తిరుమల : తిరుమలలో శనివారం మధ్యాహ్నం వడగండ్ల వాన కురిసింది. దీంతో శ్రీవారి భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ ఆవరణలో నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం టీటీడీ సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఏడాది అకాల వర్షాలు పడుతుండటంతో రైతులు భయాందోళనలో ఉన్నారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి పంటలు చేతికి వచ్చే దశలో అకాల వర్షాలు పడడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
తిరుమలలో వడగండ్ల వాన
Published Sat, Apr 25 2015 3:29 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM
Advertisement
Advertisement