bhimavarm
-
ఈ-క్రాప్‌తో రైతు సంక్షేమం
భీమవరం: రైతు శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తూ అండగా నిలుస్తోంది. దీనిలో భాగంగానే పథకాలను రైతులకు మరింత చేరువ చేయడానికి చేపట్టిన ఈ–క్రాప్ నమోదు భీమవరం నియోజకవర్గంలో వేగంగా జరుగుతోంది. ఈ–క్రాప్ ద్వారా గ్రామాల్లో పండించిన అన్నిరకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమ, పశుగ్రాసం, సామాజిక అటవీశాఖ, మత్స్యశాఖలకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతులకు అందించే అన్ని సంక్షేమ పథకాలు, వైఎస్సార్ సున్నావడ్డీ, పంట రుణాలు, వైఎస్సార్ ఉచిత పంట బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, కనీస మద్దతు ధర వంటివి దక్కుతాయి. గతంలో ప్రభుత్వం రైతుల కోసం అమలుచేసే పథకాలు భూస్వాములకు మాత్రమే దక్కేవి. జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా కౌలు రైతులున్నారు. వీరిని పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వ పథకాలు పంట సాగుచేసే రైతులకే అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఈ క్రాప్ విధానం చేపట్టారు. ఈ క్రాప్‌లో భూయజమానులు, కౌలు రైతులు, ఈనాం రైతులు వంటి వారిని కూడా నమోదుచేస్తారు. ఈ క్రాప్ నమోదు కార్యక్రమం భీమవరం నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతోంది. వీరవాసరం మండలంలో సుమారు 14 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా ఇప్పటివరకు 5 వేల ఎకరాల్లో నమోదు చేశారు. భీమవరం మండలంలో 11 వేల ఎకరాలకు గాను 5వేల ఎకరాల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. మిగిలిన విస్తీర్ణంలో కూడా నమోదు కార్యక్రమాన్ని వేగంగా చేస్తున్నారు. పంట అమ్మకాలకు ఎంతో మేలు నియోజకవర్గంలో ప్రధానంగా వరి అమ్మకాలకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మే సమయంలో రిజిస్టర్ కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద అభ్యంతరాలు చెబుతున్నారు. పండిన పంటను తీరా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాక నమోదు ఇబ్బందులతో అమ్మకంలో జాప్యం జరుగుతోంది. దీనిని అధిగమించడానికి పంట వేసిన సమయంలోనే ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే.. అమ్మే సమయంలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. వేగంగా ఈ క్రాప్ నమోదు భీమవరం వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని, వీరవాసరం, భీమవరం, పాలకోడేరు మండలాల్లో ఈ క్రాప్ నమోదు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 50 శాతం వరకు పూర్తయ్యింది. ఈ క్రాప్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంది. రైతులంతా తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమవరం -
తిన్నా నీరసమే.. తినక పోయినా నీరసమే..
భీమవరం టౌన్: ’’గంగ గోవు పాలు గరిటడైనను చాలు.. కడవడైన నేమి ఖరము పాలు..’’ అని వేమన ఏనాడో చెప్పారు. సంఘం మేలు కోరి ఎన్నో హితవచనాలు పలికారు. అవన్నీ మనం పట్టించుకోకుండా అధునిక ప్రపంచం, పద్ధతులు అంటూ ఎన్నో కొత్త అలవాట్లు చేసుకున్నాం, చేసుకుంటున్నాం. మిగతా విషయాలు ఎలా ఉన్నా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. జిల్లాలో 39 లక్షల జనాభా ఉంది. ఆహారం తీసుకోవడంలో పరిమాణం చూస్తున్నామే గాని, వాటి వల్ల ఎంతమేరకు ఉపయోగకరం అనేది పట్టించుకోవడం లేదు. దాంతో జబ్బులతో ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపాటి పనులు కూడా చేసుకోలేక నీరసించి పోతున్నాం. ఇందుకు ఉదాహరణే కింద ఉదహరిస్తున్న ఆలుమగల సంభాషణ. భార్య: చూడు ఆ వయస్సులో కూడా ఎంత బలంగా, చలాకీగా ఉన్నాడో.. భర్త: అవునవును పూర్వకాలం తిండి. అందుకే ఈ వయస్సులో కూడా ఇలా ఉన్నాడు. 80 ఏళ్లు పైబడే ఉన్నట్లు కనిపిస్తోంది. భార్య: మనమూ ఉన్నాం. ముప్పూటలా తిన్నా నీరసమే.. తినకపోయినా నీరసమే. అప్పట్లో మా తాత కుండడు అన్నం, ఒక కోడి, 50 గారెలు, 20 బూరెలు ఒకేసారి తినేసేవాడట మా నానమ్మ చెప్పేది. అదేమిటో వాళ్లకీ మనకీ వ్యత్యాసం అర్థం కావడం లేదు. భర్త: అప్పుడూ ఇప్పుడూ అదే అన్నం, పప్పు, కాయగూరలు, ఆకుకూరలు, మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు, పచ్చళ్లు, పాలు, పెరుగు, నెయ్యి అన్నీ తింటున్నాం కదా అయినా ఎందుకు ఇంత నీరసంగా ఉంటున్నామని ఆలోచిస్తున్నావా? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చెబుతా విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ’’అమ్మచేతి గోరుముద్ద, నానమ్మ చేసిన సున్నుండ, అమ్మమ్మ పట్టిన ఊరగాయ ఇప్పుడెక్కడివి. అంత తీరిక సమయం ఎవరికీ లేదు. నరం లేని నాలుక కోరుకునే రుచులకు అలవాటుపడి ఫాస్ట్‌ఫుడ్, జంక్ఫుడ్లపై ఆధారపడుతున్నాం. టేస్టింగ్ సాల్ట్ వంటకాలు. రంగులు కలిపిన స్వీట్లు, పోషక విలువలు లేని పిజ్జాలు, బర్గర్ల బాట పడుతున్నారు. మరోవైపు పాలు, నెయ్యి, నూనెలు, పప్పు, బియ్యం, ఇలా అన్ని కల్తీమయమే. దంపుడు బియ్యం బలం నేడు ఎవరికీ తెలియదు. అంతా పాలిష్ బియ్యం. పురుగు మందులతో తడిచి ముద్దయిన ఆకు, కూరగాయలు. ఇంటి పెరట్లో, పొలం గట్టున సహజ సిద్ధంగా పెంచిన కూరగాయలు, ఆకుకూరలు ఇప్పుడు గగనమయ్యాయి. సెంటు స్థలం ఉంటే ఒంటి స్తంభం మేడ నిర్మాణం, పొలాలను కనుమరుగు చేసి ఆక్వా చెరువులు, రియల్ ఎస్టేట్ ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు. పల్లెల్లో పాలు, పెరుగు, కూరగాయలు తీసుకోండి వదినా, అక్కా అంటూ ఒకప్పుడు ఇచ్చిపుచ్చుకునే వారు. ఇప్పుడు నీళ్లు కలిసిన పాలు, పిండి పాలు, ఇక ఒంట్లో బలమెక్కడ ఉంటుంది. పంటకాలువల్లో అప్పటికప్పుడు పట్టిన చేపలు, రొయ్యలు, పీతలు, పెరట్లో పెంచిన నాటుకోళ్లు, అవిపెట్టిన గుడ్లు ప్రతీ ఇంటా తినేవారు. పదిమందికి పంచేవారు. మరి ఇప్పుడో పురుగుమందుల అవశేషాలున్నాయని బెంబేలెత్తిస్తున్న చేపలు, రొయ్యలు, తలవాల్చే తెల్లకోళ్లు. అవిపెట్టే గుడ్లు. ఇంకెక్కడ పోషక విలువలున్న పౌష్టికాహారం. నచ్చిన కూరతో కొంచెం గట్టిగా ఓపట్టు పడితే ఓ మాత్ర, ఆ తరువాత గ్యాస్‌కు ఓ మాత్ర, అయినా మంట తగ్గకపోతే సిరప్, ఇది నేటి మన తిండి తిప్పలు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు సేంద్రియ సేద్యం అంటూ పూర్వ వైభవం, ఆరోగ్యం కోసం పరుగులు పెడుతున్నాం’’ అని వివరించాడు భర్త. ఇకనుంచి మనమూ రసాయనాలు లేని, కల్తీలేని, సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నిద్దాం అంది భార్య. ఇది ఆ భార్యభర్తల ఆలోచనే కాదు. నేటి సమాజంలో చాలామందిలో వస్తున్న మార్పు. తీసుకునే ఆహారం విషయంలో సహజసిద్ధమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఈ మార్పు ముదావహమే గదా. జిల్లా జనాభా, వినియోగించే పరిణామం ఆధారంగా లెక్కిస్తే జిల్లాలో ఆహార పదార్థాల వినియోగం నెలకు ఇలా ఉంది. జిల్లా జనాభా: 39,95,742 మటన్ 200 టన్నులు చికెన్ 420 టన్నులు రొయ్యలు 200 టన్నులు పీత 50 టన్నులు చేప 400 టన్నులు గుడ్లు 6 కోట్లు బియ్యం 30 వేల టన్నులు కందిపప్పు 2,420 టన్నులు పెసరపప్పు 1200 టన్నులు పాలు 3.60 కోట్ల లీటర్లు -
బ్యాంకులకు రికవరీ భయం
పెద్దనోట్ల రద్దుతో దుస్థితి ఇచ్చిన రుణాలు రికవరీ కాక ఆందోళన భీమవరం : పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులకు రికవరీ భయం పట్టుకుంది. ఇటీవల వరకూ జిల్లాలో చేపలు, రొయ్యలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా సాగాయి. రాష్ట్ర విభజన అనంతరం ప్రధానంగా డెల్టాప్రాంతంలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు తదితర ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం ఆకాశమే హద్దుగా సాగింది. ఫలితంగా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధాన రోడ్లు వెంబడి ఎకరం వరి పొలం రూ.మూడు కోట్లపైబడి ధర పలికింది. ఇక మెరక భూముల ధరలకైతే పట్టపగ్గాలే లేవు. అపార్ట్మెంట్లకూ, ఇళ్లకూ మార్కెట్ ధర పెరిగిపోయింది. దీంతో బ్యాంకర్లు భూములు, ఇళ్ల తనఖాపై అధిక మొత్తాలను రుణాలుగా ఇచ్చారు. దీనిని ఆసరాగా తీసుకుని కొందరు బినామీ వ్యక్తులు కూడా రుణాలు తీసుకున్నారు. కొందరు నకిలీ పత్రాలు చూపి, తక్కువ ఖరీదు కలిగిన భూములకు ఎక్కువ మొత్తంలో రుణాలు పొందారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు బ్యాంకు అధికారులను మచ్చిక చేసుకుని రుణాలు పొందారు. భీమవరంలో ఓ రొయ్యల చెరువు యజమాని ఊరు, పేరు తెలియని 12 మంది వ్యక్తుల పేరున కేవలం రూ. మూడు కోట్ల విలువచేసే భవనం తనఖాపై ఏకంగా రూ.11 కోట్లు రుణం తీసుకున్న వైనం గత నెలలో ’సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంకర్లలో వణుకు ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో బంగారం, వెండి ధరలతోపాటు భూములు, భవనాల ధరలూ గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిబంధనలు మారడం, కొనుగోలు చేసిన భూములు, భవనాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉండడంతో క్రయ, విక్రయాలూ తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో భూముల ధరలు మరింత పడిపోతాయని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో భూములకు అధికమొత్తాల్లో రుణాలు ఇచ్చిన బ్యాంకర్లలో వణుకు మొదలైంది. రుణాలు రికవరీ కావనే ఆందోళన నెలకొంది. తామిచ్చిన రుణాలు ఎలా రికవరీ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికే బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో బ్యాంకులో కుదువపెట్టిన బంగారాన్ని తక్షణం విడిపించుకోవాలని బ్యాంకు సిబ్బంది రుణగ్రహీతలకు నోటీసులు జారీ చేస్తున్నారు.భూములు, భవనాలపై ఇచ్చిన రుణాల రికవరీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. -
‘హాల్’ డేస్
భీమవరం టౌన్: వెెండి తెర కళతప్పింది.. కొత్త సినిమాలకు కూడా ప్రేక్షకులు కరువవుతున్నారు. అన్ని షోలు ఖాళీగానే ఉంటున్నాయి. జనంతో రద్దీగా ఉండే థియేటర్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కనీసం సైకిల్ స్టాండ్ సైకిల్ పెట్టేవారు, క్యాంటీన్లో ఒక్క సమోసా కూడా కొనేవారు కరువయ్యారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం సినిమా థియేటర్లపై తీవ్రంగా పడింది. 15 రోజులుగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను చవిచూస్తున్నాయి. రోజుకు నాలుగు షోలు థియేటర్లలో వేస్తారు. ఇప్పుడు కనీసం రెండు షోలు వెయ్యాలంటే జనం లేక యాజమాన్యాలు దిక్కులు చూస్తున్నారు. భీమవరం పట్టణంలో ఆరు థియేటర్లలలో 12 స్క్రీన్స్ ఉన్నాయి. థియేటర్లలో టిక్కెట్‌కు రూ.100 తెచ్చుకుంటేనే ఇస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్లు మార్చే ఓపిక లేక యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి తోడు జనం కూడా నగదు ససమస్యలతో విలాసాలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండడం, పొదుపును పాటిస్తూ ఆచితూచి ఖర్చుపెట్టడం కూడా ఈ రంగంపై ప్రభావం పడింది. థియేటర్లు జనంతో నిండిని నిండకపోయినా రోజుకు సుమారు రూ.10 నుంచి 15 వేలు నిర్వహణకు వ్యయం చేయాల్సి వస్తోంది. టిక్కెట్‌పై ట్యాక్స్ నిర్ణయం వల్ల జనం లేక పోతే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. కాని నిర్వహణ వ్యయం యాజమాన్యాలకు భారంగా మారింది. -
ఇక జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఉచితం
త్వరలో ఏలూరులో సమావేశం భీమవరం టౌన్: ఇక జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఉచితంగా పొందేందుకు మార్గం సుగమం అవుతోంది. ఈ పత్రా జారీ మరింత సులభతరం, ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా డిసెంబర్ 1వ తేది నుంచి పొందవచ్చు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈనెల 24 తేదిన ఏలూరు నగరపాలక సంస్థను డీఎంఅండ్‌హెచ్‌వో కె.కోటేశ్వరి ఆధ్వర్యంలో జిల్లాలోని అందరు మునిసిపల్ కమిషనర్లు, ఏఎస్‌వోలు, హెల్త్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్యశాఖ డీఎంఎ కూడా రానున్నారు. నగర పాలక సంస్థలు, మునిసిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయనవసరం లేదు. త్వరలో ఇంటి వద్ద కూర్చుని ఆ ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. ఈ ధృవీకరణ పత్రాల నమూనా ఆన్లైన్లో ప్రత్యేక్ వెబ్‌సైట్‌గా పొందుపరచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ నమూనా పత్రంలో వివరాలు నమోదు (రిజిస్ట్రేషన్) చేస్తే క్షణాల్ల పరిశీలిన జరుగుతుంది. సంబంధిత నమూనా ధృవీకరణ పత్రాలపై ముందుగానే మునిసిపల్ కమీషనర్ల డిజిటల్ సంతకాలు చేసి ఉంటాయి. రిజిస్ట్రేషన్ పరిశీలన అనంతరం జనన, మరణ ధృవీకరణ పత్రాలను సొంతంగానే ప్రింటౌట్ తీసుకునే సౌకర్యం కలగనుంది. గతం, ప్రస్తుతం: కాగిత రహిత పాలనలో భాగంగా ఇప్పటి వరకూ ఉన్న సాంకేతిక విధానంలో కూడా మార్పులు చేస్తున్నారు. గతంలో నగరపాలక సంస్థలు, మునిసిపాలిటిల్లో జనన, మరణ ధృవీకరణ పత్రాలు చేతిరాత విధానంలో అందచేసేవారు. జననం, మరణం జరిగిన వెంటనే సమాచారాన్ని మునిసిపల్ రికార్డుల్లో నమోదు చేస్తారు. దశాబ్దకాలంగా కంప్యూటరైజ్డ్ ధృవీకరణ పత్రాలను ఇస్తున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా కూడా ఈ పత్రాలను పొందే సౌలభ్యం ఏర్పడింది. అయితే పట్టణాలో జనన, మరణ వివరాలను తప్పనిసరిగా నగర, మునిసిపాలిటిలకు సమాచారం అందిచాల్సి ఉంది. ధృవీకరణ పత్రాలు పొందేందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంది. సిఆర్ సిస్టం: నగర పాలక సంస్థలు, మునిసిపాలిటిలో ప్రస్తుతం ఉన్న యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ (యుబిడి) సాఫ్ట్‌వేర్‌ను ఇప్పుడు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సిఆర్ఎస్)లోకి మార్పు చేస్తున్నారు. ఈ మేరకు నాలుగు నెలల క్రితం డైరక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (yì ఎంఎ) కె.కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ పనుల నిర్వహణను కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో మునిసిపాలిటిల్లో సాఫ్ట్వేర్ మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. భీమవరంలో ప్రయోగాత్మకంగా : రాజమండ్రి రీజియన్ పరిధిలోని కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో మొట్టమొదటిగా భీమవరం మునిసిపాలిటిలో సిఆర్ఎస్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. పూర్వ నుంచి రికార్డు పస్తుకాల్లో ఉన్న జనన, మరణ వివరాలను స్కాన్ చేసి కంప్యూటరీకరణ చేశారు. ఆ తరువాత సిఆర్ఎస్ సిస్టంలో వీటిని పొందుపరుస్తారు. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో: గతంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఇంటి వద్ద ప్రసవం జరిగినా, మరణించినా ఆ సమాచారాన్ని మునిసిపాలిటికి తెలిపి రికార్డుల్లో నమోదు చేయించాలి. ఈ ఏడాది మే 1వ తేది నుంచి ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రుల్లో జనన, మరణాల సమాచారం మునిసిపాలిటిలకు తెలపాల్సిన అవసరం లేకుండానే సంబంధిత ధృవీకరణ పత్రాలు (సర్టిఫికెట్లు) ఆసుపత్రుల వద్దే అందిస్తున్నారు. శిశువులకు ఆధార్ నంబర్ కూడా కేటాయింపు జరిగిపోతుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం జనన, మరణ సమాచారాన్ని మునిసిపాలిటిలకు తెలపాల్సి ఉంది. ఉచితం: ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రులు, పిహెచ్సిలో జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా పొందవచ్చు. నగరపాలక సంస్థలు, మునిసిపాలిటిల్లో సిఆర్ఎస్ సిస్టం అమలులోకి వచ్చాక ఇళ్ల వద్ద నుంచి ఆన్లైన్లో ఆ పత్రాలను ఉచితంగా పొందే సౌలభ్యం త్వరలోనే కలగనుంది. -
రాష్ట్రంలో 106 స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్స్
భీమవరం: రాష్ట్రంలో 106 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయగా వాటిలో జిల్లాలో డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు మరోచోట సీమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశామని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సీఈవో డాక్టర్ గంటా సుబ్బారావు చెప్పారు. మంగళవారం డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో మాట్లాడుతూ నైపుణ్య వికాస కార్యక్రమాల గురించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యు.రంగరాజు, ఏపిఎస్ఎస్బీసీ బృందం సభ్యురాలు లక్ష్మి ఉన్నారు. -
కిరాయి హంతకులే నిందితులు !
భీమవరం టౌ¯ŒS : భీమవరం పట్టణంలో గతనెల 21న రాత్రి జరిగిన రౌడీషీటర్ బైసాని రామకృష్ణ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. హత్యకు పాల్పడింది కిరాయి హంతకులేనని వెల్లడైనట్టు విశ్వశనీయ సమాచారం. ఏలూరు ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించి మాటు వేసి రామకృష్ణను మట్టుపెట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు కొందరు కొత్త వ్యక్తులు సుంకర పద్దయ్య వీధి, కఠారి వారి వీధి రెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరించినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. రామకృష్ణ ఇంటికి వెళ్లే దారిలో ఇద్దరు మాటువేయగా మరో ఇద్దరు మోటార్‌సైకిళ్లపై వెంబడిస్తూ ఎప్పటికప్పుడు ఫో¯ŒS ద్వారా సమాచారం ఇచ్చి అదును చూసి హత్య చేసినట్టుగా పోలీ సులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొందరిని అదుపులోకి తీసుకుని హత్యకు సూత్రధారులెవరు, ఘటనకు కారణాలు ఏమిటన్న దిశగా విచారిస్తున్నట్టు సమాచారం. -
జిల్లాకు క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం రాక
భీమవరం టౌన్: క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం జిల్లాకు విచ్చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహితం ఎంత వరకూ అమలు జరుగుతుందో ఈ బందం తనిఖీ చేస్తుంది. ఆరుబయట ఒకటి, రెండు విసర్జన రహిత పట్టణాలు, నగరాలకు ప్రధానమంత్రి చేతుల మీదుగా కేంద్ర పురస్కారం అందించనున్న నేపథ్యంలో స్వచ్చభారత్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్రబందం జిల్లాలోని పలు పట్టణాలు, నగరాలను సందర్శించనుంది. ఈ బృందం తమ తనిఖీలు నిర్వహించి, పరిశీలన చేసి పూర్తిగా సంతృప్తి చెందితే కేంద్ర పురస్కారానికి సిఫార్సు చేస్తారు. క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం ఈనెల 24వ తేదిన ఏలూరు నగరంలో, 25వ తేదిన నిడదవోలు, 26వ తేదిన భీమవరం, 27వ తేదిన జంగారెడ్డిగూడెం పట్టణాల్లో పర్యటిస్తారు. బహిరంగ మలవిసర్జన రహితాన్ని పాటించేందుకు గత కొన్ని నెలలుగా నగరపాలక సంస్థలు, మునిసిపాలిటిలు, నగర పంచాయితీలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రతీ ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు కమీషనర్లు, చైర్మన్లు నిమగ్నమయ్యారు. వ్యక్తిగత ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు రూ.15వేలు ఉచితంగా మంజూరు చేస్తుంది. కేంద్ర పురస్కారం అందుకునేందుకు పట్టణాలు, నగరాల్లో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రధాన కూడళ్లలో ప్రజల అవసరార్థం ప్రజా, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలి. తద్వారా ఆరుబయట బహిరంగ మలమూత్ర విసర్జన రహితాన్ని పాటించగలుగుతారు. పట్టణం, నగరంలోని ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలి. బహిరంగ మలమూత్ర విసర్జనా రహిత స్థితిని తెలుపుతూ మునిసిపాలిటిలు, నగరపాలక సంస్థలు, నగరపంచాయితీలు ధవీకరణ పత్రాన్ని స్వచ్చాంద్ర కార్పోరేషన్ ఎండి. డి.మురళీధరరెడ్డికి పంపాలి. ధవీకరణ పత్రం పంపే ముందు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, మునిసిపల్ కౌన్సిలర్లు, నగరపాలక సంస్థ కార్పోరేటర్లు, కోఆప్షన్ సభ్యుల నుంచి తమ పట్టణాలు, నగరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహితాన్ని పాటిస్తున్నామని పొందుపరచాలి. కౌన్సిల్లో ఈ ధవీకరణను ఆమోదించాలి. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియచేయాలని ప్రకటించాలి. ఈ నిబంధనలను ఇప్పటికే పలు పట్టణాలు, నగరాలు పూర్తి చేశాయి. తుది డాక్యుమెంటేషన్‌ను స్వచ్చాంద్ర కార్పోరేషన్ ఎండి.డి.మురళీధరరెడ్డికి ఈ మార్గదర్శకాల ప్రకారం పంపించారు. అక్కడి నుంచి స్వచ్చభారత్ కార్పోరేషన్‌కు డాక్యుమెంటేషన్లను పంపించారు. దీంతో క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బందం ఆయా పట్టణాలు, నగరాల్లో ఏ మేరకు బహిరంగ మలమూత్ర విసర్జన రహితం అమలు జరుగుతుందో తనిఖీ చేసేందుకు రానున్నారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
భీమవరం : భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణం తక్షణం నిలిపి వేయాలని, అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమవరంలో ప్రభుత్వ, పార్కు యాజమాన్య దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కమిటీ కార్యదర్శి బి.సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కును ఆరెంజ్ క్యాటగిరీలో చేర్చామని చుక్కనీరు కూడా గొంతేరు డ్రై యిన్‌లో కలవదని ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభ సందర్భంలో ప్రకటించిన సబ్‌కలెక్టర్ వందల కోట్ల రూపాయల ఖర్చుతో సముద్రంలోకి ప్రత్యేకSపైప్‌లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. ఫ్యాక్టరీకి అనుకూలంగా త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఫుడ్ పార్కు పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు కుటుంబ సమేతంగా నల్లబ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకుడు గాదిరాజు వెంకటసుబ్రహ్మణ్యంరాజు, సీపీఐ నాయకుడు మల్లుల సీతారామ్ ప్రసాద్, చేబోలు సత్యనారాయణ, ధనికొండ శ్రీనివాస్, ఎం.వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, కలిపిండి సత్యనారాయణ పాల్గొన్నారు. -
చెలరేగిన దొంగలు
భీమవరం టౌన్: భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో సోమవారం వేకువజామున ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై కె.సుధాకరరెడ్డి కథనం ప్రకారం.. అరటిపళ్లు వ్యాపారం చేసుకునే నూకల వెంకట పెద్దిరాజు ఆదివారం రాత్రి ఇంటి ఐరన్ గ్రిల్స్‌కు ఉన్న తలుపు వేయకుండా గెడపెట్టి నిద్రించారు. వేకువజామున 3.30 గంటల సమయంలో అలికిడి రావడంతో మేలుకోగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు. పెద్దిరాజు లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది రూ.90 వేల నగదు, తొమ్మిది కాసుల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బాధితుడు పెద్దిరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొవ్వూరులో.. కొవ్వూరు : పట్టణంలో శ్రీనివాసపురం కాలనీలో బాతుల మల్లికార్జున ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈనెల 11న మల్లికార్జున ఇంటికి తాళాలు వేసి తన మామయ్యకు అనారోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. 14న పక్కింటి వాళ్లు ఫోన్ చేసి ఇంటి తాళాలు పగలకొట్టి ఉన్నాయని, బీరువాలో వస్తువులన్నీ బయటికి తీసినట్టు ఉన్నాయని చెప్పారు. దీంతో అతను సోమవారం వచ్చి బీరువాలోని 26గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. -
చెలరేగిన దొంగలు
భీమవరం టౌన్: భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో సోమవారం వేకువజామున ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై కె.సుధాకరరెడ్డి కథనం ప్రకారం.. అరటిపళ్లు వ్యాపారం చేసుకునే నూకల వెంకట పెద్దిరాజు ఆదివారం రాత్రి ఇంటి ఐరన్ గ్రిల్స్‌కు ఉన్న తలుపు వేయకుండా గెడపెట్టి నిద్రించారు. వేకువజామున 3.30 గంటల సమయంలో అలికిడి రావడంతో మేలుకోగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు. పెద్దిరాజు లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది రూ.90 వేల నగదు, తొమ్మిది కాసుల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బాధితుడు పెద్దిరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొవ్వూరులో.. కొవ్వూరు : పట్టణంలో శ్రీనివాసపురం కాలనీలో బాతుల మల్లికార్జున ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈనెల 11న మల్లికార్జున ఇంటికి తాళాలు వేసి తన మామయ్యకు అనారోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. 14న పక్కింటి వాళ్లు ఫోన్ చేసి ఇంటి తాళాలు పగలకొట్టి ఉన్నాయని, బీరువాలో వస్తువులన్నీ బయటికి తీసినట్టు ఉన్నాయని చెప్పారు. దీంతో అతను సోమవారం వచ్చి బీరువాలోని 26గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపారు.