చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న కూంబింగ్ | redsander seized in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న కూంబింగ్

Published Thu, Feb 18 2016 9:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

redsander seized in chittoor district

అయిరాల: అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనం చెడిపోవడంతో వాహనంతో పాటు దుంగలను అందులోనె వదిలేసి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. తవేరా వాహనంలో 14 ఎర్ర దుంగలను తరలిస్తుండగా.. గేర్ రాడ్డుకు అడ్డంగా ఓ దుంగ ఇరుక్కోవడంతో వాహనం మొరాయించింది. ఇది గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే బయపడిన దుండగులు దుంగలతో పాటు వాహనాన్ని వదిలి పరారయ్యారు.

ఈ సంఘటన చిత్తూరు జిల్లా అయిరాల మండలం చెంగన్నపల్లి గ్రామ సమీపంలోని పెద్దకొండ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. దుంగలను పాటూరు నుంచి కానిపాకం తీసుకెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దుంగలను స్వాధీనం చేసుకొని స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్మగర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement