తిరుమలలో చిరుత హల్ చల్ | Leopard halchal at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో చిరుత హల్ చల్

Published Fri, Mar 28 2014 10:18 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Leopard halchal at tirumala

తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయ మళ్లీ మంటలు చెలరేగాయి.ఆ అటవీ ప్రాంతంలోని ఓ చిరుత భయంతో తిరుమలలో ప్రవేశించింది. దేవదేవుని దర్శించుకునేందుకు తిరుమల వచ్చిన భక్తులు ఆ చిరుతను చూసి పరుగు తీశారు. ఆ చిరుత ఈవో కార్యాలయం వద్ద హాల్చల్ చేయడంతో అటవీశాఖ, టీటీడీ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

పాపవినాశనం మార్గంలోని జపాలి తీర్థం సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లో మంటలు ఎగసి పడి శేషాచల అటవీప్రాంతంలో మంటలు రాజుకున్నాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ మంటలు ఆర్పేందుకు  అటు టీటీడీ, ఇటు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. భక్తుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement