తిరుమలలోని శేషాచలం అడవుల్లో సోమవారం మంటలు చెలరేగాయి.

చిత్తూరు: తిరుమలలోని శేషాచలం అడవుల్లో సోమవారం మంటలు చెలరేగాయి. శ్రీవారి మెట్టు సమీపంలోని చీకటీగల కోన, బాలాజీనగర్ అటవీ ప్రాంతాల్లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి సమయం కావడంతో కొండ కింద ప్రాంతాలకు ఎగిసిపడుతున్న మంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.