ముంచిన వర్షం
వరంగల్, న్యూస్‌లైన్ : నోటికాడికొచ్చిన ధాన్యం నీటిపాలైంది. చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశారుు. వరుస వానలు వారిని నట్టేట ముంచారుు. అల్పపీడన ద్రోణితో జిల్లాలో శుక్రవారం కురిసిన అకాలవర్షంతో కోతకొచ్చిన వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి తోటలతో పాటు కూరగాయాల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులకు అమ్మకానికి రైతులు తెచ్చిన 25 వేల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కొత్తగూడ మండలంలో ఆకస్మికంగా వచ్చిన సుడిగాలికి రామన్నగూడెం, లడాయిగడ్డ, ముస్మి, ముస్మీతండా గ్రామాల్లో ఆస్తినష్టం జరిగింది. 43 రేకుల ఇళ్లు, పూరిళ్ల కప్పులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 11 వేల హెక్టార్ల పరిధి లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. వ్యవసాయ శాఖ అధికారులు ఎన్నికల విధుల్లో భాగంగా శిక్షణలో ఉన్నందున పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయలేకపోయారు.
చేలల్లోనే నేలరాలిన పంటలు
చేతికొచ్చిన పంటలు చేలల్లోనే నాశనమయ్యాయి. 11 వేల హెక్టార్ల పరిధిలో వరి, మిర్చి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్‌పర్తిలో నాలు గు వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతింది. పరకాల సెగ్మంట్‌లోని పరకాల, గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఉన్న గొర్రెకుంట, స్తంభంపల్లి, ధర్మారం, పోతరాజుపల్లి ప్రాంతాల్లో ఆకాల వర్షంతో వెరుు్య ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. ములుగు నియోజకవర్గ పరిధిలోని గోవిందరావుపేట, వెంకటాపూర్, మం గపేట, కొత్తగూడ మండలాల్లో నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
నర్సం పేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపూర్, నల్లబెల్లి మండలాల్లో కోతకొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యూరుు. సుమారు 4,500 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. జనగామ నియోజకవర్గం లోని జనగామ, చేర్యాల, బచ్చన్నపేట ప్రాం తంలో 2,500 ఎకరాల్లో ధాన్యం కోతకు రాగా... మొదళ్లు తడిసి గింజలు రాలిపోయా యి. మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు మండలాల్లో 4,300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి, మరిపెడ, నర్సింహులపేటలో 800 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని జఫర్‌గఢ్, ధర్మసాగర్, రఘునాథపల్లి, లింగాలఘన్‌పూర్‌లో 500 ఎకరాల విస్తీర్ణంలో పంట లు దెబ్బతిన్నాయి. రెండు వేల హెక్టార్లలో కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి.
టార్పాలిన్ లేక తల్లడిల్లిన రైతులు
తొర్రూరు, పాలకుర్తి, రాయపర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, చెన్నారావుపేట, దుగ్గొండి, బచ్చన్నపేట, జనగామ, మహబూబాబాద్, కురవి, కేసముద్రం, నెల్లికుదురు, నర్సింహులపేట, నల్లబెల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక 10వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. నర్సంపేట, జనగామ, పరకాల, వరంగల్, కేసముద్రం, మార్కెట్లలో 15వేల బస్తాల ధాన్యం, మిర్చి నీటిపాలైంది. పరకాల మార్కెట్‌లో వెయ్యి క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌రైస్ కోసం కొనుగోలు చేస్తామని జిల్లా ఐకేపీ మార్కెటింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ కరుణాకర్‌రావు తెలిపారు.