గత ఏడాది జులైలో వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై హర్మన్ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌ను ఎవరూ మరచిపోలేరు. నాడు కేవలం 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 171 పరుగులు సాధించి ఆమె అజేయంగా నిలిచింది. ఇప్పుడు మరో ప్రపంచ కప్ వచ్చింది. ఈసారీ హర్మన్ స్పెషల్ ఇన్నింగ్స్‌తో తన సత్తాను ప్రపంచానికి చూపించింది. బంతిని బలంగా బాదడమే మంత్రంగా పని చేసే టి20లో ఏకంగా శతకం సాధించడంలో కౌర్ పవర్ ఏమిటో కనిపించింది.