కిరాయి హంతకులే నిందితులు !
Published Thu, Nov 10 2016 5:10 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
భీమవరం టౌ¯ŒS : భీమవరం పట్టణంలో గతనెల 21న రాత్రి జరిగిన రౌడీషీటర్ బైసాని రామకృష్ణ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. హత్యకు పాల్పడింది కిరాయి హంతకులేనని వెల్లడైనట్టు విశ్వశనీయ సమాచారం. ఏలూరు ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించి మాటు వేసి రామకృష్ణను మట్టుపెట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు కొందరు కొత్త వ్యక్తులు సుంకర పద్దయ్య వీధి, కఠారి వారి వీధి రెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరించినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. రామకృష్ణ ఇంటికి వెళ్లే దారిలో ఇద్దరు మాటువేయగా మరో ఇద్దరు మోటార్‌సైకిళ్లపై వెంబడిస్తూ ఎప్పటికప్పుడు ఫో¯ŒS ద్వారా సమాచారం ఇచ్చి అదును చూసి హత్య చేసినట్టుగా పోలీ సులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొందరిని అదుపులోకి తీసుకుని హత్యకు సూత్రధారులెవరు, ఘటనకు కారణాలు ఏమిటన్న దిశగా విచారిస్తున్నట్టు సమాచారం.
Advertisement
Advertisement