నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: అకాల వర్షాలు అన్నదాతను ఆవేదనకు గురి చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. జిల్లాలోని చాలా చోట్ల ఇప్పటికే వరి కోతలు పూర్తి అయ్యాయి. కళ్లాల లో ధాన్యం కుప్పలుగా పోసి ఉంది. కొ నుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యానికి కూడా రక్షణ లేకుండా పోయింది. అకాల వర్షాలతో వేలాది బస్తాల ధాన్యం తడిసి ముద్దగా మారింది.
వందలాది ఎకరాలలో పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో 289 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతులు కళ్లాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న తరు ణంలోనే వర్షం కురియడం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. జిల్లాలో 60 వేల క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దీని నష్టం రూ. 80.70 లక్షల వరకు ఉంటుందని అంచనా. వడ్ల గింజలు రాలిపోయి పొ లంలోనే మొలకెత్తుతున్నాయి. ఇప్పటికే 183 హెక్టార్లలో వరి పంట నీటి పాలైంది. దీని నష్టం రూ. 18.30 లక్షలుగా ఉంటుందని వ్యవసాయశాఖ ధికారులు పే ర్కొంటున్నారు. నష్టం విలువ రూ.99 లక్షల వరకు ఉంటుందని అంచనాకు వచ్చారు.
నివేదికను అతి త్వరలోనే ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, మార్కెట్ యార్డులలో అధికారులు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతుల కళ్లముందే ధాన్యం నీళ్ల పాలైంది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో వ్యాపారులకు చెందిన ఐదు వేల బస్తాలు, రైతులకు చెందిన 1100 బస్తాలు నీటి పాలయ్యాయి. రంగుమారిన ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారని వారు ఆవేదన చెందుతున్నారు.
సిరికొండలో అధిక వర్షపాతం
జిల్లాలోని అత్యధికంగా సిరికొండలో వర్షపాతం న మోదైంది. ఇక్కడ 12.8 మి.మీటర్ల వర్షం కురిసింది. నాగిరెడ్డిపేటలో 7.2 మి.మీటర్లు, ఎల్లారెడ్డిలో 6.0 మి. మీ, సదాశివనగర్‌లో 5.0 మి.మీ, ధర్పల్లిలో 4.2 మి. మీ, ఆర్మూర్‌లో 3.0 మి.మీ, కామారెడ్డిలో 4.8 మి. మీ, తాడ్వాయిలో 5.0మి.మీ. వర్షపాతం నమోదైంది.
అకాల వర్షాలతో నష్టం రూ 99 లక్షలు
Published Sun, May 11 2014 1:33 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement