భారత అథ్లెటిక్స్‌ హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ వోల్కర్‌ రాజీనామా | India Athletics High Performance Director Volker Hermann Tenders Resignation | Sakshi
Sakshi News home page

భారత అథ్లెటిక్స్‌ హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ వోల్కర్‌ రాజీనామా

Published Mon, Nov 23 2020 6:19 AM | Last Updated on Mon, Nov 23 2020 6:19 AM

India Athletics High Performance Director Volker Hermann Tenders Resignation - Sakshi

న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ వోల్కర్‌ హెర్మన్‌ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని వోల్కర్‌ స్వయంగా తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా పంచుకున్నారు. అత్యున్నతమైన ఈ పదవి కోసం విధించుకున్న స్వీయ అంచనాలను ఇక అందుకోలేనని పేర్కొంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2019లో వోల్కర్‌ ఈ బాధ్యతను స్వీకరించారు. టోక్యో ఒలింపిక్స్‌తో ఆయన పదవీకాలం ముగియనుండగా... సెప్టెంబర్‌లో భారత క్రీడా మంత్రిత్వ శాఖ 2024 వరకు ఆయనకు పొడిగింపునిచ్చింది. అయితే దీన్ని తిరస్కరించిన వోల్కర్‌ కొన్ని వారాల కిందటే రాజీనామా పత్రాన్ని సమర్పించారని ఏఎఫ్‌ఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఏఎఫ్‌ఐ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన జర్మనీకి వెళ్లేందుకే సిద్ధపడ్డారని సమాఖ్య అధ్యక్షుడు ఆదిల్‌ సుమరివాలా తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement