పప్పు ధరల సెగ
- మేలో రిటైల్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 5.01 శాతానికి అప్
- ఏప్రిల్‌లో ఈ రేటు 4.87 శాతం
న్యూఢిల్లీ: పప్పు దినుసుల ధరల భారీ పెరుగుదల ప్రభావం మే నెల రిటైల్ ద్రవ్యోల్బణంపై పడింది. రిటైల్ ధరలు వార్షిక ప్రాతిపదికన మేలో 5.01 శాతం పెరిగాయి. అంటే 2014 మేలో ఉన్న మొత్తం రిటైల్ బాస్కెట్ ధర తో పోలిస్తే 2015 మేలో 5.01 శాతం పెరిగిందన్నమాట. ఏప్రిల్‌లో ఈ రేటు 4.87 శాతం. అకాల వర్షాల వంటి అననుకూల వాతావరణం వల్ల 2014-15 పంట కాలంలో (జూలై-జూన్) పప్పు దినుసుల ఉత్పత్తి పడిపోయింది. 2013-14 పంట కాలంలో ఉత్పత్తి 19.78 మిలియన్ టన్నులయితే, తాజాగా ముగుస్తున్న కాలంలో ఈ పరిమాణం దాదాపు 18 టన్నులకే పరిమితమవుతుందని అంచనా. ఈ ప్రభావంతో ఈ కమోడిటీ ధరలు భారీగా పెరిగాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం...
- ఆహారం, పానీయాలు: ఈ విభాగంలో ధరల పెరుగుదల 5.13 శాతంగా ఉంది. ఈ బాస్కెట్‌లో ఉత్పత్తులను వేర్వేరుగా చూస్తే- చక్కెర, తీపిపదార్థాల ధరలు మాత్రం వార్షికంగా 7.30 శాతం తగ్గాయి. అలాగే గుడ్ల రేట్లు కూడా 0.78 శాతం తగ్గాయి. ఒక్క పప్పుదినుసుల ధరలు మాత్రం రెండంకెలు పైగా వార్షికంగా 16.62 శాతం పెరిగాయి. తృణ ధాన్యాల ధరలు 1.98 శాతం, మాంసం-చేపల ధరలు 5.43 శాతం, పాలు, పాల ఉత్పత్తుల ధరలు 7.43 శాతం, చమురు-వెన్న విభాగంలో ధరలు 1.95 శాతం పెరిగాయి. ముఖ్యంగా పండ్ల ధరలు 3.84 శాతం, కూరగాయల ధరలు 4.64 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 8.82 శాతం ఎగశాయి. ఆల్కాహాలేతర పానీయాల ధరలు 4.84 శాతం, హోటల్స్ మీల్స్ ధరలు 7.89 శాతం పెరిగాయి.
- పాన్, పొగాకు, మత్తుప్రేరిత పదార్థాలు: ఈ విభాగంలో ధరలు 9.50 శాతం ఎగశాయి.
- దుస్తులు, పాదరక్షలు: 6.2 శాతం పెరగుదల