహకులు అడ్డుకున్నారు. బస, ఇతరత్రా ఏర్పాట్ల కోసం రుసుము చెల్లిస్తేనే లోనికి అనుమతిస్తామని చెప్పారు. గేమ్స్ విలేజ్‌లో ప్రవేశించడానికి ముందు బస ఏర్పాట్ల కోసం ఫీజు చెల్లించడం ఆనవాయితీ. భారత బృందం రూ. 1 కోటి 80 లక్షలు (2,50,0000 డాలర్లు) చెల్లించకపోవడంతో నిర్వాహకులు భారత పారా అథ్లెట్లను చాలాసేపు నిలువరించారు. చివరకు ఈ నెల 4వ తేదీకల్లా చెల్లిస్తామని, లేదంటే గేమ్స్ విలేజ్ నుంచి నిష్క్రమిస్తామని రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు నిర్వాహకులు అంగీకరించారు. ఆసియా పారా అథ్లెటిక్స్ ఈ నెల 6 నుంచి 13 వరకు జరుగనున్నాయి. ఇందులో 193 మంది భారత అథ్లెట్లు పాల్గొంటున్నారు. కేంద్ర క్రీడాశాఖ నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్లే ఇలాంటి అనుభవం ఎదురైందని భారత పారాలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడు గుర్శరణ్ సింగ్ తెలిపారు. -
అలవోక అభ్యాసం
కందులిమరి గ్రామం చేల గట్ల మీద మొదలైన హిమాదాస్ పరుగు ఫిన్లాండ్లోని టాంపేర్ స్టేడియం ట్రాక్ ఎక్కింది. ఈ రెండింటి మధ్య సాగిన హిమ ప్రయాణం అంత పెద్దదీ కాదు, మరీ చిన్నదీ కాదు. గోల్డ్ మెడల్ కోసం ఆమె ఆయాస పడి శ్రమించింది లేదు, ఒక ఏడాది కష్టపడిందంతే! పిల్లలు హక్కులు ప్రదర్శిస్తుంటారు. ప్రశ్నలు సంధిస్తుంటారు. అలాంటి హక్కులున్న చిన్న పిల్ల హిమాదాస్. ఐదుగురు పిల్లల్లో చిన్నమ్మాయి. అందరి కంచాల్లోకి అన్నం రావాలంటే, ఇంట్లో అందరి ఒంటి మీద శుభ్రమైన దుస్తులు ఉండాలంటే ఇంట్లో అందరూ కష్టపడాల్సిన కుటుంబ నేపథ్యం వారిది. అయినా సరే ఆడుతూపాడుతూ బాల్యాన్ని బాల్యంగా ఆస్వాదించే విరచిత హక్కులు దఖలు పరచబడిన అమ్మాయి హిమ. చిన్నప్పుడు హిమ అబ్బాయిలతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూంటే అమ్మానాన్నలు మురిసిపోయారు. ‘అదేంటి మగపిల్లాడిలా’ అనలేదు. ఇప్పుడీ అమ్మాయి సాధించిన విజయానికి దేశం మొత్తం బుగ్గలు పుణికి మొటికలు విరుస్తుంటే పొంగిపోతున్నారు. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వంటి దేశ ప్రముఖులైతే ప్రపంచ స్థాయిలో మన జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు హిమను చూసి గర్వపడుతున్నారు. ఇంత పెద్ద దేశం, నూటా ముప్పై కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం... ఇన్ని కోట్లమందిలో ఇంతవరకు ఒక్కరూ సాధించని విజయాన్ని పద్దెనిమిదేళ్ల అమ్మాయి సాధించింది. ఆమె తెచ్చిన బంగారు పతకమే.. ఈ దేశానికి ప్రపంచ స్థాయి అథ్లెటిక్ రంగంలో తొలి గోల్డ్ మెడల్. ఐఏఏఎఫ్ అండర్ 20 కేటగిరీలో అథ్లెటిక్స్‌లో పాల్గొని 51.46 సెకన్లలో నాలుగు వందల మీటర్ల లక్ష్యాన్ని చేరుకుని తొలి స్థానంలో నిలిచింది హిమాదాస్. క్రీడాకారులు విరాట్ కోహ్లీ, వీరేందర్ సింగ్ సెహ్వాగ్, బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌తోపాటు అనేకమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ‘దేశానికి ప్రపంచస్థాయి బంగారు పతకం తెచ్చిన బంగారం’ అని ప్రశంసల్లో ముంచెత్తారు. సౌకర్యాలు లేకుండానే సాధన! అస్సాం రాష్ట్రం, నాగోన్ జిల్లా, థింగ్ పట్టణానికి సమీపంలో కందులిమరి గ్రామం చేల గట్ల మీద మొదలైన హిమ పరుగు ఫిన్లాండ్లోని టాంపేర్ స్టేడియం ట్రాక్ ఎక్కింది. ఈ రెండింటి మధ్య సాగిన హిమ ప్రయాణం అంత పెద్దదీ కాదు, మరీ చిన్నదీ కాదు. గోల్డ్ మెడల్ కోసం ఆమె ఆయాస పడి శ్రమించింది లేదు, ఒక ఏడాది కష్టపడిందంతే. అలాగని వడ్డించిన విస్తరిలా ఆమెకు అన్నీ సిద్ధంగా ఉన్నాయా అంటే.. ఏ ఒక్క సౌకర్యమూ లేదు. కనీసం కాళ్లకు స్పోర్ట్స్ షూ కొనడానికి కూడా తండ్రి దగ్గర డబ్బుల్లేవు. హిమలో అథ్లెట్ ఉందని గుర్తించింది ఆ స్కూల్ పీఈటీ నిపాన్ దాస్. అథ్లెటిక్స్ వైపు ఆమె దృష్టిని మరల్చింది కూడా అతడే. జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్లడంతోపాటు రాష్ట్ర క్రీడల కార్పొరేషన్ సహాయంతో మెరుగైన శిక్షణ ఇప్పించడంలోనూ సహకరించాడతడు. పల్లెటూరిలోనే ఉంటే స్పెషల్ కోచింగ్ కుదరదు. అందుకే గౌహతికి తాత్కాలికంగా మకాం మార్చమని హిమ తల్లిదండ్రులు రంజిత్, జోనాలి దాస్‌లకు సూచించాడు. గౌహతిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దగ్గరగా ఇల్లు అద్దెకు తీసుకుని శిక్షణ ఇప్పించారు. తన పోటీ తనతోనే!! హిమాదాస్ పరుగెత్తిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ... ‘పక్క ప్రత్యర్థులను చూడను కూడా చూడదు. లక్ష్యం వైపు సాగడమే తన పని అన్నట్లు పరుగెడుతుంది. తన టైమింగ్ తానే అధిగమించాలనే లక్ష్యంతో పరుగెత్తుతుంది’ అన్నారు నిపాన్. అందరి ప్రశంసలు ఒక ఎత్తయితే క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మెచ్చుకోలు ఒక్కటీ ఒకెత్తు. ఆయన ట్విట్టర్లో ‘హిమ చరిత్ర సృష్టించింది, ఈ చాంపియన్ షిప్ సాధించిన తొలి ఇండియన్. దేశానికే గర్వకారణం ఈ నారీ శక్తి’ అంటూ హిమాదాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మంత్రి ఎన్నికల్లో గెలుపు ఓటములనే కాకుండా, క్రీడల్లో గెలుపు ఓటములు కూడా తెలిసిన వాడు కదా మరి.