Hermann
-
భారత అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వోల్కర్ రాజీనామా
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వోల్కర్ హెర్మన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని వోల్కర్ స్వయంగా తన ఫేస్బుక్ పేజీ ద్వారా పంచుకున్నారు. అత్యున్నతమైన ఈ పదవి కోసం విధించుకున్న స్వీయ అంచనాలను ఇక అందుకోలేనని పేర్కొంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2019లో వోల్కర్ ఈ బాధ్యతను స్వీకరించారు. టోక్యో ఒలింపిక్స్‌తో ఆయన పదవీకాలం ముగియనుండగా... సెప్టెంబర్‌లో భారత క్రీడా మంత్రిత్వ శాఖ 2024 వరకు ఆయనకు పొడిగింపునిచ్చింది. అయితే దీన్ని తిరస్కరించిన వోల్కర్ కొన్ని వారాల కిందటే రాజీనామా పత్రాన్ని సమర్పించారని ఏఎఫ్ఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఏఎఫ్ఐ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన జర్మనీకి వెళ్లేందుకే సిద్ధపడ్డారని సమాఖ్య అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా తెలిపారు. -
కౌర్ పవర్ డైనమో!
-
కౌర్ పవర్!
సాక్షి క్రీడావిభాగం :గత ఏడాది జులైలో వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై హర్మన్ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌ను ఎవరూ మరచిపోలేరు. నాడు కేవలం 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 171 పరుగులు సాధించి ఆమె అజేయంగా నిలిచింది. ఇప్పుడు మరో ప్రపంచ కప్ వచ్చింది. ఈసారీ హర్మన్ స్పెషల్ ఇన్నింగ్స్‌తో తన సత్తాను ప్రపంచానికి చూపించింది. బంతిని బలంగా బాదడమే మంత్రంగా పని చేసే టి20లో ఏకంగా శతకం సాధించడంలో కౌర్ పవర్ ఏమిటో కనిపించింది.సిక్సర్ల సునామీతో విరుచుకు పడిన ఈ ‘పంజాబ్ కీ షేర్ని’ తొలి టి20 సెంచరీతో భారత మహిళల క్రికెట్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. హర్మన్ షాట్లలో ఎంత పదును కనిపించిందంటే ఆమె కొట్టిన సిక్సర్లలో ఎక్కువ భాగం స్టాండ్స్‌లో పడ్డాయి. పురుషుల క్రికెట్లోనైనా, ఎలాంటి మైదానంలోనైనా అవి కచ్చితంగా సిక్సర్లుగా మారేవే! శుక్రవారం కివీస్‌తో మ్యాచ్‌లో కౌర్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే ప్రారంభమైంది.తాను ఎదుర్కొన్న తొలి 13 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసింది. అయితే వాట్కిన్ వేసిన పదో ఓవర్లో హర్మన్ ప్రతాపం ప్రారంభమైంది. ఈ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో తన ఉద్దేశాన్ని చాటింది. ఆ తర్వాత ప్రత్యర్థి కెప్టెన్ సాటర్‌వెయిట్ వేసిన 14వ ఓవర్లో పండగ చేసుకుంది. 2 సిక్సర్లు, ఫోర్‌తో చెలరేగిన భారత కెప్టెన్... 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఆమెను ఆపడం న్యూజిలాండ్ తరం కాలేదు. మరుసటి ఓవర్లో వరుసగా 4, 6...ఆ తర్వాతి రెండు ఓవర్లలో కలిపి మరో రెండు ఫోర్లు, సిక్సర్ బాదింది.హర్మన్ 85 పరుగుల వద్ద మళ్లీ స్ట్రయికింగ్‌కు వచ్చే సమయానికి ఇన్నింగ్స్‌లో 8 బంతులే మిగిలాయి. ఆమె సెంచరీ సాధించగలదా అనే సందేహం కనిపించింది. అయితే దానిని పటాపంచలు చేస్తూ 19వ ఓవర్ చివరి రెండు బంతులకు భారీ సిక్సర్లు కొట్టి 97కు చేరుకుంది. డెవిన్ వేసిన చివరి ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు తీయడంతో భారత మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర నమోదైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు (మార్చి 8) పుట్టిన హర్మన్ అబ్బాయిలతో పోటీ పడి అసాధారణ క్రికెటర్‌గా ఎదిగింది.సెహ్వాగ్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తావా అంటూ ఊర్లో కుర్రాళ్లు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు సెహ్వాగ్‌లాంటి దూకుడైన ఆటతోనే జవాబు చెప్పింది. క్రికెట్ పిచ్చి ఉన్న తండ్రి ఆమె పుట్టినప్పుడు క్రికెటర్ బొమ్మ ఉన్న షర్ట్ తెచ్చి తొడగడం యాదృచ్ఛికమే కావచ్చు కానీ ఆయన ప్రోత్సాహంతో దేశం గర్వపడే క్రికెటర్‌గా ఎదిగేందుకు పట్టుదలతో శ్రమించింది. హర్మన్ మెరుపు బ్యాటింగ్ వెనక ఆమె అద్భుత ఫిట్నెస్ కూడా దాగి ఉంది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలో ఆమె రెండు సార్లు యోయో టెస్టుకు హాజరైంది.పురుష క్రికెటర్లకే సాధ్యం కాని రీతిలో తొలిసారి 17.2 స్కోరు నమోదు చేసిన ఆమె మరో ఐదు నెలలకు దానిని మెరుగుపర్చుకొని 18.5కి తీసుకొచ్చింది. దీనిని చూసిన యువరాజ్ సింగ్ ‘ఇంత స్కోరు చేశావా... అదీ ఇండోర్‌లో...అంతా బాగానే ఉంది కదా’ అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నువ్వు సెహ్వాగ్లాగానే ఆడుతున్నావంటూ యువీ ఇచ్చిన ప్రశంస ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఆటలోనే కాకుండా సగటు పంజాబీ అమ్మాయిలలాగా మాటల్లో కూడా కౌర్ దూకుడు కనిపిస్తుంది. మైదానంలో సరిగా స్పందించని జట్టు సభ్యులపై ఆమె ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన ఘటనలు బోలెడు. అయితే పిన్న వయసులో భారత టి20 కెప్టెన్ కావడం నుంచి బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన తొలి భారత క్రికెటర్ వరకు అనేక ఘనతలు తన పేరిట లిఖించుకున్న హర్మన్ ఖ్యాతి తాజా ఇన్నిం గ్స్‌తో శిఖరానికి చేరిందంటే అతిశయోక్తి లేదు. -
ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్‌లోకి శాంసంగ్ మెగా ఎంట్రీ!
• అమెరికన్ ఆడియో కంపెనీ హర్మన్ కొనుగోలుకు అంగీకారం • డీల్ విలువ రూ.53 వేల కోట్లు... సియోల్: ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఆడియో సిస్టమ్స్ తయారీ కంపెనీ హర్మన్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు 8 బిలియన్ డాలర్లు (రూ.53,400 కోట్లు సుమారు) వెచ్చించనున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. డీల్‌లో భాగంగా హర్మన్‌కు చెందిన ఒక్కో షేరుకు 112 డాలర్లను శాంసంగ్ చెల్లించనుంది. వృద్ధి చెందుతున్న కార్ల మార్కెట్లోకి శాంసంగ్ భారీ స్థారుులో రంగ ప్రవేశం చేసేందుకు హర్మన్ కొనుగోలు వీలు కల్పించనుంది. కాగా, శాంసంగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు. శాంసంగ్ గత నెలలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స సంస్థ వివ్ ల్యాబ్స్‌ను కొనుగోలు చేయగా, క్లౌడ్ సేవలు, మొబైల్ చెల్లింపులు, కనెక్టెడ్ హోమ్ స్టార్టప్ విభాగంలో కంపెనీలను కూడా ఇటీవలి కాలంలో సొంతం చేసుకుంది. హర్మన్ కొనుగోలు పూర్తి అరుున వెంటనే కనెక్టెడ్ టెక్నాలజీ, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ముఖ్యంగా ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్‌లో గణనీయ పాత్ర పోషించడానికి అవకాశం లభిస్తుందని, ఇది తమకు వ్యూహాత్మక ప్రాధాన్య అంశమని శాంసంగ్ తన ప్రకటనలో పేర్కొంది. హర్మన్‌ను స్వతంత్ర అనుబంధ కంపెనీగానే ఉంచుతూ ప్రస్తుత మేనేజ్మెంట్ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలిపింది. 3 కోట్ల కార్లలో హర్మన్ ఆడియోనే.. హర్మన్ ఆటోమొబైల్ కనెక్టెడ్ కార్స్ (కార్లలో ఇంటర్నెట్ అనుసంధానిత పరికరాలు) ఆడియో పరికరాలు, ఆటోమోటివ్ ఆడియో సిస్టమ్స్, హోమ్ ఆడియో సిస్టమ్స్ తయారీలో ప్రముఖ కంపెనీ. అమెరికాలోని 3 కోట్ల కార్లలో హర్మన్ ఆడియో పరికరాలు కనిపిస్తారుు. సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాది కాలంలో 7 బిలియన్ డాలర్ల (రూ.46,900 కోట్లు) అమ్మకాల ఆదాయం లభించగా, ఇందులో గణనీయ వాటా కార్ల ఆడియో విభాగం నుంచి వచ్చిందే కావడం గమనార్హం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం ఆటో సిస్టమ్స్, కాంపోనెంట్స్ తయారీ విషయంలో తన ఆసక్తిని శాంసంగ్ గతేడాది డిసెంబర్లోనే వ్యక్తం చేసింది. యాపిల్, గూగుల్ కంపెనీలు తమ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రాజెక్టుకు విడిభాగాల సరఫరా కోసం ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో జట్టుకట్టిన విషయం తెలిసిందే.