25 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్‌ | redsander caunght in nellore district | Sakshi
Sakshi News home page

25 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్‌

Published Thu, Jun 15 2017 11:48 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

redsander caunght in nellore district

మర్రిపాడు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడు అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గురువారం వేకువజామున అడవిలో గాలింపు చేపట్టిన పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దీంతో 25 మంది కూలీలను అరెస్ట్‌ చేసి.. 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు కూలీలు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ చీకటిలో వంతెన పై నుంచి కిందకు దూకడంతో గాయపడ్డారు. కూలీలందరూ తమిళనాడుకు చెందినవారేనని పోలీసులు తెలిపారు. వీరు మూడురోజుల క్రితమే అడవిలోకి వచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement