ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్లోకి శాంసంగ్ మెగా ఎంట్రీ!
• అమెరికన్ ఆడియో కంపెనీ హర్మన్ కొనుగోలుకు అంగీకారం
• డీల్ విలువ రూ.53 వేల కోట్లు...
సియోల్: ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఆడియో సిస్టమ్స్ తయారీ కంపెనీ హర్మన్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు 8 బిలియన్ డాలర్లు (రూ.53,400 కోట్లు సుమారు) వెచ్చించనున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. డీల్‌లో భాగంగా హర్మన్‌కు చెందిన ఒక్కో షేరుకు 112 డాలర్లను శాంసంగ్ చెల్లించనుంది. వృద్ధి చెందుతున్న కార్ల మార్కెట్‌లోకి శాంసంగ్ భారీ స్థారుులో రంగ ప్రవేశం చేసేందుకు హర్మన్ కొనుగోలు వీలు కల్పించనుంది. కాగా, శాంసంగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు. శాంసంగ్ గత నెలలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్‌స సంస్థ వివ్ ల్యాబ్స్‌ను కొనుగోలు చేయగా, క్లౌడ్ సేవలు, మొబైల్ చెల్లింపులు, కనెక్టెడ్ హోమ్ స్టార్టప్ విభాగంలో కంపెనీలను కూడా ఇటీవలి కాలంలో సొంతం చేసుకుంది. హర్మన్ కొనుగోలు పూర్తి అరుున వెంటనే కనెక్టెడ్ టెక్నాలజీ, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో ముఖ్యంగా ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్‌లో గణనీయ పాత్ర పోషించడానికి అవకాశం లభిస్తుందని, ఇది తమకు వ్యూహాత్మక ప్రాధాన్య అంశమని శాంసంగ్ తన ప్రకటనలో పేర్కొంది. హర్మన్‌ను స్వతంత్ర అనుబంధ కంపెనీగానే ఉంచుతూ ప్రస్తుత మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలిపింది.
3 కోట్ల కార్లలో హర్మన్ ఆడియోనే..
హర్మన్ ఆటోమొబైల్ కనెక్టెడ్ కార్స్ (కార్లలో ఇంటర్నెట్ అనుసంధానిత పరికరాలు) ఆడియో పరికరాలు, ఆటోమోటివ్ ఆడియో సిస్టమ్స్, హోమ్ ఆడియో సిస్టమ్స్ తయారీలో ప్రముఖ కంపెనీ. అమెరికాలోని 3 కోట్ల కార్లలో హర్మన్ ఆడియో పరికరాలు కనిపిస్తారుు. సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాది కాలంలో 7 బిలియన్ డాలర్ల (రూ.46,900 కోట్లు) అమ్మకాల ఆదాయం లభించగా, ఇందులో గణనీయ వాటా కార్ల ఆడియో విభాగం నుంచి వచ్చిందే కావడం గమనార్హం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం ఆటో సిస్టమ్స్, కాంపోనెంట్స్ తయారీ విషయంలో తన ఆసక్తిని శాంసంగ్ గతేడాది డిసెంబర్‌లోనే వ్యక్తం చేసింది. యాపిల్, గూగుల్ కంపెనీలు తమ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రాజెక్టుకు విడిభాగాల సరఫరా కోసం ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో జట్టుకట్టిన విషయం తెలిసిందే.