టాస్క్ ఫోర్స్ పై ఎర్రకూలీల రాళ్లదాడి | red sandal workers throwing stones on task force police | Sakshi
Sakshi News home page

టాస్క్ ఫోర్స్ పై ఎర్రకూలీల రాళ్లదాడి

Feb 16 2017 7:46 AM | Updated on Aug 21 2018 7:18 PM

చిత్తూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

తిరుపతి: చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భాకరాపేట సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఎర్ర కూలీలు పోలీసులకు తారసపడ్డారు.

అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులపై రాళ్లతో దాడిచేసి ఎర్రచందనం కూలీలు అక్కడినుంచి పరారయ్యారు. రూ.20 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement