తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో బాలుపల్లి రేంజ్ కందిమడుగు వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. అయితే పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు ఎర్రచందనం కూలీలను రక్షించేందుకు ప్రయత్నించారు. అందులోభాగంగా పోలీసులపైకి ఎర్రచందనం కూలీలు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై.... గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పరారైయ్యారు. పోలీసులు వారి కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
శేషాచల అడవుల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు నేతృత్వంలో కూంబింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
పోలీసులపై రాళ్లు రువ్విన ఎర్రచందనం కూలీలు
Published Sun, Feb 21 2016 12:06 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement