రాష్ట్రంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లిన విషయాన్ని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, రాధామోహన్‌సింగ్‌ల దృష్టికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీసుకెళ్లారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లిన విషయాన్ని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, రాధామోహన్‌సింగ్‌ల దృష్టికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీసుకెళ్లారు. పలు ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలు, నష్టంపై వారికి వివరించి.. రైతులను ఆదుకోవాల్సిందిగా కోరారు. దీంతోపాటు తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఆరా తీశారు.
ఇక వర్షాల కారణంగా ఏర్పడిన నష్టం వివరాలను పరిశీలించడంతో పాటు రైతు ఉపశమన చర్యల కోసం వెంకయ్యనాయుడు బుధవారం బాధిత జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, మదన్ భాయ్ ఖండారియా కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు.