చిత్తూరులో ఎర్రచందనం కూలీలు మరోసారి రెచ్చిపోయారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఆదివారం రాత్రి పోలీసులకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కూలీలు ఎదురుపడ్డారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నస్తుండగా పోలీసులపై రాళ్ల దాడి చేశారు.