ఉచితంగా రూ.1.09 లక్షల విలువైన ఫోన్‌! | Every athlete at Paris 2024 will receive a brand new Samsung Galaxy Z Flip6 | Sakshi
Sakshi News home page

Olympics 2024: ఉచితంగా రూ.1.09 లక్షల విలువైన ఫోన్‌!

Published Sat, Jul 27 2024 1:18 PM | Last Updated on Sat, Jul 27 2024 1:53 PM

Every athlete at Paris 2024 will receive a brand new Samsung Galaxy Z Flip6

ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారా.. అయితే మీకు రూ.1.09 లక్షల విలువైన ఫోన్‌ ఉచితంగా లభిస్తుంది. ఎలాగంటారా.. పారిస్‌ ఒలింపిక్‌ 2024లో పాల్గొనే క్రీడాకారులకు కార్పొరేట్‌ కంపెనీలు ఆకర్షణీయ బహుమతులు అందిస్తున్నాయి. ఇందులో మొబైల్‌ఫోన్‌లు వంటి విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ క్రీడాకారులకు ప్రత్యేకంగా కిట్‌ను అందిస్తోంది. అందులో రూ.1.09 లక్షల విలువైన గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 6 ఒలింపిక్‌ ఎడిషన్‌ను ఉచితంగా ఇస్తున్నారు.

ఈ కిట్‌ను అందుకోవాలంటే నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీలో నమోదవ్వాలి. అందులో చేరిన వారికి పారిస్‌లోని ‘ఒలింపిక్ విలేజ్‌ చెఫ్ డి మిషన్’కు చేరిన వెంటనే కిట్‌ అందిస్తారు. వీటిని ఆగస్టు 11 వరకు ఎప్పుడైనా ‘ఒలింపిక్ విలేజ్ ప్లాజా’లో తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: భారత్‌లో ఐప్యాడ్‌ తయారీ..?

కిట్‌లో ఉండే వస్తువులు..

1. శామ్‌సంగ్ ఒలింపిక్ ఫ్లిప్‌సూట్‌ ఎడిషన్(మార్కెట్‌ ధర సుమారు రూ.1,09,999)

  • ఇందులో 100జీబీ డేటాలో అపరిమిత కాల్స్‌ మాట్లాడేలా ఈ-సిమ్‌ ఉంటుంది. శామ్‌సంగ్‌ ప్రత్యేకంగా అందించే అథ్లెట్‌ 365 యాప్‌ కూడా ఇన్‌స్టాల్‌ చేసి ఇస్తున్నారు. దాంతో వ్యక్తిగత ఒలింపిక్‌ అప్‌డేట్లు తెలుసుకోవచ్చు.

2. ఐఓసీ వెల్‌కమ్‌ గైడ్

3. కోకా-కోలా సిగ్గ్‌ బాటిల్, పారిస్ 2024 పవర్‌ఏడ్‌ స్క్వీజ్ బాటిల్

4. ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ కంపెనీకు చెందిన టాయిలెట్ బ్యాగ్, ఎయిర్ ఫ్రెషనర్, షాంపూ, హ్యాండ్ సోప్‌, టూత్ బ్రష్, టూత్‌పేస్ట్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement