AP Government Orders Gyms, Swimming Pools, Sports Complexes To Be Shut, Cinema halls,Public Transport To Open With 50% Occupancy - Sakshi
Sakshi News home page

ఏపీ: థియేటర్లలో 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి

Published Mon, Apr 26 2021 7:47 PM | Last Updated on Mon, Apr 26 2021 9:01 PM

AP Government Orders To Close Gym And Stadiums - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిమ్‌లు, స్టేడియాలు, స్విమ్మింగ్‌పూల్స్‌ మూసివేయమని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక ఇక మీదట ఏ వేడుకకైనా 50 మందికి మాత్రమే అనుమతి అని ఏపీ వైద్యశాఖ స్పష్టం చేసింది. 50 శాతం పరిమితితోనే ప్రజారవాణాకు అనుమతిస్తామని.. సినిమా థియేటర్లలో 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి అని తెలిపింది. అలానే ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌తో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది.

కోవిడ్‌ చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను సమకూరుస్తున్నాం.. రెమిడెసివిర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నది. రెమిడెసివిర్‌ కొరత ఉంటే హెల్ఫ్‌లైన్‌ నంబర్లకు కాల్‌ చేయాలని సూచించింది. మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగాన్ని పర్యవేక్షిస్తున్నామని.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య శాఖ తెలిపింది. 

చదవండి: ఏపీ: పేదలకు 10 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement