గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి వరదా ఎస్‌వీ కృష్ణకిరణ్ : రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లు వెల్లువలా కొనసా గుతున్నాయి. అకాల వర్షాల సమయంలో కోసిన ధాన్యాన్ని.. కోసినట్టుగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. తడిసిన, నూక ధాన్యాన్ని సైతం (బ్రోకెన్ రైస్) ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టాల ఊబి నుంచి రైతులను గట్టెక్కించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.
తొలిసారిగా జయ రకం (బొండా లు) ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో ప్రైవేట్ మార్కెట్‌లో ఆ పంటకు మంచి ధర పలుకుతోంది. బుధవారం సాయంత్రానికి రూ. 2,541.51 కోట్ల విలువైన 12.45 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా ప్రభుత్వం కొనుగోలు చే సింది. ఇందులో ధాన్యం విక్రయించిన 1.38 లక్షల మంది రైతులకు గాను 96 వేల మందికి రూ.1,673 కోట్లకు పైగా చెల్లింపులు పూర్తి చేసింది.
బాయిల్డ్ మిల్లులకు తరలింపు
వరి కోతలు ప్రారంభమైన దశలో అకాల వర్షాలు కు రవడం.. ఆ తరువాత అధిక ఉష్ణోగ్రతలతో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య తలెత్తింది. దీనిని సా కుగా చూపించి రైతులను మిల్లర్లు మోసం చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంబేడ్కర్ కోనసీ మ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున.. ఏలూరు, కాకినా డ, తూర్పు గోదావరి జిల్లా ల్లో బ్రోకెన్స్ అధికంగా వ స్తు న్న ప్రాంతాల్లో మొబైల్ మి ల్లులను ప్రభుత్వం ఏర్పా టు చేసింది.
రైతులు ముందుగా నే శాంపిళ్లను మొబైల్ మి ల్లు ల్లో మరాడించి.. అక్కడ ఇచ్చే రశీదు ఆధారంగా ధా న్యాన్ని విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. ముక్క విరుగు డు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి కొనుగోలు చేస్తూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. జయ రకం (బొండాలు) ధాన్యానికి కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుండటంతో మార్కెట్‌లో పోటీ పెరిగింది.
ప్రైవేట్ వ్యాపారులు మంచి ధరకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. జయ రకం ఎక్కువగా పండించిన ప్రాంతంలో కళ్లాల్లోకి వచ్చి మరీ బస్తా (75 కేజీలు) రూ.1,500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ రకాన్ని తక్కువ పండించిన ప్రాంతాల్లో అయితే.. బస్తాకు రూ. 1,600–రూ.1,700 కూడా చెల్లిస్తున్నారు.
రూ.5 కోట్ల కార్పస్ ఫండ్
రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు వేగంగా మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ఉమ్మడి గోదావరి పరిధిలోని 5 జిల్లాలకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్ల కార్పస్ ఫండ్‌ను ముందుగానే విడుదల చేసింది. ఫలితంగా ఆయా జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితు లకు అనుగుణంగా వాహనాలు, కూలీలను ఏ ర్పాటు చేస్తూ రైతులకు భారాన్ని తగ్గిస్తున్నారు. ఒకవేళ రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే ఆ మొత్తాన్ని కూడా మద్దతు ధరతో కలిపి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
వాస్తవ పరిస్థితి ఇదీ..
♦ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 90 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో ఇంకా కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం శివరామ్ చెప్పారు.
♦ తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల టన్నుల దిగుబడిలో సగానికి పైగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. బొండాలు రకం సాగు చేసిన రైతులు బయట మార్కెట్‌లోనే ఎక్కువగా విక్రయిస్తున్నారని పౌర సరఫరాల సంస్థ జిల్లా అధికారి కుమార్ తెలిపారు.
♦ కాకినాడ జిల్లాలో 10 శాతం విస్తీర్ణంలో కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం పుష్పమణి చెప్పారు.
♦ ఏలూరు జిల్లాలో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య అధికంగా ఉంది. ఆ ధాన్యాన్ని కృష్ణా జిల్లాలోని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం భార్గవి చెప్పారు. చింతలపూడి, లింగపాలెం, చాట్రాయి, పోలవరం ప్రాంతాల్లో కోతలు ఆలస్యంగా జరుగుతున్నాయి.
♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోతలు ఆలస్యం కావడంతో ధాన్యం ఇంకా పొలాలు, కళ్లాల్లోనే ఉంది. ఇక్కడ పంటను వేగంగా కొనుగోలు చేసేందుకు వీలుగా దగ్గర మిల్లులకే ధాన్యం తరలించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం సాగర్ తెలిపారు. మొత్తంగా అన్నిచోట్లా జూన్ రెండో వారంలోగా కొనుగోళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు
వర్షాల్లోనూ కొన్నారు
ఇటీవల కురిసిన వర్షాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తీరు రైతుల్లో భరోసా నింపింది. అంత యుద్ధప్రాతిపదికన ఎక్కడి ధాన్యాన్ని అక్కడే ఆఫ్‌లైన్‌లో కొనేసి వెంటనే మిల్లులకు తరలించారు. నేను కూడా ఆ సమయంలో కొంత, వారం కిందట 582 బస్తాల (ఒక్కో బస్తా 40 కేజీలు) ధాన్యాన్ని విక్రయించాను. డబ్బులు కూడా చాలా వేగంగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. – సూర్య నారాయణరాజు, లొల్ల, అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఎంతైనా కొంటాం
అకాల వర్షాల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేశాం. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఇంకా కోతలు చేయాల్సి ఉంది. రైతులు తెచి్చన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ
రైతులు నష్టపోకుండా చర్యలు
ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు ఈ ఫీడ్‌బ్యాక్ కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా వ్యవస్థలో జవాబుదారీ పెంచడం, రైతులు నష్టపోకుండా కాపాడటమే ప్రధాన ఉద్దేశం. ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ను ఆయా జిల్లాలకు పంపిస్తున్నాం. రైతులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా మిల్లులను కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తున్నాం. జేసీలకు చెప్పి ఆ మొత్తాన్ని రైతులకు వెనక్కి ఇప్పిస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment