వరుసగా పదో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ జార్జియా మహిళా షూటర్ నినో సాలుక్‌వాద్జె
ఒలింపిక్స్‌కు ఒక్కసారి అర్హత సాధించడమే గొప్ప అనుకుంటుంటే... వరుసగా పదోసారి విశ్వక్రీడల్లో పోటీ పడటాన్ని ఏమనాలి! జార్జియాకు చెందిన 55 ఏళ్ల మహిళా షూటర్ నినో సాలుక్‌వాద్జె ఇలాంటి అసాధారణ ఘనత సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్ ద్వారా విశ్వక్రీడల్లో అరంగేట్రం చేసిన నినో... తొలి ప్రయత్నంలో 25 మీటర్ల పిస్టల్‌లో స్వర్ణం, 10 మీటర్ల విభాగంలో రజతం సాధించి అదరగొట్టింది.
ఇక అప్పటి నుంచి వరుసగా అన్నీ ఒలింపిక్స్‌లో పాల్గొన్న నినో... తాజాగా పారిస్ క్రీడల ద్వారా వరుసగా పదోసారి గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారిణిగా రికార్డు నెలకొలి్పంది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో నినో బరిలోకి దిగి 562 పాయింట్లు స్కోరు చేసి 38వ స్థానంలో నిలిచింది. కెనడాకు చెందిన ఈక్వె్రస్టియాన్ ఇయాన్ మిల్లర్ కూడా 10 ఒలింపిక్స్‌లో పాల్గొన్నా... అతడు 1980 మాస్కో ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్నాడు.
2016 రియోలో కుమారుడు సోట్నే మచావరియానితో కలిసి పోటీపడటం ద్వారా.. విశ్వక్రీడల్లో బరిలోకి దిగిన తొలి తల్లీ తనయులుగా నినో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించిన నినో... తండ్రి చివరి కోరిక మేరకే పదో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment